అడుగ‌డుగున మ‌నువార‌సుల‌తో యుద్ధంఎందుకంటే?

2035

మనుస్మృతి మనుషులను ‘లోపలివారు’ ‘బైటివారు’ లేదా ‘ఇతరులు’ అని రెండు ప్రధాన విభాగాలుగా విడగొట్టి ఇద్దరినీ పరస్పర శత్రు సమూహాలుగా చిత్రించి, వారిమధ్య యజమాని, సేవక సంబంధాలు తప్ప మానవ సంబంధాలను నిషేదిస్తుంది. బ్రాహ్మణుడిని ‘సూపర్ మాన్’ ని చేసి మిగిలిన వారంతా అంచెలంచెలుగా అతనికి అనుచరులు, సేవకులు దాసులు అనే క్రమంలో పనిచెయ్యాలి అనేది ఆ గ్రంధంలో సూచన. మనుస్మృతి బౌద్ధం తీసుకొచ్చిన సామాజిక విప్లవ సిద్ధాంతాన్ని చంపి పాతరేసింది. బుద్ధుని బోధనల ప్రభావంతో తమ కుల ధర్మానికి విరుద్ధంగా సామాజిక మార్పు కోసం బతికే వాళ్ళని, హేతువాదులనూ, కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళని ‘పాషండు’లని, ‘దుర్మార్గు’లని, హేతువాదులను, వేద విరుద్ధంగా మసలే వారిని క్రూరులని పేర్కొంది మనుస్మృతి. అది అసమానత ప్రాతిపదికన మనుషుల మధ్య అంతరాలు సృష్టించి, వివిధ సామాజిక వర్గాల మధ్య స్పష్టమైన విభజన రేఖలు గీసింది. సమాజంలో బ్రాహ్మణులకు అత్యున్నత స్థానాన్ని బహూకరించి శూద్రులకు(దళితులు కూడా ఈ వర్గంలో భాగం), స్త్రీలకు బానిసత్వాన్ని అంటగట్టింది. దాని ప్రకారమే ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల సతీ సహగమనం, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం అనే కటినమైన ఆచారాలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. స్త్రీ స్వేచ్ఛ, వారి చదువు, భర్త చనిపోయిన స్త్రీలు పునర్వివాహం చేసుకోవడం, పిల్లలు లేనివారు దత్తత తీసుకోవడం అనేవాటికి మనుస్మృతి పూర్తిగా విరుద్దం…

బ్రాహ్మణ వాదంపై అన్ని రకాలుగా పోరాటం చేసిన అంబేద్కర్ మొదట అసమానతలకు ప్రాతిపదిక అయిన మనుస్మ్రుతిని డిసెంబర్ 25, 1927న మహాద్ సత్యాగ్రహం సందర్భంలో నడిబజార్లో తగలబెట్టి బాహాటంగానే అసమా సమాజానికి సవాలు విసిరాడు. అంబేద్కర్ మనుస్మృతి స్థానంలో స్వేచ్చా, సమానత్వాల ప్రాతిపదికన రాజ్యాంగాన్ని రూపొందించడమే కాక, స్త్రీలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తూ హిందూ కోడ్ బిల్లును రూపొందించాడు. అందుకే కొందరు అంబేద్కర్ ని ‘ఆధునిక మనువు’ అని పేర్కొంటారు. ఇప్పుడు జరుగుతున్నది ‘ప్రతీఘాత విప్లవం’… రాజ్యాంగ రచన ద్వారా అంబేద్కర్ ముందుకు తెచ్చిన సమానత్వ భావన అనే విప్లవానికి బ్రాహ్మణవాద పాలకుల వ్యతిరేక విధానాలే ‘ప్రతీఘాత విప్లవం’ అనుకోవచ్చు. పుష్యమిత్రుడు బౌద్ధం తీసుకొచ్చిన విప్లవాన్ని నీరుగార్చడానికి సాగించిన ప్రతీఘాత విప్లవాన్ని పోలినదే ఈనాటి ముసుగులు ధరించిన నయా మనువాద ఫాసిస్ట్ మారణ కాండ. మనువాదం ఎన్ని ముసుగులు ధరించినా దాన్ని ఫూలే అంబేడ్కర్ వెలుగులో గుర్తించాల్సినవారు గుర్తించారు. దాని ఫలితంగానే మను సంతతికి అంబేద్కర్ వారసులకు యుద్ధం అనివార్యం అయింది. రాజ్యాంగ రచన ద్వారా అంబేద్కర్ ముందుకు తెచ్చిన సమానత్వ భావన అనే విప్లవానికి బ్రాహ్మణవాద పాలకుల వ్యతిరేక విధానాలే ‘ప్రతీఘాత విప్లవం’ అనుకోవచ్చు. పుష్యమిత్రుడు బౌద్ధం తీసుకొచ్చిన విప్లవాన్ని నీరుగార్చడానికి సాగించిన ప్రతీఘాత విప్లవాన్ని పోలినదే ఈనాటి ముసుగులు ధరించిన నయా మనువాద ఫాసిస్ట్ మారణ కాండ. మనువాదం ఎన్ని ముసుగులు ధరించినా దాన్ని ఫూలే అంబేడ్కర్ వెలుగులో గుర్తించాల్సినవారు గుర్తించారు

్ర‌ఫొఫెస‌ర్ చ‌ల్ల‌ప‌ల్లి స్వ‌రూప‌రాణి,

నాగార్జున విశ్వ‌విద్యాల‌యం