Home Blog Page 4

ఇండియా-పాక్‌ మధ్య బయటపడిన సొరంగం

దాయాది దేశం పాకిస్తాన్‌ కుయుక్తులు మరోసారి బట్టబయలయ్యాయి. భారత్‌- పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద గల కంచె కింద ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు గుర్తించాయి. దాదాపు 20 మీటర్ల పొడవు, 25 అడుగుల లోతు గల ఈ టన్నెల్‌ ముఖద్వారం వద్ద లభించిన ప్లాస్టిక్‌ ఇసుక సంచులపై పాకిస్తానీ గుర్తులు(కరాచీ, శకర్‌ఘడ్‌ అనే పదాలు) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వీలుగా ఈ సొరంగాన్ని నిర్మించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పలు చోట్ల భూమి కుంగినట్లుగా కనిపించిందని, ఈ నేపథ్యంలో కంచె కింద భాగంలో ఈ సొరంగాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. వెంటనే యంత్రాలను రప్పించి దానిని పూడ్చినట్లు తెలిపారు.
అదే విధంగా తాజా ఉదంతంతో పెద్ద ఎత్తున సెర్చింగ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు భద్రతా బలగాలు తెలిపారు. ఇటీవల పంజాబ్‌ సరిహద్దులో ఐదుగురు సాయుధులైన చొరబాటుదార్లను హతం చేసిన తర్వాత ఈ మేరకు యాంటీ- టన్నెల్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయం గురించి బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాకేశ్‌ ఆస్తానా మాట్లాడుతూ.. చొరబాటు నిరోధక గ్రిడ్‌ వద్ద భద్రతను మరింత పటిష్టం చేయాలని ఫ్రాంటియర్‌ కమాండర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. బీఎస్‌ఎఫ్‌ ఇన్సెప్టర్‌ జనరల్‌(జమ్ము) ఎన్‌ఎస్‌ జమాల్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. పాకిస్తానీ బార్డర్‌లోని ‘గుల్జార్‌’ పోస్టుకు 700 మీటర్ల దూరంలో ఈ టన్నెల్‌ను గుర్తించినట్లు వెల్లడించారు.

ఏలూరు ఆశ్రమం ఆస్పత్రిలో కోవిడ్‌ పేషంట్‌ ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషంట్‌ ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 17వ తేదీన కరోనా పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిలో చికిత్సకు చేరాడని తెలిపారు కుటుంబసభ్యులు. మృతుడు నిడదవోలుకు చెందిన కోలా రాంబాబుగా గుర్తించారు పోలీసులు. గత మూడు రోజులుగా దేవుడి వద్దకు వెళతానంటూ అరుస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు మృతుడు రాంబాబు తండ్రి. కొడుకు మానసిక స్థితి బాగోలేదని.. అందుకే ఆస్పత్రి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏలూరు రూరల్‌ పోలీసులు.

ఎవరికీ పట్టని జాతీయ క్రీడాదినోత్సవం!

ఆగస్టు 29.. జాతీయ క్రీడాదినోత్సవమని మనదేశంలో చాలామందికి తెలియదనడంలో ఏమాత్రం సందేహం లేదు. భారత హాకీ పితామహుడు , జాతీయ క్రీడామాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిరోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకోడం గత కొద్ది సంవత్సరాలుగా భారతజాతికి ఓ ఆనవాయితీగా వస్తోంది.అయితే గత ఏడాది వరకూ వేడుకగా జరుపుకొన్న జాతీయ క్రీడాదినోత్సవాలు ఒక ఎత్తయితే…ఈ కరోనాసంవత్సరంలో జరుపుకొంటున్న క్రీడాదినోత్సవం మరో ఎత్తు.

టార్గెట్ 2028 ఒలింపిక్స్…
అమెరికా వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్.. పతకాల పట్టిక మొదటి పదిస్థానాలలో భారత్ ను నిలపడమే లక్ష్యంగా పథకాలు సిద్ధం చేసినట్లు కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూచెబుతున్నారు.ఒలింపిక్స్ లో సూపర్ పవర్ గా ఉన్న అమెరికా, చైనా లాంటి దేశాలను అధిగమించే సత్తా భారత్ కు లేకున్నా..పతకాల పట్టిక మొదటి పదిస్థానాలలో నిలవాలంటే కనీసం 10 నుంచి 15 వరకూ బంగారు పతకాలు సాధించాలని, ఆ దిశగా క్రీడావిధానంలో సమూలంగా మార్పులు చేసినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. వివిధ రాష్ట్ర్రాల క్రీడామంత్రులతో సవివరంగా చర్చించిన తర్వాతే పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. కేంద్రప్రభుత్వం, భారత ఒలింపిక్ సంఘం, ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కలసి సమన్వయంతో క్రీడాభివృద్ధికి కృషి చేస్తారని, మొత్తం 14 రకాల క్రీడలను గుర్తించి..వాటిలోనే ఒలింపిక్స్ పతకాలు సాధించటమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు.
మనదేశంలో రాష్ట్ర్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలసి మొత్తం 36 వరకూ ఉన్నాయని, తమ దృష్టిలో ఇవి 36 దేశాలతో సమానమని..ఒక్కో రాష్ట్ర్రం ఒకటి లేదా రెండు రకాలక్రీడల పైన మాత్రమే ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయా రాష్ట్ర్రాలు ఎంపిక చేసుకొన్న క్రీడల అభివృద్ధికి కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ, కార్పొరేట సంస్థలు నిధులు , వివిధ రూపాలలోసహాయసహకారాలు అందిస్తాయని కేంద్ర క్రీడామంత్రి ఇటీవలే ప్రకటించారు.
ఒక్కో రాష్ట్ర్రం పలు రకాల క్రీడలపైన దృష్టి పెడితే సాధించగలిగేది ఏమీ ఉండదని, ఒక్కో రాష్ట్ర్రం తనకు నచ్చిన ఒకటి లేదా రెండు క్రీడలను ఎంపిక చేసుకొని…వాటి పైనేదృష్టి కేంద్రీకరిస్తే ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం ఏమంత కష్టం కాబోదని కిరణ్ రిజ్జూ ధీమాగా చెబుతున్నారు.

          

మనిషితో మహమ్మారి ఆటలు

కంటికి కనిపించని కరోనా వైరస్ తో విశ్వమానవాళి రాజీలేని పోరాటమే చేస్తోంది. మానవజాతికి కరోనా వైరస్ లాంటి మహమ్మారిల పరీక్షను ఎదుర్కొనడం ఇదే మొదటిసారికాదు.మనిషి మాత్రమే కాదు…మనిషిజీవితంలో ఓ ప్రధానభాగంగా ఉన్న క్రీడారంగం సైతం గతంలో ఎన్నడూలేని విషమపరీక్షను ఎదుర్కొంటోంది.ప్రపంచ వ్యాప్తంగా రెండువందలకు పైగా దేశాలను తాకి, జనజీవితాన్ని, ఆర్థికవ్యవస్థలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ చివరకు క్రీడారంగాన్ని సైతం కకావికలు చేసింది. కరోనా వైరస్ ప్రభావానికి భయపడిన ప్రపంచ క్రీడారంగం ముందు జాగ్రత్త చర్యగా నాలుగుమాసాలకాలం లాక్ డౌన్ పాటించి…ఆ తర్వాత ఖాళీ స్టేడియాలలో పోటీలు నిర్వహించడం ప్రారంభించింది. అయితే…టోక్యో వేదికగా జరగాల్సిన 2020 ఒలింపిక్స్, ఆస్ట్ర్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 ప్రపంచకప్, ఫ్రెంచ్ ఓపెన్ లాంటి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పోటీలు, పలురకాల అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీలు రద్దుల పద్దులో చేరిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా వైరస్ దెబ్బతో క్రీడారంగం కొద్దివారాలపాటు స్తబ్ధుగా మారిపోయింది.
భారత హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ జయంతిరోజైన ఆగస్టు 29న…ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలోని విగ్రహానికి పూలమాలలు వేయటం, అదేరోజు సాయంత్రం జరిగే జాతీయ క్రీడాపురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించడంతో…జాతీయక్రీడా దినోత్సం ఓ తంతుగా మిగిలిపోతూ వస్తోంది. 74 సంవత్సరాల స్వతంత్రభారత చరిత్రలో క్రీడారంగ ప్రగతి రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారయ్యింది.నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధి కోసం పలు రకాల చర్యలు చేపట్టింది.
ఒక రాష్ట్రం- ఒకే క్రీడ…
జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ఎన్నోరంగాలలో దూసుకుపోతున్నా…క్రీడారంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేకపోతోంది. అయితే..ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా వినూత్న విధానాలతో పాటుపడుతోంది. ఒలింపిక్స్ పతకాల పట్టిక మొదటి 10 స్థానాలలో నిలవటమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది.
130 కోట్ల జనాభాతో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్నా…ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ పతకాల పట్టిక మొదటి 50 స్థానాలలో నిలవటమే గగనమై పోతోంది. అత్యధిక యువజన జనాభా కలిగిన భారత్ ను క్రీడారంగంలో అమేయశక్తిగా తీర్చిదిద్దటానికి ప్రధాని నరేంద్ర మోడీ, క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ వినూత్న విధానాలు, విప్లవాత్మక ఆలోచనలతో పాటుపడుతున్నారు. భారత క్రీడారంగ మౌలిక స్వరూపాన్నే మార్చివేయాలన్న పట్టుదలతో పలు రకాల చర్యలకు శ్రీకారం చుట్టారు.
అట్టడుగుస్థాయి నుంచే…..
లక్షలాది గ్రామాలు, పల్లెలకు ఆలవాలమైన భారత్ లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఏమాత్రం కొదవలేదు. ప్రాథమిక స్థాయిలోనే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, ప్రపంచ మేటి శిక్షకుల పర్యవేక్షణలో తీర్చిదిద్దటానికి కేంద్రప్రభుత్వం ఖేలో ఇండియా గేమ్స్ ను నిర్వహిస్తోంది.
10 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతిభావంతులైన బాలలు, యువతను గుర్తించి..ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వటానికి కేంద్రక్రీడామంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేసింది. దేశంలోని వివిధ రాష్ట్ర్రాలతో కలసి పని చేస్తూ ప్రతిభాన్వేషణ కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తోంది. దేశంలోని మొత్తం 36 రాష్ట్ర్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వెయ్యికి పైగా ప్రతిభాన్వేషణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులలో ప్రతిభను గుర్తించడానికి శిక్షకులు, నిపుణుల బృందాలను అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర్రాలు, కేంద్ర పాలిత
ప్రాంతాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయటానికి చర్యలు చేపట్టింది.

క్రీడాశిక్షకులకు డబుల్ థమాకా…
అత్యుత్తమ క్రీడాకారులను తిర్చిదిద్దిన దేశీయ శిక్షకులను …విదేశీ శిక్షకులతో సమానంగా ఆదరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఒలింపిక్స్ లో పతకాలుసాధించగల అథ్లెట్లను తీర్చిదిద్ధిన భారత శిక్షకులకు ఇప్పటి వరకూ ఇస్తున్న 2 లక్షల రూపాయల వేతనం పై పరిమితిని ఎత్తివేయటంతో పాటు…నాలుగేళ్ళపాటుకాంట్రాక్టు ఇవ్వాలని భారత క్రీడాప్రాధికార సంస్థ నిర్ణయించింది. దీంతో దేశవాళీ క్రీడాశిక్షకులకు ఉద్యోగభద్రతతో పాటు ఆర్థికంగా భరోసా కూడా ఉంటుందని, ఫలితంగాఅత్యుత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకాలు అందించే అవకాశం ఉన్న కుస్తీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ, విలువిద్య, బ్యాడ్మింటన్, షూటింగ్ తో సహా మొత్తం 14 క్రీడాంశాలను కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ 14 రకాల క్రీడాంశాల నుంచి ఒక్కో క్రీడను ఒక్కో రాష్ట్ర్రానికి కేటాయించడంతో పాటు క్రీడాభివృద్ధికి తగిన నిధులు సైతం సమకూర్చాలని నిర్ణయించింది. ఒకటి లేదా రెండు క్రీడాంశాలకు ఒక్కో కార్పొరేట సంస్థ స్పాన్సర్ గా ఉంటాయని, ప్రతిభావంతులైన క్రీడాకారులు, శిక్షకులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని, ఇక ఆశించిన ఫలితాలు సాధించడమే మన కర్తవ్యమని కిరణ్ రిజ్జూ అంటున్నారు. అంతేకాదు..ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచే క్రీడలను నిర్భంధ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టే దిశగాకూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
1980 మాస్కో ఒలింపిక్స్ లో భారత్ చివరిసారిగా హాకీ బంగారు పతకం సాధించగా…2008 బీజింగ్ ఒలింపిక్స్ లో షూటర్ అభినవ్ బింద్రా వ్యక్తిగతంగా ఒకే ఒక్క స్వర్ణ పతకం నెగ్గడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
మరో ఎనిమిదేళ్లలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో భారత్ 10 నుంచి 15 వరకూ బంగారు పతకాలు సాధించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకొంది. ఈ బంగారు కల నిజం కావాలంటే ప్రభుత్వం, క్రీడాసంఘాలు, కార్పొరేట్ సంస్థలు, క్రీడాకారులు, శిక్షకులు కలసి పనిచేయటమే కాదు…అంకితభావంతో పాటుపడక తప్పదు.నాలుగుదశాబ్దాల క్రితం చివరిసారిగా హాకీలో బంగారు పతకం సాధించిన భారతజట్టు…వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించగలిగితే…భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు తగిన నివాళి అర్పించినట్లవుతుంది. అప్పుడే అది అసలు సిసలు జాతీయక్రీడా దినోత్సవం కాగలుగుతుంది.
– చొప్పరపు కృష్ణారావు ( 84668-64969 )

13 మందికి కరోనా: బీసీసీఐ

మరికొద్ది రోజుల్లో డ్రీమ్‌ 11 ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ ప్రారంభమవుతుండగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటం అటు క్రికెట్‌ అభిమానుల్నే కాకుండా ఇటు బీసీసీఐ అధికారుల్ని కూడా కలవరపాటుకు గురిచేసింది. ఇద్దరు ఆటగాళ్లు, మరో 11 మంది సహాయక సిబ్బందికి వైరస్‌ సోకిందని కొద్దిసేపటి క్రితమే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ మెగా టోర్నీ నిర్వహణతో పాటు ఆటగాళ్ల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.   
అన్ని జట్లూ యూఏఈకి చేరుకున్నాక ఆగస్టు 20-28 తేదీల మధ్య ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి, ఆయా జట్ల యాజమాన్యాలకు అందరికీ కలిపి 1,988 ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించామని చెప్పింది. అందులో ఇద్దరు క్రికెటర్లకు, 11 మంది సిబ్బందికి వైరస్‌ సోకిందని నిర్ధారించింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఎలాంటి కరోనా లక్షణాలు లేవని పేర్కొంది. వారిని కలిసిన ప్రైమరీ కాంటాక్టులు కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారని చెప్పింది. అలాగే ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ టోర్నీ జరిగే అన్ని రోజులూ పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు తరచూ అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.   

అడ్డగోలు దోపిడీ తప్ప, అభివృద్ధి ఎక్కడుంది?

15 నెలల జగన్ పాలనలో ఎక్కడా రాష్ట్రంలో రూ.లక్ష రూపాయల అభివృద్ధి జరగలేదని, కోటిరూపాయలతో ఒక్కప్రాజెక్ట్ పనిజరగలేదని, గతప్రభుత్వం కట్టినభవనాలకు రంగులేసుకోవడం తప్ప, జగన్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఏంచేశారో చెప్పాలని, టీడీపీ తరుపున గతంలో అనేకసార్లు ఈ పాలకులను ప్రశ్నించి, చర్చకు రావాలని సవాల్ చేస్తే, ఒక్కరూ రాలేదని, చివరకు చేసేదిలేక తోక ముడిచారని బొండా ఎద్దేవాచేశారు. వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఏంచేసిందో, ఏఏప్రాంతాలకు న్యాయంచేశారో చెబుతూ శ్వేతపత్రం విడుదల చేయాలనికోరినా ప్రభుత్వంనుంచి ఎవరూముందుకు రాలేదన్నారు. టీడీపీప్రభుత్వం 13 జిల్లాల అభివృద్ధికి కృషిచేసిందని, రూ.64వేల కోట్లతో సాగు, తాగునీటి ప్రాజెక్టులునిర్మించిందన్నారు. విజయవాడలో నిర్మించిన కనకదుర్గ మ్మ ఫ్లైఓవర్ నిర్మాణం టీడీపీ ప్రభుత్వంలో జరిగితే, దాన్ని తాము నిర్మించామని కొందరు మూర్ఖులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు విజయవాడలో జరిగిన ధర్నా కార్యక్రమానికిహాజరై, అక్కడున్న సమస్యను గుర్తించి, అధికారం లోకి రాగానే ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పడం జరిగిందన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న జోగిరమేశ్, మల్లాది విష్ణు, లగడపాటి రాజగోపాల్, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడంజరిగిందన్నారు. అటువంటి మూర్ఖులు గతం మర్చిపోయి, టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఫ్లైఓవర్ కు సున్నాలేసుకుంటూ, తామేకట్టామని నిర్లజ్జగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను ప్రచారం కోసం తమబిడ్డని చెప్పుకునే నీచస్థితికి వైసీపీప్రభుత్వం దిగజారిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. 2009-14 మధ్య శాసనసభ్యులుగా ఉన్న కొందరుబఫూన్లు, చిల్లరకోసం కక్కుర్తిపడి విజయవాడ అభివృద్ధిని అడ్డుకున్నారని బొండాఆగ్రహంవ్యక్తంచేశారు. కనకదుర్గ మ్మ ఫ్లైఓవర్ కట్టడానికి వీల్లేదంటూ నాడు ప్రతిపక్షనేత చంద్రబాబు ధర్నాను అడ్డుకున్నారన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వర్షాలతో వరదలు వచ్చినప్పుడు ప్రజలు పడవలు వేసుకొని తిరిగారన్నారు. టీడీపీప్రభుత్వం వచ్చాక రూ.500కోట్లతో డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించి, నగరంలోని 59 డివిజన్లలో వరదనీరు నిలవకుండా చర్యలు తీసుకుందన్నారు. విజయవాడ నగరాభివృద్ధి కాంగ్రెస్ పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా ఉండేదన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఫ్లైఓవర్ పై నడవడానికి ముందు, ఆనాడు దానినిర్మాణాన్ని అడ్డుకున్నవారందరూ ముందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బొండా డిమాండ్ చేశారు.
విజయవాడ ప్రజలందరూ వైసీపీకి ఓటేసినందకు తమచెప్పుతో తామేకొట్టుకుంటున్నారని ఉమా స్పష్టంచేశారు. మంత్రి వెల్లంపల్లి గుడిని, గుడిలో లింగాన్ని మింగేసేలాతయారయ్యాడని, పవిత్రమైన దేవాలయా లను పెట్టుబడివనరులుగా మార్చుకున్నాడని బొండా ఆక్షేపించారు. సింహాచలం దేవాలయ భూములపై కన్నేశాడని, కనకదుర్గమ్మ గుడిలో కోట్లాదిరూపాయలను, అన్నవరం సత్యదేవుని ఆలయంలో సొమ్ముని వెల్లంపల్లి దిగమింగుతున్నాడ ని టీడీపీనేత మండిపడ్డారు. శ్రీశైలం ఆలయంలో టిక్కెట్ల కుంభకోణంతో కూడా దండుకున్నారన్నారు. గుంటూరు ఎమ్మెల్యే గుట్కా ప్యాకెట్లు అమ్ముకుంటుంటే, మరోనేత పేకాటకేంద్రాలు నిర్వహిస్తున్నాడన్నారు. కర్నూల్లో ఒకమంత్రి పేకాట క్లబ్ లు నిర్వ హిస్తూ దండుకుంటున్నాడన్నారు. విజయవాడలో మంత్రేమో కరోనా పేరుచెప్పి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలుచేసి, ఆఖరికి కరోనా వైరస్ తో కూడా వ్యాపారం చేసి, పడకలు ఇప్పిస్తామని చెప్పి, రోగులనుంచి సొమ్ములు వసూలుచేసే నీచస్థాయికి దిగజారాడన్నారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ప్రజలనుంచి, వ్యాపారుల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకుంటున్నారన్నారు. అవినీతి రూపుమాపడానికి టోల్ ఫ్రీ నంబర్లు పెట్టామని, మహిళలకోసం దిశాచట్టం తెచ్చామని చెప్పుకుంటూ తిరుగుతున్న వైసీపీనేతలు ఎంతమందికి న్యాయం చేశారో చెప్పాలని ఉమా నిలదీశారు. దళిత యువకులకు శిరోముండనాలు చేసినప్పుడు, తూర్పుగోదావరిలో దళిత బాలికపై, కర్నూల్లో గిరిజన మహిళపై అత్యాచారం చేసినప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చిన పనికిమాలిన చట్టాలు ఏమయ్యాయని బొండా మండిపడ్డారు. విజయవాడ నగరంతోపాటు, రాష్ట్రాభివృద్ధిపై చర్చించడానికి ముందుకొచ్చే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వంలోని వారికిగానీ ఉంటే తక్షణమే బహిరంగచర్చకు రావాలని బొండా మరోసారి సవాల్ విసిరారు.

శిరోముండనం కేసులో ఏడుగురు అరెస్టు

శాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్ నగర్ కు చెందిన దళిత యువకుడికి గుండు గీసి దాడి చేసిన ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ..దీనికి సంబంధించిన వివరాలను శనివారం ఉదయం పోలీస్ కమిషనరేట్ లో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు ..శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన కర్రీ శ్రీకాంత్ 20 కు నాన్న అమ్మ చెల్లి ఉన్నారు.. ఉపాధి కోసం విశాఖ వచ్చిన అతడు నగరంలోని సుజాత నగర్ లో గల సినీ నిర్మాత బిగ్ బాస్ 2 సేమ్ నూతన్ నాయుడు ఇంట్లో నాలుగు నెలల క్రితం పనికి కుదిరాడు.. కాగా ఈ నెల 1 న జీతం తీసుకొని పని మానేశాడు.. తమ ఇంట్లో లో దొరికి గురైన సెల్ ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్ నాయుడు భార్య గురువారం రాత్రి శ్రీకాంత్ నీ ఇంటికి రప్పించారు.. సెల్ఫోన్ విషయమై నిలదీయడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి శ్రీకాంత్ వెళ్లిపోయాడు ..శుక్రవారం మధ్యాహ్నం మరోసారి సూపర్వైజర్ ద్వారా శ్రీకాంత్ ఇంటికి పిలిపించారు. నూతన్ నాయుడు భార్య ఇంట్లో పని చేస్తున్న సిబ్బంది అతన్ని గట్టిగా కొట్టి ఇ గాయపరిచారు .ఆ తర్వాత బార్బర్ ను పిలిపించి శ్రీకాంత్ గుండు కొట్టించారు. అంతటితో ఆగకుండా రాడ్డు తో దాడి చేసి అతన్ని గాయపరిచారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి పంపించేశారు. ఈ విషయం మీడియా ద్వారా శ్రీకాంత్ బహిర్గతం చేశాడు. ఎందుకు పోలీసులు అతని స్టేషన్కు తీసుకెళ్ళి విచారించగా మొత్తం వివరాలు ఫిర్యాదు రూపంలో ఇచ్చాడు .ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేయగా దీంట్లో ఏడుగురు భాగస్వాముల్ని గుర్తించి అరెస్టు చేశారు .అందులో లో ఉన్న నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి, ఇందిరా రాణి , వరహాలు బాలగంగాధర్, ఝాన్సీ, సౌజన్య రవికుమార్ తదితరులను శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సంఘటనపై ఇప్పటికే దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పోలీస్ కమిషనర్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది.. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తప్పక శిక్షిస్తామని సి పి మనీష్కుమార్ సిన్హా చెప్పడంతో ఆందోళనలు సద్దుమణిగాయి. ఈ విలేకరుల సమావేశంలో సి పి తో పాటు డిసిపి క్రైమ్ , సౌత్ ఇంచార్జి డిసిపి వి. సురేష్ బాబు ఏసీపీ వెస్ట్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్, పెందుర్తి ఇన్చార్జి సీఐ మల్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు

సెప్టెంబర్ 1, 2 తేదీలలో ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటన

దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 1, 2 తేదీలలో జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను, కార్యక్రమాలను విజయవంతం చేయాలని.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని విసి హాలులో ఎస్పి కె.కె.ఎన్. అన్బురాజన్ తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి 1, 2 తేదీల్లో రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారన్నారు. పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూలు వివరాలు అందాల్సి ఉందన్నారు.
ప్రాథమిక సమాచారం మేరకు సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం కడప ఎయిర్ పోర్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తారని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకుని.. ఆ రాత్రి అక్కడే బస చేయడం జరుగుతుందన్నారు. 2న ఉదయం దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని వైయస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. అనంతరం గెస్ట్ హౌస్ చేరుకుని మధ్యాహ్నం పైన ఇడుపులపాయ హెలిప్యాడ్ కి చేరుకొని అక్కడి నుంచి కడప విమానాశ్రయం చేరుకొని.. తదుపరి విజయవాడ బయల్దేరి వెళ్తారని పేర్కొన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (SOP) తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా అతి తక్కువ సంఖ్యలో ముందస్తుగా అనుమతించిన వారిని మాత్రమే.. ముఖ్యమంత్రి పర్యటనలో అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇడుపులపాయ ఎస్టేట్, ముఖ్యమంత్రి పర్యటన విధుల్లో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించేందుకు… అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “స్పందన” వాలంటీర్ల ద్వారా స్వీకరించి అనంతరం ముఖ్యమంత్రికి అందజేయడం జరుగుతుందన్నారు. కడప ఎయిర్ పోర్టు, ఇడుపులపాయ హెలిప్యాడ్, వైయస్సార్ ఘాట్ వద్ద ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను, ఇతర కార్యక్రమాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
సమావేశంలో ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని జాగ్రత్తలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బసచేసే అతిధి గృహం, వివిఐపి ల వసతి గృహాల వద్ద.. ఇడుపులపాయ హెలిప్యాడ్, ఎస్టేట్ వద్ద, గెస్ట్ హౌస్ వద్ద, రోడ్ సైడ్, ప్రత్యేక పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని సూచించారు.
మాస్కులు లేని వారిని ఎట్టి పరిస్థితులలో అనుమతించమని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం వివిధ అంశాలపై కలెక్టర్, ఎస్పీ సమీక్షించి వివిధ విభాగాలకు చెందిన అధికారులకు సీఎం పర్యటన ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరిగింది. వారికి కేటాయించిన విధులపై కలెక్టర్ తగిన సూచనలు జారీ చేశారు.
ఈ సమావేశంలో జేసి (అభివృద్ధి) సి.ఎం.సాయికాంత్ వర్మ, జేసీ (సంక్షేమం) ధర్మ చంద్రారెడ్డి, కడప సబ్ కలెక్టర్ పృద్వితేజ్, డిఆర్వో ఎ. మాలోల, పాడ ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, కడప నగర పాలక కమీషనర్ లవన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సతీష్ చంద్ర, స్టెప్ సీఈఓ డా.రామచంద్రారెడ్డి, విద్యుత్, ఆర్ అండ్ బి, పీఆర్ శాఖల ఇంజనీర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

టిడిపి దళిత నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu. (Photo: IANS)

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న గొలుసుకట్టు దాడుల నేపథ్యంలో శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు టిడిపి దళిత నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సెల్ నాయకులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, అనిశారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి తదితరుల హవుస్ అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ ప్రజల్లో ఒత్తిడి తట్టుకోలేకే ఓం ప్రతాప్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేశారు. టిడిపి పట్టుబట్టడం వల్లే పోస్ట్ మార్టమ్ జరిపారు. రహస్యంగా పోస్ట్ మార్టమ్ చేయాల్సిన అవసరం ఏమిటి..? మీడియాను రానివ్వకుండా పోస్ట్ మార్టమ్ చేయడం ఏమిటి..? ఉరేసుకుని చనిపోతే పోస్ట్ మార్టమ్ చేయడం పోలీసుల బాధ్యత. తమ బాధ్యత పోలీసులు నిర్వర్తించక పోవడం తొలి తప్పు. అది చేయకుండా హడావుడిగా అంత్యక్రియలు జరపడం మరో తప్పు. చివరికి ఏదో మొక్కుబడిగా పోస్ట్ మార్టమ్ తంతు ముగించారు. మృతుడి మొబైల్ ఫోన్ ను పోలీసులే లాగేసుకోవడం మరో తప్పు. కేసు లేకపోతే ఓం ప్రతాప్ సెల్ ఫోన్ ఎందుకు తీసుకెళ్లారు..? ఈ కేసులో మృతుడు ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ ముఖ్యం. ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ ను బైట పెట్టాలి. చనిపోవడానికి ముందు ఓం ప్రతాప్ కు ఎవరెవరు బెదిరింపులు చేశారో బైటపెట్టాలి.
బెదిరించి, ప్రలోభాలు పెట్టి, జరిగిన నేరాన్ని కప్పెట్టాలని చూడటం హేయం.
చౌటపల్లిలో మరో దళితుడి ప్రాణాలు కూడా తీశారు. ట్రాక్టర్ బోల్తా పడి చనిపోయాడని నమ్మించారు. అటవీ ప్రాంతంలో ఎర్రమట్టి తీసుకెళ్లడానికి వెళ్లిన ట్రాక్టర్ బోల్తా పడి మీ నాయన చనిపోయాడని చెప్పారు. మృతదేహం ఒళ్లంతా కాలిన గాయాలు ఉన్నాయి. మృతుడు నివసించే వీధిలో సిమెంట్ రోడ్డు ప్రారంభించారు. వైసిపి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారనే కక్షతో అతడిని చంపేసి ట్రాక్టర్ బోల్తా పడిందనే నాటకం ఆడుతున్నారు. ట్రాక్టర్ బోల్తా పడి చనిపోతే కాలిన గాయాలు ఎలా ఉంటాయి..?
గతంలో చిత్తూరు జిల్లాలో (కెవి పల్లి క్రాస్ రోడ్డులో రొంపిచర్ల) త్రిపుల్ మర్డర్ జరిగింది. మళ్లీ ఇప్పుడు అంతకు మించిన నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారు.
చిత్తూరు జిల్లాలో దళితులపై వరుస దాడులకు మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలే కారణం.
నెల రోజుల క్రితం పుంగనూరులో దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. యేర్పేడులో మరో దళిత మహిళపై అత్యాచారం చేశారు. శ్రీ కాళహస్తిలో దళిత యువకుడిని కొట్టి చంపేశారు. వైసిపి అధికారంలోకి వచ్చాక చిత్తూరు జిల్లాలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
దళితులపై దాడులకు పాల్పడేవాళ్లను అడ్డుకోలేక, నేరస్థులపై కఠిన చర్యలు చేపట్టలేక, వాటిని బైటపెట్టిన వాళ్లనే సాక్ష్యాధారాలు ఇవ్వాలని ఎస్ పి కోరడం బాధ్యతారాహిత్యం.
విశాఖలో ఇంకో దళిత యువకుడికి శిరోముండనం చేశారు. పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ లో శ్రీకాంత్ కు శిరో ముండనం చేయడం గర్హనీయం. ఫోన్ దొంగతనం సాకుతో, అక్రమంగా నిర్బంధించి దళిత యువకుడిని దారుణంగా హింసించడం అమానుషం.
దళితులపై రాష్ట్రంలో ఇన్ని దారుణాలు చేస్తుంటే వైసిపి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. 3నెలల్లో వరుసగా 2జిల్లాలలో శిరో ముండనాలు మానవత్వానికే సిగ్గుచేటు. తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్ శిరో ముండనం, విశాఖలో శ్రీకాంత్ శిరోముండనం వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు. వరప్రసాద్ శిరోముండనం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేస్తే, ఇప్పుడీ విశాఖ శ్రీకాంత్ శిరో ముండనం జరిగేదా..?
వరుస శిరో ముండనాలకు సీఎం జగన్ బాధ్యత వహించాలి. దళితులపై ఇన్ని దాడులు జరుగుతోన్నా సీఎం జగన్ కనీసం ఖండించక పోవడం దారుణం. శిరో ముండనానికి పాల్పడిన వాళ్లను అరెస్ట్ చేయరా..? అత్యాచారాలకు పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకోరా…? హత్యలు చేసిన వాళ్లపై కఠిన చర్యలు చేపట్టరా..? జగన్ అండతోనే అన్ని జిల్లాలలో అరాచక శక్తులు పేట్రేగి పోతున్నాయి.
టిడిపి హయాంలో దళితుల సాధికారత కోసం కృషి చేశాం. జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం. 42సిఫారసులు చేస్తే ప్రతిదానిపైన జీవో ఇచ్చాం. దళితుల హక్కులను కాపాడాం. మండలాల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు వేశాం. రెండు గ్లాసుల సిద్దాంతానికి వ్యతిరేకంగా పోరాడాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్ వేశాం. దాడులు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేశాం. దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించాం.
వైసిపి నాయకులు దళితులను నమ్మించి మోసం చేశారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ల ప్రాణాలనే బలి తీసుకోవడం కిరాతకం.
15నెలలుగా దళితులపై గొలుసుకట్టు దాడులు చేస్తున్నారు. వరుస దాడులతో దళితులను బెంబేలెత్తిస్తున్నారు. ఇష్టారాజ్యంగా దాడులు చేస్తే సహించేది లేదు.
దళితుల ప్రాణాలంటే వైసిపి నాయకులకు చులకనగా మారింది. ఎంత మందిని చంపినా, ఎన్ని అత్యాచారాలు చేసినా, శిరో ముండనాలు చేసినా తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంభావంతో వైసిపి వ్యవహరిస్తోంది.
రాష్ట్రంలో దళితులపై జరుగుతోన్న దాడులన్నీ వైసిపి కిరాతక చర్యలే. దళితులపై ఇంత దమనకాండ దేశంలో ఎక్కడా లేదు. ఎవరి ఓట్లతో అయితే గద్దె ఎక్కారో, వాళ్ల ప్రాణాలే బలిగొనడం రాక్షసత్వం.
వీళ్ల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెచ్చారు. వైసిపి వేధింపులు భరించే కన్నా చావే శరణ్యంగా భావించడం సిగ్గుచేటు.
దళితులపై దాడుల కేసులలో దోషులకు శిక్ష పడేదాకా వదిలి పెట్టరాదు.
దళితులపై వైసిపి హింసాకాండను మానవతావాదులంతా గర్హించాలి. ప్రజా సంఘాలన్నీ వైసిపి అరాచకాలను ఖండించాలి. బాధిత దళిత కుటుంబాలకు బాసటగా అందరూ నిలబడాలని’’ చంద్రబాబు ఈ టెలికాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో చిత్తూరు జిల్లా టిడిపి నేతలు అమరనాథ్ రెడ్డి, కిశోర్ కుమార్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, దొరబాబు, మాజీ మంత్రులు జవహర్, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే డిబివి స్వామి, విజయ్ కుమార్, దేవతోటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నూతన్‌ నాయుడు ఇంట్లో నిర్వాకం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని, పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ కుమార్‌ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్‌ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

► విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో గిరిప్రసాద్‌నగర్‌లోని నూతన్‌కుమార్‌ నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడు నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో ఆగస్టులో పని మానేశాడు. అయితే శుక్రవారం శ్రీకాంత్‌కు నూతన్‌కుమార్‌ భార్య మధుప్రియ ఫోన్‌ చేసి ‘నువ్‌ సెల్‌ఫోన్‌ తీశావు.. ఇంటికిరా మాట్లాడాలి’ అని పిలిచింది.
► అక్కడకు వెళ్లిన శ్రీకాంత్‌ను నిర్బంధించి అతడిపై తప్పుడు ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సెలూన్‌ నిర్వాహకుడు రవిని పిలిపించి మధుప్రియ సమక్షంలో శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు.
► తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్‌ పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినా«థ్‌ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు. అతడి వాంగ్మూలం మేరకు నిందితురాలు మధుప్రియ సహా నలుగురిని జరిగిన ఘటనపై విచారిస్తున్నారు.
► ఈ ఘటనలో నూతన్‌కుమార్‌నాయుడు పాత్రపై లోతుగా విచారణ చేస్తున్నారు. కాగా నూతన్‌ కుమార్‌ నాయుడు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పెందుర్తి ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేశారు. గతేడాది ఓ చానల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్‌ షోలో పాత్రధారి. ఇటీవల విడుదలైన పరాన్నజీవి చిత్రానికి దర్శకుడు. విశాఖ నగర మాజీ మేయర్, ప్రస్తుత టీడీపీ నేతకు వ్యాపార భాగస్వామి అని సమాచారం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు సన్నిహితుడు, వీరాభిమాని.
► ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఘటనను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చెప్పారు. తననేమైనా చేస్తారని భయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితుడు కర్రి శ్రీకాంత్‌కోరాడు.

పులివెందుల ఎస్సై గోపీనాథరెడ్డి సాహసం

అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవడానికి ఓ ఎస్సై ప్రాణాలకు తెగించాడు. కడప జిల్లా పులివెందులలో ఎస్సై గోపీనాథరెడ్డి పక్కా సమాచారంతో వాహనాలను తనిఖీ చేసాడు. ఆ సమయంలో రాఘవేంద్ర థియేటర్ సమీపంలో ఓ కారులో మద్యం తరలిస్తున్నారని ఎస్సై గుర్తించారు. వెంటనే ఎస్సై సిబ్బందితో సహా ఆ కారును చుట్టుముట్టారు. కాగా నిందితుడు కారును ముందుకు పోనిస్తూ పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేసాడు. దాంతో ఎస్సై గోపీనాథ్ రెడ్డి చాకచక్యంగా కారుపై దూకి సినిమా ఫక్కీలో రెండు కిలోమీటర్ల వరకు కారు ముందు భాగంలో పడుకొని వారిని ఆపాడు. ఈ క్రమంలో పోలీసులు కారును వెంబడించి అడ్డుకున్నారు. నిందితుడు కారు దూకి పారిపోగా కారులో నుండు 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సింహాద్రిపురం మండలం రావుల కొలను గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. గతంలో కూడా నిందితుడిపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.