సాకర్ స్టార్ కోసం క్రౌడ్ ఫండింగ్-బార్సిలోనాకు మెస్సీ దూరమైనట్లేనా? CH.V.KRISHNA RAO, SPORTS EDITOR

1617

ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్, స్పానిష్ సాకర్ క్లబ్ బార్సిలోనాకు గత 12 సంవత్సరాలుగా ఆడుతున్న లయనల్ మెస్సీ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తన క్లబ్ నిర్వహించిన కరోనా టెస్ట్ తో పాటు…సీజన్ తొలి శిక్షణశిబిరానికి డుమ్మా కొట్టడం ద్వారా కలకలం రేపాడు.
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకొంటున్న మెస్సీ..బార్సిలోనా క్లబ్ తో తన చిరకాల కాంట్రాక్టును రద్దు చేసుకొని వేరే క్లబ్ లో చేరాలని భావిస్తున్నట్లు సాకర్ వర్గాలు అంటున్నాయి.మరోవైపు…మెస్సీ లాంటి మహా ఆటగాడిని భరించడం లేదా కొనుగోలు చేయాలంటే వందల కోట్ల యూరోలు అవసరమని, ఆ శక్తితమకు లేదని యూరోప్ లోని పలు ప్రముఖ సాకర్ క్లబ్ లో వాపోతున్నాయి.
అయితే…జర్మనీకి చెందిన వీఎఫ్ బి స్టుట్ గార్ట్ క్లబ్ అభిమానులు మాత్రం…ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్, స్పానిష్ సాకర్ క్లబ్ బార్సిలోనాకు గత 12 సంవత్సరాలుగా ఆడుతున్న లయనల్ మెస్సీ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తన క్లబ్ నిర్వహించిన కరోనా టెస్ట్ తో పాటు…సీజన్ తొలి శిక్షణశిబిరానికి డుమ్మా కొట్టడం ద్వారా కలకలం రేపాడు..
బార్సిలోనా పై మెస్సీ గరంగరం…
బార్సిలోనా క్లబ్ కు గత పుష్కరకాలంగా అసమానసేవలు అందించిన తనకు…బదిలీ రుసుము చెల్లించకుండా వేరే క్లబ్ లో చేరే హక్కు తనకు ఉందని, ట్రాన్స్ ఫర్మ నీ లేకుండా తనను విడిచిపెట్టాలని మెస్సీ తన లాయర్ ద్వారా సమాచారం అందించాడు. అయితే బార్సిలోనా క్లబ్ వర్గాలు మాత్రం..మెస్సీని వేరే క్లబ్ కు బదిలీ చేయాలంటే తమకు 700 మిలియన్ యూరోలు ( 833 మిలియన్ డాలర్లు ) చెల్లించాల్సిందేనని పట్టుబడుతోంది.స్టుట్ గార్ట్ క్లబ్ సాకర్ అభిమానులు ఇప్పటికే …గో ఫండ్ కామ్…ద్వారా భారీగా నిధుల సేకరణను ఓ ఉద్యమంలా చేపట్టారు. మెస్సీ కోసం గడువు లోపల నిధులు సేకరించలేని పక్షంలో…వసూలైన మొత్తాన్ని వియా కాన్ అగువా అనే స్వచ్చంధ సంస్థకు అందచేస్తామని ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛమైన తాగునీరును అందించడానికి పాటుపడుతున్న స్వచ్చంధ సంస్థగా వియా కాన్ అగువాకు పేరుంది.
ఒకే ఒక్కడు లయనల్ మెస్సీ…
యూరో సాకర్ లీగ్ లో లయనల్ మెస్సీ సాధించిన ఘనత అంతాఇంతాకాదు. అర్జెంటీనాకు ప్రపంచ సాకర్ టైటిల్ అందించడంలో విఫలమైన మెస్సీ…యూరోక్లబ్ సాకర్ లోమాత్రం బార్సిలోనా క్లబ్ ను కేవలం తన సాకర్ మ్యాజిక్ తో అత్యంత విజయవంతమైన క్లబ్ గా నిలిపాడు. కేవలం మెస్సీ పేరుతోనే డజన్ల కొద్దీ అరుదైన, అసాధారణ రికార్డులు ఉన్నాయి.గత 12 సంవత్సరాలుగా బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్ కు మూలస్తంభంలా ఉన్న 33 సంవత్సరాల మెస్సీ..గత 16 సీజన్లలో మొత్తం 34 టైటిల్స్ అందించాడు. ఇందులో
4 చాంపియన్స్ లీగ్, 10 లా లీగా టైటిల్స్ సైతం ఉన్నాయి.వ్యక్తిగతంగా అరడజను బాలన్ డీ ఓర్ ట్రోఫీలు, ఆరు యూరోపియన్ గోల్డెన్ షూస్ అవార్డులు అందుకొన్నాడు.

             గోల్స్ కింగ్ లయనల్.....

రియల్ మాడ్రిడ్ ప్రత్యర్థిగా జరిగిన ఎల్ క్లాసికో మ్యాచ్ ల్లో ఏకంగా 26 గోల్స్ సాధించిన ఒకే ఒక్కడు లయనల్ మెస్సీ మాత్రమే కావడం విశేషం. 2012 సాకర్ సీజన్లోతన క్లబ్, దేశం తరపున 91 గోల్స్ సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పిన తొలి, ఏకైక ఆటగాడు లయనల్ మెస్సీ మాత్రమే. గోల్స్ కింగ్ లయనల్…లా లీగా చరిత్రలో అత్యధికంగా 444 గోల్స్ సాధించిన తొలి, ఏకైక ఆటగాడి ఘనత సైతం మెస్సీకే దక్కుతుంది. బార్సిలోనా క్లబ్ ఆటగాడిగా ఆడిన మొత్తం మ్యాచ్ ల్లో మెస్సీ ఒక్కడే 634 గోల్స్ సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
లా లీగాలో అత్యధికంగా 36 హ్యాట్రిక్ లు సాధించిన ఘనుడు కూడా లయనల్ మెస్సీ మాత్రమే. వరుసగా పది సీజన్లపాటు ఏడాదికి 40 గోల్స్ చొప్పున నమోదు చేసిన మొనగాడుగా మెస్సీ నిలిచాడు.ఇంతటి ఘనత ఉన్న మెస్సీ లాంటి సాకర్ మాంత్రికుడుని బార్సిలోనా క్లబ్ అంత తేలికగా విడిచిపెడుతుందా?..అనుమానమే. జూన్ 10తో బార్సిలోనా క్లబ్ తో మెస్సీ కాంట్రాక్టు గడువు ముగియనుంది.
ఆగస్టు 23న జరిగిన చాంపియన్స్ లీగ్ ఫైనల్లో చివరిసారిగా బార్సిలోనా క్లబ్ తరపున ఆడిన మెస్సీకి 60 మిలియన్ యూరోలు వేతనంగా ఉంది.మెస్సీ కోసం క్యూకట్టిన విఖ్యాత సాకర్ క్లబ్ ల్లో ఇంగ్లండ్ కు చెందిన మాంచెస్టర్ సిటీ, ఫ్రాన్స్ కు చెందిన పారిస్ సెయింట్ జెర్మోన్, ఇటాలియన్ క్లబ్ యువెంటస్, ఇంటర్ మిలాన్ ఉన్నాయి.