గుర్రం . సీతారాములు
ఈ శతాబ్దంలో మహిళా ధిక్కారానికి చిరునామా ఫూలన్ దేవి. పసి వయసులోనే చిత్రహింసల కొలిమిలో ఛిద్రమైన ఆమె జీవితాన్ని , చేసిన బ్రతుకు యుద్దాన్ని కొన్ని తరాలు పాడుకునే కొనే చరిత్రను మన కళ్ళముందే నిలిపింది. చంబల్ లోయ ను రక్త సిక్తం చేసిన ఠాగూర్ల తలలు గ్రామ కోట గుమ్మానికి వేలాడ దీసి తన తిరుగు బాటుతో చేసిన సాహసో పేతమైన గాంగ్ వార్ కు చిరునామా మారిన మీర్జాపూర్ నుండి దేశ చట్టసభల్లో గర్జించిన ఆమె ఈతరపు స్త్రీ పోరాటానికి మహిళా అస్తిత్వానికి మరోపేరు అయిన ఆమెను విలన్ గా చిత్రించడం ఒక్క తెలుగు సినిమా లోకానికి మాత్రమే తెలిసిన విద్య.గోపిచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ, శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్లతో తీసిన క్రాక్ సినిమా మంచి చెడులు బెరీజు నాకనవసరం
స్థూలంగా మాఫియా, లోకల్ గ్యాంగ్ వార్ క్రైమ్ పరువు హత్య నేపధ్యం లో ఒక కానిస్టేబుల్ లోకల్ గాంగ్ లీడర్ బిడ్డను చేసుకుంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మాఫియా డాన్ ను మరొక చిలకలూరి పేట లెవల్ విలన్ లను నాలుగు పీకి జైలులో వేయడం ప్రధాన కథ.
పరువు హత్యకు ప్రేరేపించే భార్య తో హీరో చూడడానికి శ్రీదేవి లా ఉన్నావ్ చేష్టలు పూలన్ దేవిలా ఉన్నాయి అనే డైలాగ్ మాత్రమే కాదు నల్లమల అడవుల్లో ఒంగోలు సర్వి తోపుల్లో బ్రతికే యానాదుల జీవితాలను అత్యంత అమానవీయంగా చూపించాడు.
ఇంత కాలం హాస్యానికి తెలంగాణ భాషను, క్రూరత్వానికి రాయలసీమ రెడ్లను రెప్లికా చేసిన తెలుగు సినిమా ఇప్పుడు తన గురిని ఒంగోలు, వేటపాలెం బాపట్ల యానాదుల వైపు మరల్చారు.యానాదుల క్రూరులుగా, అనాగరికులుగా, హాంతకులుగా గాడిద రక్తాన్ని తాగి క్రూరంగా హత్యలు చేసే అమానవీయ మనుషులుగా చూపి గోపీచంద్ మలినేని తన ఒంగోలు వీరత్వాన్ని చాటుకున్నాడు.
దశాబ్దాలుగా అదే తప్పుడు సూత్రీకరణ తెనుగు తెరను ఏలుతోంది.కులాలను ప్రాంతాలను వీరత్వానికి, అజ్ఞానానికి , హంతకులకు చిరునామా ఇంతకాలం వలసవాద చరిత్ర కారులే చేశారు. ఇప్పుడు ఆ పని తెలుగు సినిమా చేస్తోంది.
ఆ సినిమా తీసిన దర్శకుడు ఒంగోలు వాసి. ఇంటర్ చదివి చరిత్రను ఆపొసన పట్టిన సదరు డైరట్టర్ మలినేని జ్ఞానం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనబడుతోంది.తెరనిండా రక్తాన్ని , హింసనూ, పరువు హత్యనూ, మాఫియా , డాఫీయా విలనిజాన్నీ కలిపి కాక్ టైల్ చేసిన సినిమా క్రాక్.
మూడు నాలుగు ఆంగ్ల సినిమాలు కట్ అండ్ పేస్ట్ చేసి వండిన బహుబలికి వెయ్యికోట్ల ఇచ్జిన కట్టప్పల కాలం కదా? మా ఖమ్మం లో ఇపుడు ఈ సినిమా నాలుగు స్క్రీన్ లలో ఆడుతోంది.లాక్ డౌన్ తాళాలు తీసి తెరలు , బీర్లు , బార్లు ,
బార్లా తీసి బడులను మాత్రమే మూసేసి న పవిత్ర కాలాన కాళ్ళు కట్టేసి కట్టడి చేసి మార్కెట్ ని నిత్తేజం చేస్తున్న పాలకుల పుణ్య కార్యాల నడుమ ఈ సినిమా బాగానే కాసులు వెనకేసి రాష్ట్ర ఖాజానాను నింపేందుకు సిద్ధం అయిన పాడుకాలం లో విడుదలైన మహా విప్లవాత్మక మైన ఒంగోలు గిత్త లాంటి సినిమా పేరు క్రాక్.
ఇది నిజంగా పిచ్చికి పరాకాష్ట.
క్రాక్
ఒంగోలు##యానాది ##తెలంగాణ
— —