రాజ్ భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేసిన గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్

2326

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో శనివారం ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  జాతీయ గీతాలాపన తర్వాత, గవర్నర్ రాజ్ భవన్ సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  సోషల్ డిస్టెన్స్ నిబంధనల ప్రకారం దూర దూరంగా నిలుచున్న ఆఫీసర్లు, పోలీస్, ఇతర సిబ్బంది వద్దకు గవర్నర్ స్వయంగా వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు.  

పోలీసు సిబ్బందికి స్వయంగా మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ భర్త డా. సౌందరరాజన్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అంతకు ముందు గవర్నర్ దంపతులు, కుటుంబ సభ్యులు రాజ్ భవన్ లోని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  రాజ్ భవన్ లోని చారిత్రక దర్భార్ హాల్ ముందు జరిగిన ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్ సలహాదారులు రిటైర్డ్ ఐఎఎస్ ఎపివిఎన్ శర్మ, రిటైర్డ్ ఐపిఎస్ ఎకె మొహంతి, గవర్నర్ సెక్రటరి కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘుప్రసాద్, అనుసంధాన అధికారి సిహెచ్ సీతారాములు, డా. రాజారామ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.