ఉస్మానియా పై హైకోర్టులో విచారణ ఈనెల 24 కు వాయిదా

579

ఉస్మానియా ఆస్పత్రి అంశంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చెరుకుందని.. రోగులు, డాక్టర్లు, సిబ్బందికి ప్రాణాపాయం ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. వర్షాలకు ఆస్పత్రి భవనంలోకి చేరిన నీటి గురించి మీడియా వార్తలు, కథనాలను చూసామని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. కొన్ని వ్యాజ్యాలు పురావస్తు భవనం కూల్చివేయొద్దని, మరికొన్ని కూల్చివేసి కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలని కోరుతున్నాయని వాటిని విభజించి విచారణ జరుపుతామని హైకోర్టు సీజే ధర్మాసనం వెల్లడించింది

పురావస్తు భావనాన్ని కూల్చకుండా 26 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించవచ్చని కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన ఓ పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి అన్నారు. మరో కౌన్సిల్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఎవరుపడితే వారు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయం వృధా చేస్తున్నారని బెంచ్ కు తెలిపారు.

పిటిషనర్ దేబారా 15 ఏళ్ల నుంచి ప్రజాపోరాటంలో పాలుపంచుకుంటున్నారని, ఎన్నో వ్యాజ్యాలు వేశారని ఇప్పటికీ హైకోర్టులో ఇతర అంశాలపై రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు విచారణ దశలో ఉన్నాయని కోర్టుకు న్యాయవాది రచనారెడ్డి తెలిపారు.