Home Blog

“అయ్యో దేవుడా…….

—- నరేష్ కుమార్ సూఫీ —

క్రీస్తుకు పూర్వమే… ఈజిప్టులో మరణించినవాళ్ళు మళ్లీ బతికొస్తారని నమ్మేవాళ్ళు. డెడ్ బాడీలని మమ్మీఫై చేసి భద్రంగా దాచిపెట్టేవాళ్ళు. ఎవడి స్థోమతని బట్టి వాడు వస్తువులు, బంగారం కొన్నిసార్లు బానిసలని (అంటే మనుషులే) కూడా ఉంచి పిరమిడ్ అనే సమాధిని మూసేసేవాళ్ళు… వేల సంవత్సరాలు గడిచాయి. ఒక్కడంటే ఒక్కడు కూడా లేచిరాలేదు. కానీ ఆ మమ్మీలు మాత్రం ప్రయోగశాలలకి, ప్రదర్శన శాలలకి తరలించబడ్డాయి. అలా ఈజిప్టులో చనిపోయిన ఓ పదహారేళ్ళ అమ్మాయి మమ్మీఫైడ్ బాడీ మన హైదరాబాద్ మ్యూజియంలో కూడా ఉంది. ఆమె ప్రసవంలో వచ్చిన ఇబ్బందివాళ్ళ చనిపోయి ఉంటుందని తేల్చారు. Mommy కాబోయి Mummy అయిపోయిన ఆ శరీరాన్ని చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన. ఎదో ఒకనాడు ఆ పిల్ల బతికితీరుతుందనే నమ్మకంతోనే కదా.. ఆమె తల్లితండ్రులు ఆమెమృతదేహాన్ని అలా భద్రపరిచారు. కానీ కొన్ని వేల సంవత్సరాలు తర్వాత ఖండాలు దాటి వెళ్లి మరీ ఇలా ప్రదర్శనలో తమ బిడ్డ శరీరం ఉంచబడుతుందని ముందే తెలిసి ఉంటే…ఆమె తల్లి అలా మమ్మీని చేయటానికి ఒప్పుకునేదా?!?? ఖచ్చితంగా ఒప్పుకునేది కాదనే అనిపించింది… ఏ నమ్మకంతో ఆమె తనబిడ్డని అట్లా ఉంచిందో ఆ నమ్మకం ఆమె బిడ్డ శరీరాన్ని ఇక్కడ ఒక మ్యూజియంలో ఉంచింది… ఎంత దారుణం..
2018లో కూడా ఒక కుటుంబంలో ఉన్న పదకొండు మంది ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ దొరికిన ఆధారాలని బట్టి వాళ్లంతా “మోక్షం దక్కుతుందని, స్వర్గానికి వెళతామని నమ్మకంతో చనిపోయారు. అలాగే.. మొన్నటికి మొన్న యూపీలో పిల్లలు పుట్టటానికని పక్కింటి పిల్లని కిడ్నాప్ చేసి, బలిచ్చి ఆమె శరీర అవయవాలని తిన్నారు. కరోనాని కట్టడి చేస్తా అంటూ ఓ 50 ఏళ్ల వ్యక్తిని బలి ఇచ్చాడు ఒరిస్సాలో ఒక పూజారి. గుప్త నిధులకోసం, పెద్ద పెద్ద భవనాల ఓపెనింగ్ కి ముందు.. నరబలి వార్తలు చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఆ సంఘటనలో ఉన్నవాళ్ళని తిట్టి,వాళ్ళ గుడ్డి నమ్మకానికి విస్తుపోయి. “అయ్యో దేవుడా!” అని నిట్టూరుస్తుంటారు కొంతమంది. ఇక్కడ ఒకసారి ఫిడెల్ క్యాస్ట్రో మాటలని గుర్తు చేసుకుందాం. “ఎవరైనా ఒక పసివాన్ని హత్య చేస్తే అయ్యో పాపం అంటారు. కానీ పోషకాహారం దొరకక, మందులు లేక వందల మంది పిల్లలు చనిపోతుంటే నోరు మెదపరు” అంటాడు. నిజమే మన దృష్టిలో అవన్నీ “ఖర్మ కొద్దీ సంభవించే మరణాలు”
యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి చనిపోతే గుద్దిన వాహణదారుడి మీద దాడి చేస్తారు. వైద్యం ఆలస్యం అయితే డాక్టర్ మీద దాడి చేస్తారు. కానీ పూజ చేస్తే రోగం తగ్గుతుంది అని హాస్పిటల్ కి వెళ్లకుండా చేసే పూజారి మీద? స్వస్థత పరుస్తాను అని ప్రేయర్ చేసే పాస్టర్ మీద?? ఏ దాడి ఉండదు. ఒకప్పుడు పాముకరిస్తే “పాముల నర్సయ్యకి ఫోన్ చేసేవాళ్లట” ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తున్నారు. “పుట్టలో పాలు పోయటం మారలేదు” పాముల మీద ఇంత భక్తి ఉన్నవాళ్లు. వేల రకాల పాముల, సారీసృపాల జాతులే అంతరించిపోయేలా జరిగే గ్రానైట్ తవ్వకాలు, చిట్టడవులని, పొలాలని నాశనం చేసే రియల్ ఎస్టేటులు విషయాలు కన్వీనియంట్ గా మర్చిపోతారు.
ఇప్పుడు ఈ విషయాలన్నింటిని గుర్తు చేసుకోవటానికి కారణం అయిన ఘటన విషయానికి వస్తే… మదన పల్లెలో చనిపోయిన ఇద్దరూపిల్లలని చంపింది వాళ్ళ అమ్మానాన్నలు కాదు. మతం చంపింది, దేవుడు అనే పిచ్చినమ్మకం చంపింది. పునర్జన్మ, ఖర్మ సిద్ధాంతం, చనిపోయాక ఉండే అధిభౌతిక లోకాలు లాంటి కల్పనా సాహిత్యం చంపింది. అదంతా తెలిసినా కూడా ఆ కల్పనల మీద ఉన్నానమ్మకం మాత్రం ఆ ఇద్దరు తల్లితండ్రుల “మూఢనమ్మకం” చుట్టూనే తిరుగుతోంది. ఆత్మలు, దెయ్యాలు అనేమాటలు వినీ, వినీ అవి నిజంగా ఉన్నాయి అని నమ్మేవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. సాయిబాబా నా కలలో వచ్చి మాట్లాడతాడు, పుట్టబాబా విభూతి కురిపిస్తాడు అనే మాటలు వింటూ ఆహా మహిమ అనుకున్నా, ఏసుప్రభువు నాతో ప్రేయర్లో మాట్లాడుతాడు అని చెప్పినా వాళ్ళని వెంటనే సైకియాట్రీస్ట్ కి చూపించాల్సిన వాళ్ళు. సైలెంట్ గా ఉండిపోతారు. తర్వాత మొన్న వాళ్ళ కొలీగ్స్ లాగా… ఇప్పుడే విషయం తెల్సినట్టు “ఆశ్చర్యం నటిస్తారు”.
అత్యంత వేగంగా ఆరాధనా భక్తికంటే దారుణంగా ప్రజల్లోకి అండర్ కరెంట్ గా వ్యాపిస్తున్నది. “తంత్ర, మెడిటేషన్, జీసస్ ప్రేయర్” లాంటివి. దర్గాల్లో తాయెత్తులు కట్టే ముల్లాల కంటే దారుణంగా లక్షల ఖర్చుతో టెంట్లు వేసి సువార్త సభల్లో సాక్షం ఇప్పించి మరీ దయ్యాలను తోలే ఆటలు ఆడుతున్నారు పాస్టర్లు. మెడిటేషన్ ద్వారా ఎదో అభౌతిక లోకాల దర్శనం జరుగుతుంది అంటూ జనాలని మెల్లగా అలవాటు చేస్తున్నారు బాబాలు, సద్గురువులు. రెండు నిమిషాలు కార్బన్ డై ఆక్సయిడ్ లెవెల్స్ మన బ్రెయిన్ లో పెరిగినా, బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినా కలిగే యిల్యూజన్స్ లాంటిదే ఆ ధ్యాన పద్ధతుల్లో జరిగితే అదే ధ్యానం వల్ల కలిగే అనుభూతి అని నమ్మిస్తున్నారు. మెడిటేషన్ రూపాన్నే మార్చేస్తున్నారు…. వీటన్నిటిని నమ్మేది ఇప్పుడు ఆ పేరెంట్స్ ని వెక్కిరిస్తున్నవాళ్లే. మేము “మూఢభక్తులం కాదు” ఆ పరమాత్ముని నమ్ముతాం అంతే అనేవాళ్ళు “ఆ మూఢత్వంలోకి వెళ్ళేవాళ్ళకి ఇండైరెక్ట్ సపోర్ట్ తామే అని గ్రహించలేక పోతున్నారు.
గుళ్ళూ, చర్చిలు, మతాలు….. నమ్మకాలు, ఆత్మహత్యలు, హత్యలు…. వీటన్నిటికీ కారణం చదువు లేకపోవటం కాదు… వాటికి కారణం మనిషి తాను సొంతగా ఒక్క నిమిషం ఆలోచించుకోలేక పోవటం. హత్య, దారుణ హత్యల్లో ప్రాణం తీయటం అనేది ఎంత నిజమో… “భక్తి నమ్మకం..మూఢభక్తి నమ్మకం” రెండూ ఒకటే అన్నది కూడా అంతే నిజం…

భ‌క్తి విక‌టిస్తే చ‌స్తార్రోయ్‌..

– ఇండస్ మార్టిన్

2019 అగస్ట్ 30, గుర్తే వుంటుంది మీకు. అమలాపురంలో పెనుమత్సం రామక్రిష్ణం రాజు భార్యా కొడుకులతో పాటు పాయిజన్ ఇంజెక్షన్లు తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పరిశోధనలలో తేలింది ఏమంటే ఆయన రైస్ పుల్లింగ్ రాగి పాత్ర కోసం మాఫియాతో బేరసారాలు సాగించి కోటి రూపాయలు మోసపోయాడు. ఇవాళ్ళ మదనపల్లి పురుషోత్తం నాయుడూ, ఆయన భార్య పద్మజ కలిసి ఎదిగిన ఇద్దరు కూతుళ్ళను పాశవికంగా హత్య చేశారు. కారణం తాంత్రిక భక్తి, జిగ్గీ శిష్యరికం . రెండు కుటుంబాలూ విధ్యాధికులే. సమాజం దృష్టిలో మేధోవర్గానికి చెందినవాళ్ళు. ఒక కుటుంబం ప్రాణం పోసే వృత్తిలో, మరో కుటుంబం జ్ఞానంపోసే వృత్తిలో… బహుశా వీళ్ళు బతికి వున్నప్పుడు ఎందరో వీరిని మార్గదర్శకులు అనుకుని ఉంటారు. వాళ్ళ సలహా మేరకు ఎందరో తమ జీవితాల్లో సర్దుబాట్లూ మర్పులూ చేసుకునే ఉంటారు. వీళ్ళ జీవన విధానం ఎంతో కొంత మందికి ఆదర్శం అయ్యే వుంటుంది.

కానీ వీళ్ళు మాత్రం మూఢవిశ్వాసాలకూ, బాబాలకూ, సద్గురువులకూ బానిసలు. ఐనప్పటికీ వీళ్ళ జీవితాల్లో ఉన్నతవిధ్య, ఐశ్వర్యం, గౌరవం అనేవి ఎలా సాధ్యం అయ్యాయీ? ఈ దేశంలో చదువులూ, పదవులూ అనేవి జ్ఞానంతో ముడిపడని విషయాలు అని ఋజువు అవుతుంది కదా! మనచుట్టూ రోజూ జ్ఞాన వితరణ చేసే అనేకమందిని జ్ఞాపకం చేసుకుందాం. రోజూ . వీళ్ళల్లో డాక్టర్లూ, లాయర్లూ, సైకాలజిస్టులూ, మరీ ముఖ్యంగా చేతులూ కాళ్ళూ రికెట్స్ వచ్చి మెలితిరిగిన రచైతలూ కూడా ఉంటారు. వాళ్ళ మాటలకు ఇంతేసి విలువ ఎలా వస్తుందీ? ఒక్కొక్కరి నోటిముత్యాలకోసం దోసిళ్ళు పట్టి ఎదురు చూసే స్నేహితులు మనకు కనబడతారు. ఎలా సాధ్యం అయ్యింది వాళ్ళకు ఇదంతా? జవాబు పైన ఉదహరించిన రెండు కుటుంబాల కథల్లో ఉంది. చేసే వృత్తినిబట్టీ, అందునా కొన్ని వృత్తులకు అప్పనంగా అంటకట్టుకున్న అపార గౌరవాన్నిబట్టీ ఇదంతా సాధ్యం అవుతుంది.

కానీ సత్యం మరోలా ఉంది. మనకు రోజూ దోసిళ్ళకొద్దీ ఉచిత జ్ఞానామృత దానం చేసే వీళ్లల్లో ఎందరో, లేదా అందరూ ( ఎవ్వరమూ అతీతులం కాదు) పచ్చి నేలబారు జీవులు అయివుండవచ్చు. వీళ్ళను ఒకసారి గమనించండి. అందరూ ఏదో ఒక పెద్ద ఉద్యోగమో, భద్రజీవితమో, పెద్ద పేరుగలిగిన కుటుంబ నేపధ్యమో, అంతకన్నా పెద్ద ఇంటిపేరో (దదనుగుణమైన కులమో) కలిగి ఉంటారు. నాలుగు కవిత్వ సంకలనాలు వేసి సంకలు కొట్టుకునే ప్రతీ ఒక్కరూ ఇక్కడ పెద్దముతైదువలు. నాలుగు సంకలనాలు ప్రచురిస్తే చాలు…. శబరిమలై గురుస్వాములే.. ఇరుముడులు వెయ్యనూ, విప్పనూ …. అన్నీ వాళ్ళకే సాధ్యం. ఒకళ్ళు ప్రొఫెసర్ అంటారు, మరొకరు సామాజికవేత్త, మనోవిజ్ఞాన దుత్త అంటూ ముందుకు వస్తారు. ఏకాఏకీ పంచాయితీలూ, కోర్టులు, తీర్పులూ, శిక్షలూ అమలు చేస్తూ ఉంటారు. నాకు అర్ధం కాక అడుగుతాను…. సామాజిక మాధ్యమాల్లో ఉన్న, వీళ్ళ ఫ్రెండ్ లిస్టుల్లో ఉన్నవాళ్ళ వ్యక్తిగత జీవితాల వరకూ వెళ్ళి తీర్పులూ, శిక్షలూ ప్రకటిస్తారు కదా… అంటే వీళ్ళతో పరిచయం లేని వాళ్ళు వీళ్ళ శిక్షాస్మృతి జూరిస్డిక్షన్ లోకి రారు అనే కదా? ఆ లెక్కన వీళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం అనే కదా మనం అనుకోవాలి!

మన కాలనీలో ఉండే కౌన్సిలర్ అందరికన్నా జ్ఞాని. వాడు శ్రీశైలం వెళ్ళాలంటే మొత్తం కాలనీ అంతటినీ బయలుదేరదీస్తాడు. వాడికి ఎవడో ఒక వెధవ గురువు అవుతాడు. వాడ్ని మిగతా కాలనీ వాసులు అందరికీ గురువును చేస్తాడు. వాడు కౌన్సిలర్ కాబట్టి జ్ఞానవంతుడు. వాడి గురువు మహాజ్ఞాని. ఇదే తంతు వూళ్ళల్లోనూ….. స్కూల్ అసిస్టెంట్ మేష్టారు అందరికీ తలలో నాలుక. వాడి తలలో ఉన్నదంతా అజ్ఞానమే. చేతికి దారాలూ, బండి మీద నామాలూ, వేళ్ళకు రంగురాళ్ళు, పర్సులో మెహెర్ బాబా బొమ్మ. వీడి మాట మీద వూళ్ళో పిల్లల బతుకు నిర్మించబడుతుంది. ఎంత పెద్ద గొంతుంటే అంతపెద్ద స్త్రీ వాది….. సొంత బ్రతుకుల్లో చర్మవర్ణం చూసుకుని మురుసుకునే మనుషులు కూడా లింగవివక్షా వ్యతిరేక పోరటాలకు శ్రీరామరక్ష అయి కూర్చుంటున్నారు. జీవితంలో సగం అభ్యుదయం, మరో సగం పుణ్యక్షేత్ర దర్శనాలతో సాగించే జనాలు సిద్దాంతకర్తలూ, పదవులూ, ప్రాపకాలూ, కులం, మతం చూపించి రాసిన నాలుగు ముక్కల్నే మహాసాహిత్యం అని ప్రచారం చేసుకునే జనాలు విధ్యావేత్తలూ, ప్రభుత్వ కమిటీలలో సభ్యులూ అవుతారు.

ఎవర్నీ నమ్మకండి. మీ ముందు గుండేసుకుని ‘మా దగ్గర రేట్లు మిగతా వారితో సరిపోల్చుకోండి ‘ అని నమ్మబలికే గుండేశ్వర్రావులను కూడా నమ్మకండి. ఒకడి సామాజిక ఎదుగుదలకు వాడి జ్ఞానమే కారణం అనుకోకండి. వాడి ఆధిక్యం నుండీ, వార్తాపత్రికలనుండీ, వికీపీడియా నుండీ వెలువడే జ్ఞానగుళికెలూ, అద్భుత రహశ్యాలూ కేవలం వండర్ వరల్డ్, విజ్డం పత్రికల్లాగా చదివేసి వదిలేయడమే. సమాచారాన్ని కూడా జ్ఞానం అనే బాటిల్స్ లో అమ్మే మాయగాళ్ళూ, గత్తెలూ మనచుట్టూ ఉంటారు. వీరిలో కొందరికి గొప్ప పంచ్ డైలాగ్, పాష్ ఇంగ్లీష్ టేలెంట్ వుండటం మరొక దరిద్రం. పంచ్ డైలాగులనే దైవజ్ఞానం అని నమ్మించే గురువులూ, బోధకులూ, మౌల్వీలూ, జాకీర్ ఖల్నాయక్లూ, జగ్గూ పాసుదేవులూ, కొళవెరి సతీషులూ మనచుట్టూ చేరి మన ధనాన్నీ, స్నేహాలనూ, భావావేశాలనూ, సమయాన్నీ చివరకు మన ప్రాణాలనూ కుక్కలపాలు చేస్తారు.ఒకడ్ని మార్గదర్శకుడు, ఆరాధ్యుడు, గురువు అని అంటూ ఉన్నావంటే నువ్వో వెధవాయి అని అర్ధం. దీన్ని వారించని ఆ మార్గారాధ్యగురువు ఇంకా పెద్ద వెధవాయి అని తప్పకుండా నమ్ము.

– —

ఒంగోలు గిత్త లాంటి సినిమా క్రాక్

గుర్రం . సీతారాములు

ఈ శతాబ్దంలో మహిళా ధిక్కారానికి చిరునామా ఫూలన్ దేవి. పసి వయసులోనే చిత్రహింసల కొలిమిలో ఛిద్రమైన ఆమె జీవితాన్ని , చేసిన బ్రతుకు యుద్దాన్ని కొన్ని తరాలు పాడుకునే కొనే చరిత్రను మన కళ్ళముందే నిలిపింది. చంబల్ లోయ ను రక్త సిక్తం చేసిన ఠాగూర్ల తలలు గ్రామ కోట గుమ్మానికి వేలాడ దీసి తన తిరుగు బాటుతో చేసిన సాహసో పేతమైన గాంగ్ వార్ కు చిరునామా మారిన మీర్జాపూర్ నుండి దేశ చట్టసభల్లో గర్జించిన ఆమె ఈతరపు స్త్రీ పోరాటానికి మహిళా అస్తిత్వానికి మరోపేరు అయిన ఆమెను విలన్ గా చిత్రించడం ఒక్క తెలుగు సినిమా లోకానికి మాత్రమే తెలిసిన విద్య.గోపిచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ, శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్లతో తీసిన క్రాక్ సినిమా మంచి చెడులు బెరీజు నాకనవసరం


స్థూలంగా మాఫియా, లోకల్ గ్యాంగ్ వార్ క్రైమ్ పరువు హత్య నేపధ్యం లో ఒక కానిస్టేబుల్ లోకల్ గాంగ్ లీడర్ బిడ్డను చేసుకుంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మాఫియా డాన్ ను మరొక చిలకలూరి పేట లెవల్ విలన్ లను నాలుగు పీకి జైలులో వేయడం ప్రధాన కథ.
పరువు హత్యకు ప్రేరేపించే భార్య తో హీరో చూడడానికి శ్రీదేవి లా ఉన్నావ్ చేష్టలు పూలన్ దేవిలా ఉన్నాయి అనే డైలాగ్ మాత్రమే కాదు నల్లమల అడవుల్లో ఒంగోలు సర్వి తోపుల్లో బ్రతికే యానాదుల జీవితాలను అత్యంత అమానవీయంగా చూపించాడు.
ఇంత కాలం హాస్యానికి తెలంగాణ భాషను, క్రూరత్వానికి రాయలసీమ రెడ్లను రెప్లికా చేసిన తెలుగు సినిమా ఇప్పుడు తన గురిని ఒంగోలు, వేటపాలెం బాపట్ల యానాదుల వైపు మరల్చారు.యానాదుల క్రూరులుగా, అనాగరికులుగా, హాంతకులుగా గాడిద రక్తాన్ని తాగి క్రూరంగా హత్యలు చేసే అమానవీయ మనుషులుగా చూపి గోపీచంద్ మలినేని తన ఒంగోలు వీరత్వాన్ని చాటుకున్నాడు.
దశాబ్దాలుగా అదే తప్పుడు సూత్రీకరణ తెనుగు తెరను ఏలుతోంది.కులాలను ప్రాంతాలను వీరత్వానికి, అజ్ఞానానికి , హంతకులకు చిరునామా ఇంతకాలం వలసవాద చరిత్ర కారులే చేశారు. ఇప్పుడు ఆ పని తెలుగు సినిమా చేస్తోంది.
ఆ సినిమా తీసిన దర్శకుడు ఒంగోలు వాసి. ఇంటర్ చదివి చరిత్రను ఆపొసన పట్టిన సదరు డైరట్టర్ మలినేని జ్ఞానం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనబడుతోంది.తెరనిండా రక్తాన్ని , హింసనూ, పరువు హత్యనూ, మాఫియా , డాఫీయా విలనిజాన్నీ కలిపి కాక్‌ టైల్ చేసిన సినిమా క్రాక్.
మూడు నాలుగు ఆంగ్ల సినిమాలు కట్ అండ్ పేస్ట్ చేసి వండిన బహుబలికి వెయ్యికోట్ల ఇచ్జిన కట్టప్పల కాలం కదా? మా ఖమ్మం లో ఇపుడు ఈ సినిమా నాలుగు స్క్రీన్ లలో ఆడుతోంది.లాక్ డౌన్ తాళాలు తీసి తెరలు , బీర్లు , బార్లు ,
బార్లా తీసి బడులను మాత్రమే మూసేసి న పవిత్ర కాలాన కాళ్ళు కట్టేసి కట్టడి చేసి మార్కెట్ ని నిత్తేజం చేస్తున్న పాలకుల పుణ్య కార్యాల నడుమ ఈ సినిమా బాగానే కాసులు వెనకేసి రాష్ట్ర ఖాజానాను నింపేందుకు సిద్ధం అయిన పాడుకాలం లో విడుదలైన మహా విప్లవాత్మక మైన ఒంగోలు గిత్త లాంటి సినిమా పేరు క్రాక్.
ఇది నిజంగా పిచ్చికి పరాకాష్ట.

క్రాక్

ఒంగోలు##యానాది ##తెలంగాణ

— —

అమెరికాలో సైనిక తిరుగుబాటు వెనుక మర్మ ం


డా. శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు
ద్రవిడ బహుజన సమితి

అమెరికా వార్తలు మన వాళ్లకు పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడం వింతగా వుంది. బహుశా మోదీ మీడియా ట్రంపుకు అనుకూలంగా వుండటం వొక కారణం కావొచ్చు. ట్రంపు అధికార పీఠం వొదలడానికి నిరాకరించి అమెరికన్ల అభిప్రాయాన్ని అగౌరవపరిచాడు. సెనేట్ సభ్యులు ట్రంపు మీద అభిశంసన పెట్టి, ట్రంపుకు వ్యతిరేకంగా తీర్మానం చేయటం కూడా జరిగింది. ఆ సందర్భంగా ట్రంపు మద్దతుదారులు సాయుధులై వొచ్చి, అమెరికా పారమెంటును ఆక్రమించుకున్నారు. నిజానికి ఇది చాలా పెద్ద వార్త. సుమారు యాభై రాష్ట్రాలలో హింస పెచ్చరిల్లింది. మాజీ సైనికులు, తాజా సైనికులు ట్రంపుకు మద్దతుగా ఆయుధాలతో రోడ్ల మీదికెక్కారు. అమెరికా రాజకీయాలకు సైనికులకు మధ్య ఎలాంటి సంబంధం వుందో ఈ సంఘటన నిరూపిస్తంది.

ట్రంపుది రేసిజం. అది అమెరికా స్వభావానికి విరుద్దం. ఎందుకంటే అమెరికా వొక జాతి రాజ్యం కాదు. అమెరికా స్థానిక జాతులను నాశనం చేసి, బ్రిటిష్ వాళ్లు అక్కడ వలస రాజ్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత అనేక చారిత్రక, రాజకీయ పరిణామాల కారణంగా అమెరికా స్వతంత్ర దేశమైంది. కానీ నానాజాతుల ఆశ్రిత దేశం గా అది రూపొందింది. అది పరాయి దేశాల నుండి వలస వచ్చిన వాళ్లు నిర్మించుకున్న దేశం. రెడ్ ఇండియన్లు, హిస్పానియన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్లు, ఆసియన్లు కలిసి బతికే వొక దేశం. అయితే, ఆ అమెరికా రాజ్యాంగ యంత్రాంగాన్ని శాసించేది మాత్రం యూదులే అన్నది జగమెరిగిన సత్యం. అమెరికా అగ్ర రాజ్యం స్థానంలో వుండటం యూదులకు చాలా అవసరం. అమెరికా ద్వారా ప్రపంచాన్ని నియత్రించే వొక వ్యూహాన్ని యూదులు చాలాకాలంగా అమలు చేస్తున్నారు. అమెరికా సంపన్నులంతా యూదులే అన్నది నిజం. వాట్సాప్,‌ ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలన్నీ యూదులవే. మైక్రోసాఫ్ట్ మొదలు, ప్రపంచ నాశనానికి తోడ్పడే అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యంత్రాలను పదార్థాలను తయారు చేసే సంస్థలు, ఆయుధ విక్రేత సంస్థలూ అన్నీ వాళ్లవే. ముఖ్యంగా అమెరికా గుఢాచార వ్యవస్థను యేలేదంతా వాళ్లే. ట్రంపుకూడా యూదు మూలాలు గల వ్యక్తి. క్లింటన్, ఒబామ, ట్రంపు, బైడెన్ ఎవరు ప్రెసిడెంట్ అయిన కూడా యూదుల క్షేమం కోసం పని చేయాల్సిందే. వొక్క మాటలో చెప్పాలంటే ఇండియాలో బ్రాహ్మణులు ఎలాంటి పాత్ర పోషిస్తారో, యూదులు అలాంటి వాళ్లు అన్న మాట. అయితే, యూదులు ప్రపంచంలో అత్యంత ఎక్కువ హింసను, అన్యాయాన్ని చవిచూశారు. మన దేశంలో బ్రాహ్మణులు అలాంటి హింసను ఏ కాలంలోనూ అనుభవించిన దాఖలాలు లేవు.

ట్రంపుకు ముందు వున్న ప్రెసిడెంట్లు ఎవరూ కూడా శ్వేతజాతీయవాదాన్ని ఇంత బాహాటంగా వ్యక్తం చేయలేదు. అబ్రహాం లింకన్ బానిసత్వాన్ని రద్దు చేసినా, ఆఫ్రికన్ అమెరికన్లకు యింకా జాతి వివక్ష తప్పటం లేదు. ఒబామా కూడా అపార్థీడ్ వర్గాల ప్రతినిధిగా కాకుండా, అమెరికన్ యూదు పెట్టుబడిదారుల రాజకీయ ప్రతినిధిగా ఎదిగాడు. యూదులకు, ముస్లింలకు మధ్య జరుగుతున్న హింసాత్మక యుద్దాన్ని వొక కొలిక్కి తీసుకొచ్చిన ఘనత ఒబామాకు దక్కింది. ఒసామా బిన్ లాడెన్ హత్య ఒబామా ద్వారానే జరిగింది. అయితే, మూడోసారి అతడు అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం లేదు. అందుకే, శ్వేత జాతీయవాదాన్ని, అమెరికా ప్రయోజనాల పరిరక్షణ పేరుతో వొక అహంకారపూరిత వ్యాపారి ట్రంపు రాజకీయ ప్రవేశం చేశాడు. పబ్లిక్ బిహేవియర్ సెన్సు కూడా లేని ట్రంపు గెలుపును నిరసిస్తూ న్యూయార్క్ నగరంలో భారీ ప్రదర్శనలు జరిగాయి. కానీ కన్సర్వేటివ్ ఐడియాలజీ వున్న ట్రంపు మద్దతుదారులు ట్రంపును బాగా వెనకేసుకొచ్చారు. ట్రంపు విదేశాంగ విధానం వల్ల, ముఖ్యంగా సరిహద్దు దేశాలతో ఆయన వైఖరి వల్ల పెద్ద అపప్రద మూటగట్టుకున్నాడు. అయితే, అమెరికా రాజకీయాలలో ఇండియన్ అప్పర్ క్యాస్టులు చురుకుగా కీలకంగా మారిన వొక చారిత్రక దశను మనం గమనించొచ్చు.

అమెరికా పార్లమెంటరీ వ్యవస్థ మీద, అమెరికా రహస్య నిఘా సంస్థల పని తీరు మీద మనం వొక అంచనాకు రావడానికి డిసెంబరు ఆరు నాటి ట్రంపు మద్దతుదారుల నిరసనలు, హింసాత్మక చర్యలు తోడ్పడతాయి. ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామిక హక్కులు ప్రమాదంలో పడ్డా, పార్లమెంటరీ క్రైసిస్ తలెత్తినా జోక్యం చేసుకొనే అమెరికా, ఇప్పుడు నవ్వుల పాలైంది. నాకైతే పాకిస్తాన్ కూ అమెరికాకూ మధ్య పెద్ద తేడా ఏమీ కనపడ లేదు. పాకిస్తాన్ లో కూడా సైన్యాధ్యక్షులు ప్రెసిడెంట్లను, ప్రధానిని నియంత్రించడం, తిరుబాటు చేసి పార్లమెంటును స్వాధీనం చేసుకోవడం మనం చాలాసార్లు చూశాం. ఇంచుమించు అమెరికాలో కూడా మొన్న అలాగే జరిగింది. కాబట్టి అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం కాలేదని తెలుస్తోంది. యిక, సిఐఏ, ఎఫ్.బి.ఐ వంటి పటిష్ఠమైన నిఘా సంస్థలకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుంది. ఏ దేశంలో టెర్రరిస్టు అటాక్ జరగబోతుందో ముందే హెచ్చరించే అమెరికా నిఘా సంస్థలు ట్రంపు అనుకూల సాయుధ ముఠాలు వీరంగం సృష్టించబోతున్నాయని ముందే ఎందుకు పసిగట్టలేక పోయాయి? అలా బాహాటంగా ఎలా ఆయుధాలతో నిరసనలకు దిగారు? ముఖ్యంగా మాజీ సైనికులు అలా ఎలా వొక రాజకీయ ఆందోళనలు చేయగలిగారు? వాటిని నిఘా సంస్థలు ఎందుకు నిలువరించ లేదు? ఇక్కడే అందరికీ కొన్ని అనుమానాలు తడుతున్నాయి.

సిఐఏ అనేది కేవలం నిఘా సంస్థ మాత్రమే కాదు. అది ప్రపంచాన్ని శాసించే గుఢాచార వ్యవస్థ. అది తనకు అనుకూలంగా ప్రతి ప్రెసిడెంట్ ను మార్చుకుంటది. తన మాట వినేలా పరిస్థితులను సృష్టిస్తుంది. బైడెన్ను బ్లాక్ మేయిల్ చేసి, లొంగదీసుకోవడానుకే సిఐఏ తిరుగుబాట్లను ప్రోత్సహించిందనే ఆరోపణ కూడా వుంది. ఈ ఆరోపణను అంత తేలిగ్గా తీసిపారెయ్య లేము.

అమెరికా రాజకీయ వ్యవస్థ వొక పరివర్తన దశలో వుందని ఈ సంఘటనలను చూసి చెప్పలేము. కానీ అమెరికా ప్రజాస్వామ్యం తప్పకుండా లిబరల్ గా మారక తప్పదు. లాటిన్ దేశాల నుండి వలస వొచ్చిన వాళ్ల ప్రభావం, అలాగే ఆసియా దేశాలైన చైనా, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, కొరియా దేశాల నుండి వలస వొచ్చి స్థిరపడిన వాళ్లూ, అలాగే అస్థిర మధ్యాసియా దేశాల నుండి వలస వొచ్చిన వాళ్లూ అంతా కలిసి శ్వేత జాతి దురహంకారాన్ని వోడించి, తమకు అనుకూలమైన అమెరికా సామాజిక, రాజకీయ వ్యవస్థను నిర్మించుకోక తప్పదు. అయితే, యూదు దురహంకారులు, ఇండియన్ మనువాదులతో చేతులు కలిపితే మాత్రం అమెరికా వొక భయంకరమైన ప్రపంచ వ్యతిరేక దిశలో పయనించి తీరుతుంది. నాకైతే, అమెరికా ఇదే దిశలో అడుగులేస్తుందని అనిపిస్తుంది. మరి మీకూ?


సాహిత్య ప్రపంచంలో ఉప్పెన ‘మద్దూరి నగేష్ బాబు

మీరెప్పుడైనా ఉప్పెననూ చూసారా.ఒకవేళ చూస్తే తట్టుకోగలరా !అదిగో అలాంటిఉప్పెన పేరే ‘ మద్దూరి నగేష్ బాబు ‘తెలుగు సాహిత్యం లో పెను ఉప్పెన సృష్టించిన కవి మద్దూరి నగేష్ బాబు ‘ కవిత్వాన్ని పల్లెల్లోనుంచి, దళిత తల్లుల ఆవేదనలు నుంచి కవిత్వాన్ని బయటకు తీసుకొచ్చాడు.అప్పటిదాకా సాగిన కవిత్వం వేరు .మద్దూరి నగేష్ బాబు మొదలెట్టిన తర్వాత వచ్చిన కవిత్వం వేరు. ఇతర కవులపై మద్దూరి నగేష్ బాబు ముద్ర అంత ఉంది.ఉద్దండ కవులు అనుకున్న వాళ్లేఒక్కసారి వాళ్ళ కవిత్వాన్ని తొంగి చూసుకున్నారు.కవిత్వాన్ని సరైన మార్గంలో పెట్టినవాడు.ముఖ్యంగా ఎవరి కవిత్వాన్ని వాళ్లు సరిచేసుకుని.దళిత కవిత్వం – దళితేతర కవిత్వం స్పష్టంగామద్దూరి నగేష్ బాబు కవిత్వం రాసినాక భయటపడింది. తెలుగు సాహిత్యంలో రెండవ రాకడ ప్రారభం మద్దూరి నగేష్ బాబుతోనే.పదునైన దళిత పదాలతో, దళిత యాసతో పల్లెబతుకులను చీత్రికపట్టి చూపెట్టాడు మద్దూరి.ప్రపంచాన్ని అణుబాంబు ఎంత వినాశనం చేసిందో. తెలుగు సాహిత్యంలో ‘మద్దూరి నగేష్ బాబు ‘కవిత్వం దళిత బతుకులను ప్రపంచానికి చూపెట్టింది. యే కవిత రాసిన అది తన బతుకులోనుంచే రాసాడు.కవిత్వం – జీవితం రెండు ఒకేలా బతికిన కవి.మాటైనా – కవితైనా ఒక ప్రవాహంలా దూసుకెళ్తుంది.మద్దూరి నగేష్ బాబు బతికినంత కాలం తోటి కవులు చాలా మంది ‘ కవిత్వాన్ని రాయకుండా కలాలు పక్కనెట్టారు.కొంత మంది ఎప్పుడు ‘చస్తార్రా వీడు ‘అనుకున్నారు.

రచ్చబండ , వెలివాడ ,మీరెవూట్లూ,నరలోక ప్రార్థన, గోదావరి , లోయ , పుట్ట ,కవిత్వాలు తెలుగు సాహిత్యాన్ని కొంత కాలం నిద్రలేకుండా చేసింది. అలేక్సీ హెలి ‘ రూట్స్ ‘ ( ఎడుతరాలు )నవల చదివి చాలా మంది నిద్రపోలేదు.అలాగే మద్దూరి నగేష్ బాబు కవితా సంపుటాలు చదివితే అంతకంటే ఎక్కువ రేట్లుదళితుల బతుకుల గురించి ఆలిచించ కుండా ఉండలేరు.ఇతర కవులతో కొంత సంకర కవిత్వం అని కాస్త సిగ్గుపడదం ,ఊరు – వాడ లాంటిసంకర కవిత్వం తీసుకొచ్చారు.అందుకే మద్దూరి నగేష్ బాబు కవితా సంపుటాలుఇప్పుడు ఒకటి కూడా లేదు. కొత్తగా ప్రచురిస్తే తప్పా !కవి ప్రభావం తప్పకుండా ప్రపంచంపై పడినట్టేఈ కవి ప్రభావం ప్రపంచంలో తోటి కవులపై పడింది.ఎంత కాలం బతికాం కాకుండా. బతికినంత కాలంకొలిమి నిప్పులపై కాలినట్టు కాలిపోయాడు.కవిత్వం జీవితమైంది , జీవితమే కవిత్వంలా బతికాడు.’ అతను బతికింది కొంతకాలమైన బలమైన ముద్ర తెలుగు సాహిత్యంలో ఉంది.అందుకే కవిత్వంలో మద్దూరి నగేష్ బాబుతో రెండవ రాకడ మొదలైంది అంటారు. ఏదిఏమైనాతెలుగు సాహిత్యంలో పెను ఉప్పెన ‘ మద్దూరి నగేష్ బాబు’.

రచ్చబండ , వెలివాడ ,మీరెవూట్లూ,నరలోక ప్రార్థన, గోదావరి , లోయ , పుట్ట ,కవిత్వాలు తెలుగు సాహిత్యాన్ని కొంత కాలం నిద్రలేకుండా చేసింది. అలేక్సీ హెలి ‘ రూట్స్ ‘ ( ఎడుతరాలు )నవల చదివి చాలా మంది నిద్రపోలేదు.అలాగే మద్దూరి నగేష్ బాబు కవితా సంపుటాలు చదివితే అంతకంటే ఎక్కువ రేట్లుదళితుల బతుకుల గురించి ఆలిచించ కుండా ఉండలేరు.ఇతర కవులతో కొంత సంకర కవిత్వం అని కాస్త సిగ్గుపడదం ,ఊరు – వాడ లాంటిసంకర కవిత్వం తీసుకొచ్చారు.అందుకే మద్దూరి నగేష్ బాబు కవితా సంపుటాలుఇప్పుడు ఒకటి కూడా లేదు. కొత్తగా ప్రచురిస్తే తప్పా !కవి ప్రభావం తప్పకుండా ప్రపంచంపై పడినట్టేఈ కవి ప్రభావం ప్రపంచంలో తోటి కవులపై పడింది.ఎంత కాలం బతికాం కాకుండా. బతికినంత కాలంకొలిమి నిప్పులపై కాలినట్టు కాలిపోయాడు.కవిత్వం జీవితమైంది , జీవితమే కవిత్వంలా బతికాడు.’ అతను బతికింది కొంతకాలమైన బలమైన ముద్ర తెలుగు సాహిత్యంలో ఉంది.అందుకే కవిత్వంలో మద్దూరి నగేష్ బాబుతో రెండవ రాకడ మొదలైంది అంటారు. ఏదిఏమైనాతెలుగు సాహిత్యంలో పెను ఉప్పెన ‘ మద్దూరి నగేష్ బాబు’.

తంగిరాల సోని

( జనవరి 9 న ‘మహాకవి మద్దూరి నగష్ బాబు’ 16 వ వర్ధంతి )

      --  --
  .  -- 96 766 09 234 --

అడుగ‌డుగున మ‌నువార‌సుల‌తో యుద్ధంఎందుకంటే?

మనుస్మృతి మనుషులను ‘లోపలివారు’ ‘బైటివారు’ లేదా ‘ఇతరులు’ అని రెండు ప్రధాన విభాగాలుగా విడగొట్టి ఇద్దరినీ పరస్పర శత్రు సమూహాలుగా చిత్రించి, వారిమధ్య యజమాని, సేవక సంబంధాలు తప్ప మానవ సంబంధాలను నిషేదిస్తుంది. బ్రాహ్మణుడిని ‘సూపర్ మాన్’ ని చేసి మిగిలిన వారంతా అంచెలంచెలుగా అతనికి అనుచరులు, సేవకులు దాసులు అనే క్రమంలో పనిచెయ్యాలి అనేది ఆ గ్రంధంలో సూచన. మనుస్మృతి బౌద్ధం తీసుకొచ్చిన సామాజిక విప్లవ సిద్ధాంతాన్ని చంపి పాతరేసింది. బుద్ధుని బోధనల ప్రభావంతో తమ కుల ధర్మానికి విరుద్ధంగా సామాజిక మార్పు కోసం బతికే వాళ్ళని, హేతువాదులనూ, కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళని ‘పాషండు’లని, ‘దుర్మార్గు’లని, హేతువాదులను, వేద విరుద్ధంగా మసలే వారిని క్రూరులని పేర్కొంది మనుస్మృతి. అది అసమానత ప్రాతిపదికన మనుషుల మధ్య అంతరాలు సృష్టించి, వివిధ సామాజిక వర్గాల మధ్య స్పష్టమైన విభజన రేఖలు గీసింది. సమాజంలో బ్రాహ్మణులకు అత్యున్నత స్థానాన్ని బహూకరించి శూద్రులకు(దళితులు కూడా ఈ వర్గంలో భాగం), స్త్రీలకు బానిసత్వాన్ని అంటగట్టింది. దాని ప్రకారమే ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల సతీ సహగమనం, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం అనే కటినమైన ఆచారాలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. స్త్రీ స్వేచ్ఛ, వారి చదువు, భర్త చనిపోయిన స్త్రీలు పునర్వివాహం చేసుకోవడం, పిల్లలు లేనివారు దత్తత తీసుకోవడం అనేవాటికి మనుస్మృతి పూర్తిగా విరుద్దం…

బ్రాహ్మణ వాదంపై అన్ని రకాలుగా పోరాటం చేసిన అంబేద్కర్ మొదట అసమానతలకు ప్రాతిపదిక అయిన మనుస్మ్రుతిని డిసెంబర్ 25, 1927న మహాద్ సత్యాగ్రహం సందర్భంలో నడిబజార్లో తగలబెట్టి బాహాటంగానే అసమా సమాజానికి సవాలు విసిరాడు. అంబేద్కర్ మనుస్మృతి స్థానంలో స్వేచ్చా, సమానత్వాల ప్రాతిపదికన రాజ్యాంగాన్ని రూపొందించడమే కాక, స్త్రీలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తూ హిందూ కోడ్ బిల్లును రూపొందించాడు. అందుకే కొందరు అంబేద్కర్ ని ‘ఆధునిక మనువు’ అని పేర్కొంటారు. ఇప్పుడు జరుగుతున్నది ‘ప్రతీఘాత విప్లవం’… రాజ్యాంగ రచన ద్వారా అంబేద్కర్ ముందుకు తెచ్చిన సమానత్వ భావన అనే విప్లవానికి బ్రాహ్మణవాద పాలకుల వ్యతిరేక విధానాలే ‘ప్రతీఘాత విప్లవం’ అనుకోవచ్చు. పుష్యమిత్రుడు బౌద్ధం తీసుకొచ్చిన విప్లవాన్ని నీరుగార్చడానికి సాగించిన ప్రతీఘాత విప్లవాన్ని పోలినదే ఈనాటి ముసుగులు ధరించిన నయా మనువాద ఫాసిస్ట్ మారణ కాండ. మనువాదం ఎన్ని ముసుగులు ధరించినా దాన్ని ఫూలే అంబేడ్కర్ వెలుగులో గుర్తించాల్సినవారు గుర్తించారు. దాని ఫలితంగానే మను సంతతికి అంబేద్కర్ వారసులకు యుద్ధం అనివార్యం అయింది. రాజ్యాంగ రచన ద్వారా అంబేద్కర్ ముందుకు తెచ్చిన సమానత్వ భావన అనే విప్లవానికి బ్రాహ్మణవాద పాలకుల వ్యతిరేక విధానాలే ‘ప్రతీఘాత విప్లవం’ అనుకోవచ్చు. పుష్యమిత్రుడు బౌద్ధం తీసుకొచ్చిన విప్లవాన్ని నీరుగార్చడానికి సాగించిన ప్రతీఘాత విప్లవాన్ని పోలినదే ఈనాటి ముసుగులు ధరించిన నయా మనువాద ఫాసిస్ట్ మారణ కాండ. మనువాదం ఎన్ని ముసుగులు ధరించినా దాన్ని ఫూలే అంబేడ్కర్ వెలుగులో గుర్తించాల్సినవారు గుర్తించారు

్ర‌ఫొఫెస‌ర్ చ‌ల్ల‌ప‌ల్లి స్వ‌రూప‌రాణి,

నాగార్జున విశ్వ‌విద్యాల‌యం

రాజ్యాంగ హక్కులపై పితృస్వామ్య పెత్తనం

రాజ్యాంగం పౌరులకు యే వివక్ష లేకుండా సమానత్వ హక్కు యిచ్చినప్పటికీ అమలుపరిచే వారికి హృదయం లేకపోతే అవి కాగితాలకే పరిమితమై, అస్తిపంజరంలా మిగులుతాయని అంబేడ్కర్ పేర్కొన్న అంశాలు రాధికమ్మ, గుల్రుఖ్ గుప్తా, హదియా వంటి యెందరో స్త్రీల విషయంలో మళ్ళీ రుజువవుతున్నాయి. కుల, మతపరమైన అంశాలలో మహిళా ఉద్యమాలు యింకా ఉధృతంగా పనిచెయ్యాల్సిన అవసరాన్ని ఆ మహిళల ఉదంతాలు హెచ్చరిస్తున్నాయి.


భారత రాజ్యాంగం (ఆర్టికల్స్ 25–28) యే భేదం లేకుండా పౌరులందరికీ తమకిష్టమైన మతాన్ని పాటించే హక్కునిచ్చింది. రాజ్యాంగం ప్రకారం స్త్రీ పురుషులిద్దరూ అన్ని విషయాలలోనూ సమానమే. ఆచరణలో మాత్రం కుల, మత అంశాలలో పురుషుడిని ‘యెక్కువ సమానం’గా రాజ్య వ్యవస్థలు పరిగణిస్తూ స్త్రీని రెండవ తరగతి పౌరురాలిగా చూస్తుండడం గమనించవచ్చు. ఆ ధోరణి దళిత, మైనారిటీ స్త్రీల విషయంలో యిటీవల జరిగిన కొన్ని సంఘటనలలో స్పష్టంగా కనిపిస్తుంది. గుజరాత్‌లో పార్సీ మతస్థురాలైన గుల్రూఖ్ గుప్తా, హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికమ్మ, కేరళలో హదియా, రాజస్థాన్‌లో జరిగిన ‘పరువు హత్య’ల విషయంలో సంబంధిత స్త్రీల పట్ల పోలీసులు, కోర్టులు కూడా పితృస్వామిక ధోరణితో మెలగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
గుజరాత్ రాష్ట్రంలో గుల్రుఖ్ గుప్తా అనే పార్సీ మతస్థురాలు యితర మతస్థుడిని వివాహం చేసుకున్నాక ఆమె తన పాత మతపరమైన గుర్తింపును, ఆచారాలను కొనసాగించుకోవడానికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే గుజరాత్ హైకోర్టు 1954 స్పెషల్ మ్యారేజ్ చట్టం ప్రకారం మతాంతర, కులాంతర వివాహాలు చేసుకున్న స్త్రీలు తమ పాత కుల, మత పరమైన గుర్తింపులను యథావిధిగా కొనసాగించుకోవచ్చనే హక్కును తిరస్కరించి గుల్రుఖ్ గుప్తా పార్సీయేతర మతస్థుడైన తన భర్త మతాన్నే అవలంబించాలని తీర్పునిచ్చింది.
ఇటీవల కేరళ రాష్ట్రంలో మెడిసిన్ విద్యార్థిని అయిన అఖిల(హదియా) మత మార్పిడి, వివాహం కేసు కూడా స్త్రీల మత హక్కును ప్రశ్నార్థకం చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందూ తల్లిదండ్రులకు పుట్టిన 24 సంవత్సరాల అఖిల తన స్నేహితురాలి ప్రభావంతో ఇస్లాం మతంపైన వ్యక్తిగతంగా అభిమానం పెంచుకుని తన మతం మార్చుకుని తన పేరును ‘హదియా’గా మార్చుకుంది. ఆ తర్వాత హదియా మ్యారేజ్ బ్యూరో ద్వారా ‘జహాన్’ అనే ముస్లిం మతస్థుడిని వివాహం చేసుకుంది. ఆమె మత మార్పిడి, వివాహం నచ్చని ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె విషయంలో ‘లవ్ జిహాద్’ అనే కుట్ర దాగి వుందని, ఆమెను మోసపూరితంగా మతం మార్చి పెళ్ళి చేశారని, జహాన్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, అతడు తమ కుమార్తెని అరబ్ దేశాలకు తరలించి మాయ చేస్తాడని, ఆ వివాహాన్ని రద్దు చేసి ఆమెని తిరిగి తమకు అప్పగించమని కోర్టుని ఆశ్రయించారు.
కేరళ హైకోర్టు హదియా 24 సంవత్సరాల మేజర్ అయినప్పటికీ ఆమె యితరుల చేత మోసగించబడటానికి అవకాశాలున్నాయని భావించి ఆమెకు జహాన్‌తో జరిగిన పెళ్ళిని రద్దు చేసి హదియాను ఆమె తల్లిదండ్రుల కస్టడీకి అప్పగించింది. సుమారు సంవత్సర కాలం పాటు హదియా తన భర్తను కానీ, స్నేహితులను కానీ కలవకుండా ఆమె తల్లిదండ్రులు కట్టుదిట్టం చేసినప్పటికీ తర్వాత హదియా తాను మేజర్‌ననీ తన మత మార్పిడి, వివాహం పూర్తిగా తన మనోభీష్టం ప్రకారం జరిగాయని, తనని తిరిగి భర్త దగ్గరకు వెళ్ళనివ్వమని సుప్రీం కోర్తును ఆశ్రయించింది. ఆమె భర్త జహాన్ కూడా తన భార్యను అప్పగించమని కోర్టుకు అప్పీల్ చేశాడు. హదియా మతమార్పిడి, వివాహం విషయంలో సుప్రీం కోర్టు ఆమె తండ్రి ఆరోపిస్తున్నట్టు ‘లవ్ జీహాద్’ వంటి కోణంపైన దర్యాప్తు చెయ్యడానికి నేషనల్ ఇన్వెష్టిగేషన్ ఏజెన్సీని ఆదేశించి, నివేదిక వచ్చాక తన తీర్పును వెలువరించింది. అందులో హదియా చదువు చెన్నై మెడికల్ కాలేజీలో సగంలో వున్నందున ఆమెని తన మొదటి పేరైన ‘అఖిల’గా హాస్టల్‌లో వుంటూ చదువు పూర్తి చెయ్యమని ఆదేశించింది.
ఈ రెండు కేసుల్లో కోర్టులు పూర్తిగా పితృస్వామిక ధోరణితోనూ, హిందూ మెజారిటీ మత ప్రయోజనాలను కాపాడే విధంగానూ వ్యవహరిస్తుండం గమనించవచ్చు. అంతే కాకుండా కోర్టులు ఆ స్త్రీల రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తూ వారి వ్యక్తిగత జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నాయి. యిటీవల ‘ట్రిపుల్ తలాక్’ పద్ధతిని రద్దు చేస్తూ ముస్లిం స్త్రీల పట్ల సుప్రీం కోర్టు కొంత ప్రగతిశీలకంగా వుందనే ఆశాభావం వ్యక్తమవుతున్న దశలో గుల్రుఖ్ గుప్తా, హదియా విషయాలలో కోర్టులు ఆ స్త్రీల మత స్వేచ్ఛని గుర్తించకపోగా హైందవేతరులను బోనులో నిలబెడుతున్నాయి. హదియా కేసులో ‘లవ్ జిహాద్’ అనే కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి ముస్లిం మతస్థులను పాపాల భైరవుల్ని చెయ్యడం లౌకిక ప్రజాతంత్రవాదుల్ని కలవర పెడుతుంది.
1954 స్పెషల్ మ్యారేజ్ చట్టం ప్రకారం కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతుల్లో స్త్రీలు తమ కుల, మతపరమైన గుర్తింపులను యథావిధిగా కొనసాగించవచ్చు. కులాంతర వివాహం చేసుకున్న వారిలో పురుషుడు అగ్ర కులస్తుడు, స్త్రీ అణగారిన కులానికి చెందిన వ్యక్తి అయితే వారికి పుట్టిన బిడ్డలకు కుల సమాజంలో అగ్ర కులం వారి ఆదరణ దొరికే అవకాశం వుండదు కాబట్టి వారు తల్లికి సంబంధించిన కుల గుర్తింపును పొందవచ్చనే ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వున్నాయి. అయినప్పటికీ ఆచరణలో అవి బాధితులకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఆధిపత్య కులాలకు కొమ్ముకాసే ప్రభుత్వ యంత్రాంగం బాధిత స్త్రీలకు ఆ మాత్రపు వెసులుబాటును అందనివ్వకుండా వేధించడం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య సందర్భంగా చూశాం. అందరూ కలిసి రోహిత్‌ని తన కుటుంబానికి యే విధంగానూ అండగా నిలబడని అతని తండ్రి కులానికి అంటగట్టడం తెలిసిందే!
వివాహం, విడాకులు, మనోవర్తి వంటి విషయాలలో న్యాయస్థానాలు స్త్రీల పట్ల యెంతో పితృస్వామిక వైఖరితో వ్యవహరిస్తూ వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాస్తున్నాయి. కొన్ని ప్రత్యేక తీర్పుల ద్వారా స్త్రీలకు బిడ్డల సంరక్షణ వంటి విషయాలలో కల్పించిన హక్కులను అమలు జరపడంలో ప్రభుత్వ యంత్రాంగం యెంతో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ తిరిగి పితృస్వామిక స్వభావాన్నే అంతటా ప్రదర్శించడం జరుగుతుంది. యిది కులధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, పాస్ పోర్ట్, వీసాలు పొందే విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో ‘పరువు హత్య’ల పేరుతో కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వారిని నిర్దాక్షిణ్యంగా చంపడం, భయభ్రాంతులకు గురిచెయ్యడం వంటి సంఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి. మన సమాజం తిరిగి మధ్యయుగాల చీకటి లోయల్లోకి వెళ్ళిపోతుందేమోననే భయం అంతా ఆవహిస్తుంది. యీ ‘పరువు హత్యలు’ అణగారిన కులాల, మైనారిటీ యువతను బలితీసుకుంటున్నాయి. అవి వారి కుల మత హక్కులనే కాక వారి జీవించే హక్కును కూడా హరించడమే! యిటీవల రాజస్థాన్‌లో జరిగిన ‘పరువు హత్య’ మైనారిటీలను తీవ్ర అభద్రతా భావానికి గురిచేసిందనవచ్చు.
స్త్రీ బాల్యంలో తండ్రి సంరక్షణలోనూ, యవ్వనంలో భర్త సంరక్షణలోనూ, వృద్ధాప్యంలో కొడుకు అధీనంలోనూ వుండాలని మనుస్మృతి పేర్కొంది. భారతదేశంలో న్యాయస్థానాలు కూడా స్త్రీల విషయంలో తు.చ తప్పకుండా మనుస్మృతినే పాటిస్తున్న భావన కలుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం అవలంబించే పితృస్వామిక ధోరణి దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల విషయంలో మరింత దారుణమైన పరిణామాలకు దారితీస్తూ ఆ స్త్రీలను వంటరితనానికీ, అభద్రతకూ గురిచేస్తోంది. అందుకే కాబోలు అంబేడ్కర్ ‘రాజ్యాంగ నైతికత’ అనే భావనను చర్చకు పెట్టారు.
రాజ్యాంగం పౌరులకు యే వివక్ష లేకుండా సమానత్వ హక్కు యిచ్చినప్పటికీ అమలుపరిచే వారికి హృదయం లేకపోతే అవి కాగితాలకే పరిమితమై, అస్తిపంజరంలా మిగులుతాయని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్ పేర్కొన్న అంశాలు రాధికమ్మ, గుల్రుఖ్ గుప్తా, హదియా వంటి యెందరో స్త్రీల విషయంలో మళ్ళీ రుజువవుతున్నాయి. మన దేశంలో మహిళా ఉద్యమాలు యెంత పెద్ద యెత్తున జరిగినా, అవి కుల, మతపరమైన అంశాలలో యింకా ఉధృతంగా పనిచెయ్యాల్సిన అవసరాన్ని పై సంఘటనలు హెచ్చరిస్తున్నాయి.

ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి

( ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ )

మతాతీత మానవతకు చిరునామా-సంత్ కబీర్ నామా

పుట్టినూరు పట్ల ఒకింత ప్రేమ, మట్టి మనుషులంటే గౌరవం గల హృదయం ప్రతీ సంవత్సరం రాయపూర్ వైపు లాగేది. అలా వీలున్నప్పుడల్లా మధ్య భారతంలో వాలిపోయే నాకు కోవిడ్ కారణంగా అవాంఛనీయ తీరిక దొరికింది. అనుకోకుండా టిక్కెట్లు కూడా దొరకడంతో సహచరిని తీసుకుని వాలిపోయాను. మూడ్రోజుల యాత్రలో భాగంగా రెండు ఆసక్తికరమైన ఆశ్రమాల్ని చూసాను. ఒకటి ‘దామా ఖేడా’ అనే గ్రామంలో ‘కబీర్ ఆశ్రమ్’ ఐతే, మరోటి ‘నవపారా’ అనే గ్రామం లో ‘కబీర్ మందిర్’ పేరిట స్థాపించబడింది.

రెండు చోట్లా కాసేపు చర్చించాను. ఇద్దరూ రెండు భిన్నమైన ఉదారవాద భావజాలానికి ప్రతీకగా అనిపించారు. ఒక శాఖ ప్రకారం కబీర్ భగవత్ స్వరూపుడు ఆయన భూమ్మీదికి నాలుగు రూపాల్లో వచ్చాడు. కలియుగంలో కబీర్ గా అవతరించాడు. ఈ ఆశ్రమంలో ఒకచోట సాధువులు, ఆధ్యాత్మిక వేత్తల ఫొటోల మధ్య గాంధీ ని కూడా ఉంచారు.

సత్యసంధతకి గాంధీజి వెచ్చించిన జీవితాన్ని గౌరవించి అలా పెట్టినట్లు ఆశ్రమ నిర్వహకులు చెప్పారు.ఇక రెండో శాఖ ప్రకారం కబీర్ మానవమాత్రుడు. నైతిక ఆచరణ శీలి. మొదటివారు వారసత్వ గురు పరంపరని నమ్మితే, రెండవ శాఖ వారు యోగ్యత ఆధారంగా వ్యక్తిపవిత్రతనివిశ్వసిస్తారు.దేశవ్యాప్తంగా కొన్ని ఆశ్రమాలు నిర్మించుకుని బ్రహ్మచర్యాన్ని, కొన్ని నైతిక విలువలను రెండు శాఖలు ప్రచారం చేస్తున్నారు.

ఉత్తర భారతంలోని వారణాశిలో పుట్టి జీవితాంతం హేతువాదాన్ని, తర్కాన్ని ప్రచారం చేసి అనేక అపసవ్య ధోరణులను ప్రశ్నించి హిందూ ముస్లిం సిఖ్ ల మత సమైక్యత కి నిజమైన ప్రతీకగా మానవత్వానికి మమేకమైన ప్రవక్తగా నిలిచిన “కబీర్” ప్రభావం భక్తి ఉద్యమం పై ఎంత ఎక్కువ ఉందంటే, బి.ఆర్. అంబేద్కర్ కబీర్ ని తన గురువుగా ప్రకటించారు.

సామాజిక దృక్పథంతో సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న ‘కబీర్ కళా మంచ్’ కార్యకర్తల పట్ల రాజ్యం అనుసరిస్తున్న ఆధిపత్యానికి సాక్షులుగా ఉన్నవేళ,దేశవ్యాప్తంగా లౌకికవాద భిన్న స్రవంతులన్నీ హైందవీకరణ చెందుతున్న సమయంలో అనేక అభిప్రాయాలతో విభేదాలు ఉన్నప్పటికీ (ముఖ్యంగా స్త్రీల పట్ల కబీర్ కి గల చులకన భావనలకి) విభిన్నతని కాపాడుకోవడంలో భాగంగా ఆయా మార్గాల్ని తెల్సుకోవడం ఆ మేరకు చర్చించడం ఆరోగ్యకరమని నా అభిప్రాయం.

చివరగా పచ్చని చత్తీస్‌గఢ్ గ్రామాల్ని చూస్తూ ఉదయపు నీరెండని వెంటేసుకు తిరిగే పిల్లగాలుల్ని తనివితీరా పీలుస్తూ దూసుకుపోతున్న మాకు మారుమూల గ్రామాల్లో కూర్చున్న అంబేద్కర్ విగ్రహం, జైనమహావీరుడి విగ్రహం, ఒక భవనం పై ఇష్టపడి వేసుకున్న భగత్ సింగ్ బొమ్మతో పాటు రహదారి పక్క ఒక శ్రమజీవి చేతుల్లో రూపుదిద్దుకున్న నిలువెత్తు కబీర్ విగ్రహం ముచ్చటగొల్పింది.

ఉత్తర భారతంలోని వారణాశిలో పుట్టి జీవితాంతం హేతువాదాన్ని, తర్కాన్ని ప్రచారం చేసి అనేక అపసవ్య ధోరణులను ప్రశ్నించి హిందూ ముస్లిం సిఖ్ ల మత సమైక్యత కి నిజమైన ప్రతీకగా మానవత్వానికి మమేకమైన ప్రవక్తగా నిలిచిన “కబీర్” ప్రభావం భక్తి ఉద్యమం పై ఎంత ఎక్కువ ఉందంటే, బి.ఆర్. అంబేద్కర్ కబీర్ ని తన గురువుగా ప్రకటించారు.

మనిషికి మద్దతుగా సంత్ రవిదాస్ లాగా (ఈయన కూడా భక్తి ఉద్యమకారుడు, విప్లవాత్మక భావాల ప్రచారకుడు) ‘బేగంపురా’ ఆదర్శ వ్యవస్థని మధ్య యుగంలోనే దర్శించి, ఛాందసత్వానికి వ్యతిరేకంగా గొంతువిప్పిన ఒక మానవతావాదిని స్మరించుకోవడం మతోన్మాద సమాజంలో అవసరమే కదా..?

గౌరవ్

పశ్చాత్తాపం లేని ఒక కార్పోరేట్ దళారీ

భారత ప్రభుత్వంతో రైతులు వీరోచితింగా చేస్తున్న పోరాటాన్ని మండీ దళారుల ప్రోత్సాహంతో నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమంగా చిత్రీకరించే పనిని కొందరు మేధావులని ముద్రలేసుకున్న వాళ్ళు భుజానికి ఎత్తుకున్నారు. ప్రస్తుతం తెలుగు నేల మీద అలాంటి పని చేస్తున్న వాళ్ళలో ప్రముఖుడు జయప్రకాష్ నారాయణ్ (జేపీ).

ప్రస్తుత సందర్భంలో జేపీని ఒక మేధావిగా భావించడం కన్నా ఒక కార్పోరేట్ దళారీగా చూడడం సరయినది. ఎందుకంటే “రైతు మేలు కోసమే” అంటూ కార్పోరేట్ ప్రయోజనాల కోసం ఆయన సమర్థిస్తున్న కొత్త చట్టాల మూలంగా రైతు తన పంట మీద, జీవితం మీద పూర్తి నియంత్రణ కోల్పోయి ఒక నిర్జీవ వస్తువుగా మారి మార్కెట్ చేతిలో ఒక సాధనమయ్యే ప్రమాదం ఉంది. ఇక మీదట రైతు మార్కెట్ నిర్దేశించే పంటలే వెయ్యాలి. అది చెప్పే విత్తనాలు, రసాయనాలే వాడాలి. మార్కెట్టే ధర నిర్ణయిస్తుంది. చివరికి రైతు భూమికి, మార్కెట్ కు మధ్య ఒక appendage గా మిగిలిపోయే అవకాశం వుంది. ఈ మొత్తం ప్రక్రియలో జేపీ లాంటి ఎందరో మేధో దళారులు తమ శక్తినంతటిని పోగుచేసుకోని రైతు వ్యతిరేక చట్టాలకు ప్రజల మద్దతు కూడగట్టే పని చేస్తున్నారు.

జేపీకి వున్న ప్రత్యేకత ఏమంటే కుతర్కాన్ని కూడా గట్టిగా ఒక్కానించి తర్కంగా చెలామణీ చేయగల్గడం. వాదనలోని వైరుధ్యమైన, అహేతుకమైన అంశాలను సహితం తన గంభీరత్వంతో కప్పేయడం. తనకు తానుగా ప్రజల తరుపున వకాల్తా పుచ్చుకున్న మేధావిలా ముద్ర వేసుకొని ప్రజల గొంతుకకు అడ్డుపడటం. తన భాషా ప్రావీణ్యంతో అనేకనేక ప్రవచన విన్యాసాలు చేస్తున్నప్పుడు ఎంతోకొంత మందైనా “అరే జేపీ లాంటి పెద్ద మనిషే ఈ చట్టాలను ఆహ్వానిస్తున్నాడంటే వాటిలో ఏదో మంచి వుండేవుంటది” అని భ్రమ పడేటట్లు చెయ్యడం. అయితే “మా ఇల్లు సత్యహరిచంద్రుని ఇంటి పక్కనే” అని చెప్పుకున్నంత మాత్రాన తాను చెప్పేవన్నీ సత్యాలయిపోవు కదా. అందుకే నీ “ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్” అని సున్నితంగానే కొందరు చెబుతున్నారు. కాని ఆయన మాత్రం “నాకు ఏ సిద్ధాంతాలతో పనిలేదు, రైతు మేలే నాకు ముఖ్యం” అనే మాట అన్ని టీవీ చానల్స్ లో ప్రతిధ్వనించేలా మళ్ళీ మళ్ళీ చెబుతూనే వున్నాడు.

వ్యవసాయ చట్టాల మీద తాను చేస్తున్న వాదనలోని డొల్లతనాన్ని ఇప్పటికే ఎందరో రైతు మిత్రులు అనేక మాధ్యమాలలో ఎండగట్టివున్నారు. కాబట్టి వాటి లోతుల్లోకి మళ్ళీ వెల్లదల్చుకోలేదు. అయితే ఆయనలాంటి దళారీలను లోతుగా అర్థం చేసుకోవాలంటే తనకు ఏ సిద్ధాంతమూ లేదంటూనే ప్రచారం చేస్తున్న నయాఉదారవాద మార్కెట్ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవాలి.

చట్టాల గురించి ఆయన చేస్తున్న వాదనలను ఉపరితలంలోనే పరిశీలిస్తే అవి ఎంతో ఆకర్షణీయంగా, రైతు ప్రయోజనకారిగా కనిపిస్తాయి. ఈ చట్టాలు చెబుతున్న కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం: ఈ కొత్త చట్టాలు రైతును దళారీ వ్యవస్థ నుండి విముక్తి (liberation) చేస్తాయి. రైతులు తమ ఇష్టానుసారం పంటను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకునే అవకాశం (choice) పొందుతారు. మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలుదారులు ఉంటే రైతు తన పంటకు ధర ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అమ్ముకునే ప్రయోజనం (competitive advantage) ఉంటుంది. దీని మూలంగా మధ్యవర్తులు, వాళ్ళ లాభాల గోల లేని ఒక పారదర్శక (transparency) పరిస్థితి వచ్చి రైతు, మార్కెట్ శక్తులు ఇద్దరు లాభపడే అవకాశం (win-win situation) ఉంటుంది. ఈ చట్టాల మూలంగా ప్రభుత్వ గిడ్డంగుల్లో ధాన్యం కుళ్ళిపోకుండా రైతు పొలం నుండే కొనబడిన ఆహారధాన్యాలు మార్కెట్ సామర్ధ్యం (market efficiency) మూలంగా మెరుగైన నాణ్యతతో కూడిన ఆహారంగా (value added food) తిరిగి వాళ్ళ పళ్ళాలలోకి వస్తాయి. మొత్తంగా ఈ చట్టాల మూలంగా రైతుల ఆదాయాలు పెరుగుతాయి. రిస్క్ తగ్గుతుంది. గ్రామీణ ఉపాధులు పెరుగుతాయి. చివరిగా రైతులు స్వేఛ్ఛా వాణిజ్య మార్కెట్ (free market) లో ఎలాంటి అడ్డంకులు లేకుండా విహరిస్తారు.

వినడానికి ఎంత బాగున్నాయి కదా! ఇటువంటి మాటలు చెప్తూ ఒక ఊహాలోకంలోకి తీసుకుపోతున్నారు జేపీ లాంటి పెద్దమనుషులు. ఇవన్నీ వీళ్ళ బుర్రల్లోంచి వచ్చినవే అనుకుంటే పొరబడినట్లే. వీటి మూలాలు వెతకడం పెద్ద కష్టమైన పనేమి కాదు. కనీసం 1980 నుండి వ్యవసాయం మీద ప్రపంచబ్యాంక్ ప్రకటిస్తున్న ఏ పాలసీ డాక్యుమెంట్ ను చూసినా ఈ పెద్దమనుషుల సుద్దుల అసలు రహస్యం బయట పడుతుంది.

ప్రపంచబ్యాంక్ ఏం చెబుతుంది? వ్యవసాయాన్ని ఒక వ్యపారంలాగా చూడాలని చెబుతుంది. వ్యవసాయంలో మా జీవితముంది, సంస్కృతి వుంది, అది ప్రకృతితో ముడిపడివుంది… ఇలాంటివన్ని ప్రపంచబ్యాంక్ దృష్టిలో “పనికిమాలన వెనుకబాటుతనపు మాటలు.” మరి వ్యవసాయం ఎట్లా చెయ్యాలి, రైతులు ఏం పండించాలి? ప్రపంచ మార్కెట్ ఏది నిర్దేశిస్తే అది రైతులు పండించాలి. ఎందుకంటే మార్కెట్ వ్యక్తులకన్నా, ప్రభుత్వాల కాన్నా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. నిష్పాక్షికంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు మార్కెట్ కు చట్టపరంగా, భద్రత పరంగా కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రపంచబ్యాంక్ గత నలభై సంవత్సరాలుగా అన్ని దేశాలను ఆదేశిస్తుంది.

ప్రపంచబ్యాంక్ కేవలం ఆదేశించడమే కాదు, దానికి అనుకూలంగా తన వాదనలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రజలను మోసం చేస్తున్నామని పశ్చాత్తాప పడని ఒక దళారీ మేధావి వర్గాన్ని కూడా తయారు చేసుకుంది. అటువంటి ప్రయోగశాలలో తయారుకాబడిన దళారీ లక్షణాలు పుష్కలంగా వున్న వ్యక్తుల్లో పోటీ పడి మొదటివరుసలో ఉండగలిగిన వాడు జేపీ. సరే, ఆయన ఏ పల్లకీ మోస్తే మనకేంటి, దాని మూలంగా రైతులకు వచ్చే నష్టం ఏంటి? అనేది సహజంగా వచ్చే ప్రశ్నే.

ఈ చట్టాల ఫలితాలు అనుభవిస్తేనే కాని తెలువనివి కాదు. ఎందుకంటే వీటిని సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచమంతా ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో అమలు చేస్తూనే ఉన్నాయి. అన్నింటికి “ఆదర్శంగా” చెప్పుకునే అమెరికాలో 1980ల నుండి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయి చతికిల పడింది. ముఖ్యంగా చిన్న రైతులు (మూడు, నాలుగు వందల ఎకరాల భూమి వుండే వాళ్ళు) వ్యవసాయం నుండి బయటకు వెళ్ళిపోయి పెద్ద రైతుల (మూడు, నాలుగు వేల ఎకరాల భూముండే) కమతాలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ భూకేంద్రీకరణ తీవ్రం కావడానికి కారణం చిన్న రైతులు “స్వేచ్ఛా మార్కెట్” లో బతకలేని పరిస్థితి మూలంగానే.

“స్వేచ్ఛా మార్కెట్” లో స్వేచ్ఛ వుండేది కేవలం కార్పోరేట్ శక్తులకే కాని రైతులకు కాదు. ఎందుకంటే అందంగా చెప్పబడుతున్న స్వేచ్ఛా మార్కెట్ లో కేవలం కొన్ని బహుళజాతి సంస్థలు మాత్రమే గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో, ఏ నిర్వచనం పరంగా కూడా మార్కెట్ లో రైతులకు స్వేచ్ఛ దొరకదు. కేవలం ఐదు కార్పోరేషన్లే ప్రపంచ వ్యాప్తంగా ఎనభై ఐదు శాతం విత్తనాలను, రసాయనాలను, ఆహార ఉత్పత్తుల కొనుగోలును నియంత్రిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో అమెరికాలోని రైతే బతకలేని పరిస్థితి వుంటే ఇక భారత రైతాంగం గురించి ఏం చెప్పగలము. వాస్తవానికి, అమెరికన్ రైతులలో ప్రతి సంవత్సరం ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వుంది. ఆశ్చర్యంగా ఉండొచ్చు, కాని ఇది వాస్తవం. కొద్దిపాటి పరిశోధనతో ఎవరికైనా అర్థమయ్యే విషయం.

అమెరికా పైన వున్న కెనడాలో కూడా పరిస్థితి ఏమి మెరుగ్గా లేదు. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను పిహెచ్ డి చెయ్యడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రైతు సదస్సుకు వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళే ముందు అనుకున్నా ఈ రైతులకు ఏం సమస్యలు ఉంటయిలే అని. నేను అనుకున్నట్లే ఆ రైతులు మంచి సూటు, బూటు వేసుకొని వున్నారు. అక్కడ మీటింగ్ అయిపోగానే కొందరు డాన్స్ ప్లోర్ మీద బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవన్నీ చూస్తున్నప్పుడు తెలంగాణలో పురుగుల మందు తాగి చస్తున్న రైతులే గుర్తుకొచ్చారు. అయితే కాసేపు అయిన తర్వాత డిన్నర్ దగ్గర ఒక రైతుతో మాటలు కలిసి అతనే అడిగాడు “మీ దగ్గర రైతు పరిస్థితి ఏంటి?” అని. ఆయన ఆ మాట అడగగానే రైతుల బాధలు, ఆత్మహత్యలు అన్ని ఆగకుండ పది- పదిహేను నిమిషాలు చెప్పిన. అంతా ఓపికగా విన్న ఆ పెద్దాయన మెల్లగా అన్నడు “మా దగ్గర రైతు ఆత్మహత్యలు లేవు కాని మేము ఆత్మహత్యా పరిస్థితుల్లో (suicidal conditions) బతుకుతున్నం” అని.

ఆ ఒక్క మాటతో నాకు దిమ్మ తిరిగి పోయింది. ఒక్క దెబ్బతో నా తప్పుడు అవగాహన పటాపంచలయ్యింది. కేవలం వాళ్ళ తెల్ల రంగుని బట్టి, వాళ్ళ రూపాన్ని బట్టి వాళ్ళను తప్పుగా అంచనా వేసినందుకు చాలా గిల్టీ ఫీల్ అయిన. ఆ ఒక్క మాటతోనే నా పరిశోధనలో కెనేడియన్ వ్యవసాయాన్ని జత చేసిన. అయితే వాస్తవానికి ఆ కెనేడియన్ రైతు చెప్పినట్లు ఆత్మహత్యలు లేవని కాదు, కాని వాళ్ళ మరణాలు ఆత్మహత్యలుగా నమోదు కావడం లేదు. ఎందుకుంటే ఆత్మహత్య అని చెబితే వాళ్ళకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు రాకుండా పోతాయని. ప్రస్తుతం నేను అమెరికాలో రైతుల మీద చేస్తున్న పరిశోధన కూడా అదే విషయాన్ని చెబుతుంది.

అభివృద్ధి చెందిన దేశాలలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక మన రైతుల భవిష్యత్తు గురించి ఊహించుకోవడం కష్టమేమీ కాదు. ఇది కేవలం వ్యవసాయానికి మాత్రమే కాదు, ప్రజల ఆహారభద్రతకు, జీవవైరుధ్యానికి, ప్రకృతికి పెద్ద విఘాతం. ఇప్పటి వరకు ఏదో బాగుందని కాదు. కాని ఈ చట్టాల మూలంగా రైతులు పెనం మీది నుండి పొయ్యిలో పడిపోతారు.

రైతులు ఒక వర్గంగా, సమూహంగా ఉండే స్థితి నుండి మార్కెట్ కు సరుకులు అందించే ఒక ఏజెంట్ వ్యవస్థగా మార్చబడుతారు. సమిష్టితత్వం స్థానంలో వ్యక్తివాదం నిలబడిపోతుంది. రైతుల హక్కులు హరించబడటమే కాకుండా, వాళ్ళు సంఘటితమయ్యే శక్తి కూడా సన్నగిల్లుతుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఏజన్సీని మార్కెట్ శక్తులు, వాళ్ళ ప్రయోజనాలు నియంత్రిస్తాయి కాబట్టి.

ఇది కేవలం రైతుల సమస్య కాదు. అందరి మనుషుల సమస్య. మనిషికి-ప్రకృతికి ఉండే సమతుల్య సంబంధాల సమస్య. ఇది భవిష్యత్తు సమస్య. భావితరాల సమస్య. అందుకే బడా కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పాటుబడుతున్న దళారీలను ఎండగడుదాం. రైతులతో కౄర పరిహాసం ఆడుతున్న రాజ్యం కళ్ళల్లో మట్టిగొట్ట సిద్ధమవుతున్న మనుషులందరిని గుండెకు హద్దుకుందాం. రైతుల పోరాటానికి అన్ని రకాల మద్దతునిద్దాం!

అశోక్ కుంబము

కత్తి వాదర మీద నిలిచిన ప్రేమ

ఇద్దరు మేజర్లైన యువతీ యువకులు కలిసి బ్రతకాలనికున్నప్పుడు సమ్మతి ఇద్దరిదే ముఖ్యంగానీ ఇతరులది కాదు, మహా అయితే వాళ్లిద్దరి కుటుంబాలది, ఇప్పుడా అనుమతి కుటుంబాలు, వీధి, వూరు దాటేసి రాజ్యం అనుమతికూడా వుండాలనే నిబంధనలో భాగమే ఉత్తరప్రదేశ్ చట్టవ్యక్తిరేక మతమార్పిడి చట్టం, 2020.
రాజాయ్నీ రాజు, వూరిపెద్ద, ఇంటిపెద్ద వరకూ ఒక్కొక్కరి నుండి విముక్తిపొందుతూ మనిషి తన వికాసం వైపు నడుస్తోన్న ఆధునిక ప్రపంచ మానవులకు విరుద్దంగా ఒక మనిషి తన జీవితాన్ని ఇస్టరీతిన గాకుండా ఇంటిపెద్ద, వూరిపెద్ద, రాజు దాకా ఈ దేశంలోని మనిషి సంకెళ్లని బిగించుకుంటున్నాడు.

“లవ్ జీహాద్” అనే పదం చట్టంలో చేర్చనప్పటికీ, బయట అధికార యంత్రాంగం మొత్తం బహిరంగగంగా ఉచ్చరిస్తోన్న ఈ పదం ప్రకారపు చట్టం ప్రకారం మతం మార్చాలనే ఉద్దేశ్యంతో హిందూ మహిళని ముస్లిం మగవారు వివాహం చేసుకునే పరిస్తితిని నివారించాలనే ఉద్దేశ్యంతో తెచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చట్టం త్వరలో దేశమంతా విస్తరిస్తుంది, ఇది ముందు రెండు ముఖ్యమైన మతాలమధ్యన అనుమానాల్ని, అగాధాల్ని, తర్వాత విద్వేషాల్ని, ఆ తర్వాత విధ్వంసాల్ని తెస్తుందని గుర్తించాలి.

ఈ పనిని ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిర్వహించడమంటే నాటి బ్రిటిష్ ప్రభుత్వం కన్నా దారుణంగా విభజించి మరీ జనాల్ని పాలించాలని భావిస్తోందని అర్థంచేసుకోవాలి. మతాల తర్వాతి వంతు కులాలది వస్తుంది. ఏ కులం మనుషులు ఆ కులంలోనే చేసుకోవాల్సి వస్తుంది. చేయాల్సిన పనులు చేయని, చేయలేని ప్రభుత్వాలు, వాటిని మరిపించడంకోసం చేయకూడని తిండి, దుస్తులు, దాంపత్య జీవితాల్లోకి చొరబడి గందరగోళం, విధ్వంసం చేయడమే అసలు లక్ష్యం అనుకోవాలి.

ఈ చట్టం ప్రకారం మతంలోకి మార్చితే చర్యలు తీసుకోవడం కాదు, కేవలం అనుమానం, అభిప్రాయం కలిగితే చాలు పోలీసులు ఇంటికొస్తారు. పెళ్ళిచేసుకోవలనుకున్న వ్యక్తినేగాదు, అందుకు సహకరించిన అతని కుటుంబ సభ్యులను కూడా పట్టుకుపోతారు. ఈ చట్టం అమలులో పోలీసులకన్నా ఇప్పటికే వున్న గోసమ్రక్షకుల లాగా సామాజిక రక్షకులు వూరూరా కొత్త సామాజిక పెత్తందార్లుగా పుట్టుకొస్తారు. వీళ్లు ముస్లిములతో హిందువులు ఎటువంటి అర్థిక లావాదేవీలే కాదు అంటే సైకిల్ పంచర్ కూడా వేయించు కోనివ్వకపోవడమే కాదు, అసలు రోడ్డుమీద పలకరించినా సంబంధాలు కలిపి పిల్లకి పెళ్లిచేసి మతమార్పిడికి కుట్రపన్నారని కేసులు నమోదు చేయించగలరు. అంటే మొత్తానికి ముస్లిములకు ఈ నేలమీద కాలం మూడిందని అర్థంచేసుకోవాలి.

ఆశొకా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకారం ఈ బిల్లు “ముస్లిములని క్రిమినలైజ్ చేయడమే లక్ష్యం” రెండు కమ్యూనిటీలమధ్య సామాజిక అగాధాన్ని మరింత లోతుగా చేశి, వాళ్లమధ్య అపనమ్మకాన్ని కలిగించి, వాళ్లని జంతువులుగా ముద్రవేయడమే ఈ చర్యల లక్స్యం అంటాడాయన. ఇప్పటికే సామాజిక ఒత్తిడి, చాందస పద్దతులు, కట్టుబాట్లు మతాంతర వివాహాల పట్ల క్రూరంగా వుండగా, ఇప్పుడీ చట్టం వాళ్లని మరింత బాధ్యుల్ని చేసి వేధించబోతోంది.

ఈ చట్టం కింద మతమార్పిడి చేయ ఉద్దేశ్యంతో పెళ్లిచేసుకుంటే నాన్-బెయిలబుల్ కేసుతో 10సంవత్సరాలవరకు శిక్ష పడుతుంది. ఈ చట్టం ప్రకారం వివాహానికై తన గురించి సరిగ్గా చెప్పకపోవడం, లొంగదీసుకోవడం, వొత్తిడిచెయడం, బలవంతం చేయడం, ఆశచూపడం, ఇతర తప్పుడు పద్దతుల్లో వివాహం చేసుకోవడం నేరం. అంటే ఈ పదాల మాటున పోలీసులు, లాయర్లు, తీర్పులు ఇష్టానుసారం ఏదొ ఒక దాన్లో ఇరికించేయవచ్చు, దానికి అడ్డూ అదుపూ వుండవన్నమాట. ఈ చట్టం ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో చిత్రమైన హింసలు చేయడం మొదలుపెట్టింది.

ఇద్దరూ ప్రేమించుకున్నప్పుడు ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు, అంటే ఆశపెట్టాడు కాబట్టి జైళ్లో కూర్చొబెట్టారు. పెళ్లికొడుకు సోదరుడిచేత ఆ అమ్మాయికి ఫోన్ కొనిపెట్టించాడు, కాబట్టి పెళ్ళికొడుకు సోదరుడూ జైళ్ళో వున్నాడు. ఒక అమ్మాయీ అబ్బాయీ కాలేజీ రోజులనుండి ప్రేమించుకుని, ఇప్పుడు సెటిలై, పెళ్లి చేసుకోదలిచారు, అయినా సరే ఇందులో కుట్రవుంది అని జైళ్లో నిర్బదించబడ్డారు. ఇలా రోజురోజుకీ విచిత్రాల లిస్ట్ పెరిగిపోతోంది.

పల్లెల్లో ముసిములు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇల్లు వదలి పోతున్నారు. భయంతో గడియలేసుకుని ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటున్నారు. పోలీసుల వేధింపులకూ, వసూళ్లకు, సహజంగా వెనుకబడిన రాష్ట్రాల్లోని పోలీసుల మత మనస్తత్వానికీ ఈ చట్టం పెద్ద అయుధమైపోయింది. అసలు చట్టం చేటిలోకి రాగానే అంతకుముందు కేసులన్నీ మార్చేయబడుతున్నాయి. ఒక హిందూ ఆడపిల్ల, ఒక ముస్లిం కుర్రాడు ఇంట్లోంచి వెళ్ళిపోగానే ఒకే కంప్లైంటు మూడుసార్లు ఎలా మారిపోయిందో సోదాహరణంగా వివరించబడడం చూస్తే ఈ చట్టం ఎంతటి చెడు ఫలితాల్ని ఇవ్వబోతోందో అర్థమవుతోంది.

ఈ చట్టం ప్రకారం లేచిపోయిన కుర్రాడి ఇంట్లో వాళ్లందరినీ అనుమానితులుగా జైళ్లో తోసేయవచ్చు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే పెళ్లిచెసుకోవడం కాదు ముఖ్యం, పెళ్లికూతురు మతం మార్చడం కాదు ముఖ్యం, మార్చడానికే అన్న అనుమానం అసలు విషయం. ఒక అనుమానమ్మీద చర్యలు తీసుకోదలిస్తే అందుకు కారణమనుకునే ప్రతి మనిషినీ, ప్రతి కదలికనీ, ప్రతి వస్తువునీ అనిమానించి జైళ్లో తోసేయవచ్చన్నమాట!

“మేజరైన ప్రతి వ్యక్తికీ తన ఇష్టం వచ్చిన వాళ్లని వివాహమాడె హక్కు వుంద”న్న సహజ న్యాయం, ఇంతకు మునుపు చట్టాలూ, కోర్టు తీర్పులూ ఇప్పుడు బుట్టదాఖలు కాబోతున్నాయి. ఇతరమతాల వాళ్లని పెళ్లాడాలంటే 60రోజుల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి పొందాలి. అలా పొందని వాళ్లు 3నెలలనుండి మూడేళ్ల వరకు జైలుజీవితం అనుభవించాల్సి వస్తుంది. అనుమానమే ఆధారంగా గల ఈ చట్టంలో అనుమతి సహజంగానే తిరస్కృత మవుతుంది. తిరస్కృతి కాకపోతే అయ్యేలా వూరిలోని మతసంఘాలు, కూలసంఘాలు భయపెట్టి, బెదిరించి ఒప్పించడానికి గోరక్షక దళాలు సిద్దంగా వున్నాయి. కొన్ని కేసుల్లో పోలీసులకన్నా ముందే ఈ కాషాయ సంఘాల సభులు పెళ్లి మండపాల్లో ప్రత్యక్షమవడం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.

అప్పటికీ లక్నో లాంటి పట్టణాల్లో చదువుకున్న పెద్దకుటుంబాల వాళ్లు మూడునెలలు తమ పెళ్లిని వాయిదా వేసుకోవడానికి సిద్దపడ్డారు. ఈ చట్టం రాగానె పెళ్ళి మధ్యలో ఆపేసుకున్నవాళ్లు చేతులకున్న గోరిటాకు సాక్షిగా మూడునెలల తర్వాతి అనుమతికోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇదే పరిస్తితి మధ్యతరగతి మనుషులకు వుంటుందా? ఇంత రిస్క్ తీసుకుని పేదలు పెళ్ళిళ్లు చేసుకోగలరా? అభ్యుదయమనీ, ఆరోగ్యరీత్యా అవసరమనీ, మంచి వారాస్తవపు పిల్లలకొసమనీ, కొన్ని రాష్ట్రాలలో డబ్బులిచ్చి మరి అంతర్ కులాలు, అంతర్ మతాలూ పెళ్ళిల్లని ప్రోత్సహిస్తోన్నా జరగని పెళ్లిల్లు, ఎంత ప్రేమలుంటే మాత్రం, ఎంత అభ్యుదయ కుటుంబాల తల్లిదండ్రులుంటే మాత్రం ఇన్ని ఇబ్బందులకు ఎదురొడ్డి ఎవరు వివాహం చేసుకోగలరు?

మొన్నటికి మొన్న ఒక తహసీల్ కేంద్రంలో వివాహానికి రిజిస్టర్ చేయించుకోవడానికి వెళ్లగానే పోలీసులు వాళ్లని అరెస్టు చేసారు, పెళ్ళి చేసుకోబోతున్నారని! అక్కడకి వచ్చిన కాషాయ మత కార్యకర్తలు వాళ్లని గేలి చేసి అవమానించారు.

ఇదివరకే దేశంలో, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇతర మతాల మధ్య వివాహంలోని విషయాల్ని పద్దతిగా పొందుపరచిన తర్వాత కూడా ఈ దుందుడుకు చట్టం తేవడంలో కారణాలు సుస్పష్టం. అందుకనుగుణంగా వున్న ఈ చట్టంలోని వివరాల్ని చూస్తే;

ఆర్డినెనులోని సెక్షన్ 4 ప్రకారం ఈ వివాహాల్ని అంగీకరించని ఏ వ్యక్తయినా, ఆమె లేదా అతని తల్లిదండ్రులు, సోదరీ సొదరులు, లేదా ఆమె అతడి పెళ్ళి వల్ల లేదా దత్తతవల్ల బంధులులైనవాళ్లు ఎవరు కంప్లైంట్ చేసినా అది చెల్లుతుంది. అంటే మొత్తానికి ఈ పెళ్లి ఇష్టంలేని దారినపోయే దానయ్యకూడా తనకిష్టం లేదని వివాహం ఆపేయవచ్చు! ఈ చట్టం అసలు ఉద్దేశ్యం ఇదే, ఒక్క మనిషి కారణం చూపి ఇద్దరి మధ్య బంధాన్ని బద్దలు చేయడమే లక్ష్యం. ఇందులో దారుణం ఏమంటే ఇప్పటికే జరిగిపోయిన వివాహాలని కూడా అయా మనుషులచేత కంప్లైంట్ చేయిచి తవ్వి తీస్తూడడం!

మెల్లగా, తెలియకుండా కాదు వేగంగా, బహాటంగా మనం పురాతన కాలానికి తరళిపోతున్నామని గుర్తెరగాలి.-

— సిద్దార్థి సుభాష్ చంద్రబోస్