Home Blog Page 6

హైకోర్టులో పోతినేని రమేశ్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్

Dr Pothineni.Ramesh Babu Bail petition

విజయవాడ ఆగష్టు 17
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 10మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రమేష్ హాస్పిటల్స్కు చెందిన ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు.


ఇప్పటికే పరారీలో ఉన్న రమేష్ బాబును పట్టుకోవడానికి ఎనిమిది ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ రావు కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.ఇప్పటికే దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని సిఆర్పిసి సెక్షన్ 160 కింద పోలీసులు రమేష్ బాబు శ్రీనివాస్ రావులకు నోటీసులు ఇచ్చారు


అగ్నిప్రమాదానికి కారణమైనందున రమేష్ హాస్పిటల్ లైసెన్స్ ను కూడా కృష్ణ జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. కాగా ఈ ప్రమాదంపై స్పందించిన టాలీవుడ్ హీరో రామ్ వ్యాఖ్యలను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 90 సిఆర్పిసి కింద పోతినేని రమేష్ బాబు సోదరుడి కుమారుడైన హీరో రామ్ పోతినేనికి పోలీసులు నోటీసులు అందిస్తారని రమేష్ ఆసుపత్రి సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నారని విజయవాడ ఎసిపి సూర్యచంద్రరావు స్పష్టం చేశారు

సోషియా మీడియాలో వ్యతిరేకించిన హీరో రామ్ కు ఏదైనా ఆధారాలు ఉంటే అతను పోలీసుల ముందు హాజరుపరచాలి” అని ఏసీపీ స్పష్టం చేశారు.ఈ అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటికే విజయవాడ సౌత్ జోన్ పోలీసులు డాక్టర్ మమతాతోపాటు పరారీలో ఉన్న కుటుంబ సభ్యులు సహా మరో 9 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.

జెసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన కడప జైల్లో ఉన్నారు. జైల్లో ఉండగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్‌రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు.

దీంతో ఆయనకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ను అనంతపురం కోర్టు మంజూరు చేసింది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలై ఇంటికొస్తుండగా కోవిడ్ నిబంధనల మేరకు వాహనాల అనుమతికి ఓ పోలీస్ అధికారి అనుమతి ఇవ్వలేదు.

దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీస్ అధికారి ఫిర్యాదుతో ఆయనపై మళ్లీ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కడప జైలుకు తరలించారు. జైల్లో ఉండగా కరోనా వైరస్ సోకింది. ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతారో తెలియాల్సి ఉంది.

ఏకత్వంలో భిన్నత్వం ..శరద్ పవార్ వ్యక్తిత్వం

నాకు శరద్ పవార్ అంటే అంతగా నచ్చకపోయేవాడు. అయన ప్రొఫెషనల్ పొలిటీషన్ కావడం, తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ లబ్దితో కూడుకుని ఉండటం, పొత్తులు, ఎత్తుగడల రాజకీయ వ్యూహాలు నా వంటి సామాన్యులకు అర్దం కాకపోవడం, రాజకీయాలు చాలవన్నట్లు క్రికెట్ రంగాన్ని శాసించడం, కుటుంబ పాలన వంటి కారణాల వల్ల ఆయన గురించి పెద్దగా తెలుసుకోవాలని అనిపించ లేదు. కాని కాంగ్రెస్ సంప్రదాయ రాజకీయాలను బద్దలు కొట్టి..శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి తర్వాత శరద్ పవార్ కేవలం పవర్ కోసం ఆ పనిచేయలేదు. ఇంక ఏదో బలమైన కారణం ఉంటుందన్న భావన నాలో కలిగింది. ఎందుకంటే మహరాష్ట సీఎంగా నాలుగు పర్యాయాలు, కేంద్ర మంత్రిగా మూడు పర్యయాలు పనిచేసిన సీనియర్ మోస్ట్ పోలిటిషన్..రాజకీయ వైరుధ్యాలను కాదని శివసేనతో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది, ఆయన రాజకీయ వ్యూహమేంటీ, అసలు శరద్ పవార్ రాజకీయ ఎదుగుదుల, మహారాష్ట్రకు, దేశానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. దీంతో ఆయన అటోబయోగ్రఫి “On My Terms” చదివితే…ఆయన ఎంత ఇన డెప్త్ పొలిటిషనో అర్ధం అవుతోంది. 1967 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు గెలిచి అసెంబ్లీ మొదలు కుని రాజ్యసభ వరకు అన్ని పదవులను అనుభవించారు. 53 ఏల్ల సూదీర్ఘ రాజకీయంలో ఏనాడు ఓటమి చెందని పవార్..మహరాష్ట రాజకీయాలకు పర్యాయపదంగా మారారు. 80 సంవత్సరాల వయసులోనూ నిత్య విద్యార్ధిగా కొత్త విషయాలను, దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు, వస్తున్నమార్పులు, తెస్తున్న నూతన సంక్షేమ పథకాలను అద్యయనం చేసేందుకు ఆరాట పడతారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి సమయం వెచ్చించడం మొదలుకుని మంత్రిగా గత ప్రభుత్వాల అనుభవాలను, అభిప్రాయాలను తెలుసుకునేందుకు మంత్రుల నోట్ ఫైల్స్ ను క్షుణ్ణంగా అద్యయనం చేయడం ద్వారా..రాజకీయాలు, ఎన్నికలు, పరిపాలన రంగాల్లో బలంగా పాతుకు పోగలిగారు పవార్. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ప్రజల కేంద్రంగా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. మన దేశంలో కరువు పనులు అనే కాన్సెప్ట్ తెచ్చిందే శరద్ పవార్. 1960ల్లో మహరాష్టలో భీకరమైన కరువు వచ్చింది. ఐరాస లోని ప్రపంచ ఆహర సంస్థ మహరాష్టలో ప్రజల ఆకలిని తీర్చేందుకు ఉచితంగా తిండి గింజలు సరఫరా చేసేది. అయితే ఉచితం సముచితం కాదని..దేనికైనా సోషల్ వాల్యు ఉండటం ముఖ్యమని, కరువు నివారణ కోసం ప్రతి తిండి గింజ పెట్టుబడి కావాలని పనికి ఆహర పథకం తీసుకోచ్చే విధంగా ప్రపంచ ఆహర సంస్థ ను ఒప్పిస్తారు. అయితే అది కొత్త పథకం కావడం, ఏలా అమలు చేయాలో తెలియక పోవడం తో..శరద్ పవార్ కే భాద్యతలు అప్పజెప్పి ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన ఈ కరువు పనులు విజయవంతం కావడంతో..పనికి ఆహర పథకానికి మన దేశంలో బాటలు పడ్డాయి. పనికి ఆహరం పథకం కింద చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, వాటర్ కన్సర్వేషన్ పెరగడంతో..కరువు ను కట్టడి చేయగలిగారు. ఇప్పటికీ కరవు పీడిత ప్రాంతాల్లో ఈ పథకం అమలు కావడం చూస్తే 50 సంత్సరాల క్రితం శరద్ పవార్ చేసిన ఆలోచన ఎంత ఉన్నంతగా ఉందో అర్థం అవుతోంది. సీఎంగా ముంబాయి బాంబు పేలుల్లు, లాతూర్ బుకంప సంక్షోభాలను సమర్ధవంగా ఎదుర్కున్న పేరు సంపాదించారు. బాంబే పేలుల్లు హిందు ముస్లిం మత ఘర్షణలుగా మారకుండా ఉండేందుకు ముస్లిం ఏరియాల్లో సైతం బాంబులు పేలాయని మీడియా సమావేశాల్లో అవాస్తవాలు చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. లాతూర్ భూ కంప బాధితుల కోసం లక్ష ఇండ్లను ఒక్క ఏడాదిలో నిర్మించి తన పనితనాన్ని నిరూపించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. పండ్ల రైతులను ప్రోత్సహించేందుకు పనికి ఆహర పథకాన్ని వారికి వర్తింప చేసారు. వ్యవసాయానికి గ్రామీణ ఉపాది హమీ పథకాన్ని అనుసంధానం చేయడం అసాధ్యం అంటున్న కేంద్రం..శరద్ పవార్ అనుభవనాలను అద్యయనం చేస్తే సరిపోతుంది. సహకార సంఘాల్లో రాజకీయ పెత్తనాన్ని కట్టడి చేసేందుకు 10 సంవత్సరాలకు మంచి ఏవరూ పాలక మండల్లో ఉండకుండా చట్టం చేసారు. అటు కేంద్ర మంత్రిగా ఎన్నో పనులు చేసారు. ప్రధాని పదవి కోసం పీవితో పోటి పడి ఓటమి చెందినా నిరుత్సాహపడకుండా..దేశ హితం కోసం పీవీ మంత్రి వర్గంలో రక్షణ శాఖ మంత్రిగా..సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించారు. తద్వారా ఆదా అయిన సొమ్మును పేదరికం, నిరుద్యోగిత నిర్మూలన కోసం వెచ్చించ వచ్చని చైనా అధ్యక్షుడిని ఒప్పించి..వాస్తవాధీన రేఖ వెంట పాక్షికంగానే అయినా శాంతిని నెలకొల్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా.. పంటలకు బోనస్ అందించే విధానాన్ని తీసుకొచ్చి అన్నదాతకు కాస్తైనా ఊరట కల్పించారు. ఒక్క సారి రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత తన కాంగ్రెస్ సిద్దాంతాల కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు పవార్. తన రాజకీయ గురువు Y.B చవాన్ మొదలుకుని, ఐరన్ లేడీ ఇందిరా గాంధి, డైనమిక్ పీఎం రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిన ప్రతిసారి తిరుగుబాటు జెండా ఎగుర వేసారు. ఆత్మగౌరవ పతాకగా నిలిచారు. మహరాష్ట మంత్రిగా యూపీ పర్యటనలో యూపీ సీఎం కాల్లు మొక్కేందుకు నిరాకరించారు. యూపీ సీఎం నొచ్చుకున్నా, మహరాష్ట్ర విజ్నప్తులను మన్నించకున్నా..పవార్ మాత్రం తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేదు. ఆకలిని భరిస్తాం తప్ప ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనని తెగేసి చెప్పారు. ఆ ఆత్మగౌరవం కోసమే బద్ద విరోధి అయిన శివ సేనతో జట్టకట్టాడు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న శరద్ పవార్..ఎప్పుడు రొడ్డు ప్రయాణానికే ప్రధాన్యత నిస్తారు. ఆయా మార్గంలో వస్తున్న మార్పులు, జరుగుతున్న అభివ్రుద్ది, ప్రజల ఆకాంక్షలు వంటి విషయాలను తెలుసుకునేందుకు ఇష్టపడతారు. ప్రజలతో ఉంటేనే వారి సాధక భాధకాలు తెలుస్తాయన్న బలమైన విశ్వాసం అయనది. ఎప్పుడు లండన్ వెల్లినా అక్కడి పార్లమెంటు సమావేశాలను పవార్ తప్పకుండా హజరు అవుతారు. గ్యాలరి లో కూర్చిని వారి అర్ధవంతమైన చర్చను ఆస్వాదిస్తూ..అక్కడి లైబ్రరిలో సమయాన్ని వెచ్చిస్తూ ప్రపంచంలో వస్తున్న మార్పులు, మారుతున్న ప్రజల ఆకాంక్షలను ఆధ్యయనం చేసే అలవాటును అలవర్చుకున్నారు. దీన్ని బట్టె అర్ధం అవుతుంది ఆయనెంత నిత్య అధ్యయన శీలి అని. భవిష్యత్తు తరాలకు ప్రాంతం, మతం, కులం వంటి కుంచిత భావాలు కాకుండా ఓవరాల్ అవుట్ లుక్ ఉండాలని, డెవలప్ మెంట్ ఓరియేంటేషన్ ఉండాలని బలంగా నమ్మె శరద్ పవార్..పార్టీ యువ నాయకులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడమే కాకుండా పోటెన్షియల్ లీడర్లను ప్రపంచ సంస్థలకు అనుసంధానించడం ద్వారా భవిష్యత్తు భారతావని అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే సామర్ద్యం అవలడుతుందంటాడు. అప్పుడే ఒత్తిడులకు లొంగకుండా మోరల్ కన్విక్షన్ కు అనుగుణంగా విధనాలు రూపకల్పన జరుగుతుందంటాడు. అందుకే ఎన్ని అవంతరాలు ఎదురైనా తాను అనుకున్నది చేయగలిగానంటాడు. సాధరణంగా ఆత్మకథలో ఆత్మస్థుతి, పరనిందలుంటాయి. కానీ పవార్ ఆత్మకథలో మాత్రం తనపై వచ్చిన అన్ని విమర్శలు, వాటి వెనకగల కారణాలను వివరించారు. ఆ విమర్శల్లో ఎంత మేర వాస్తవముందో నిర్ధారించుకునే అవకాశాలన్ని పాఠకులను వదిలేసారు. పవార్ విల్ పవర్ చాలా గొప్పది. 2004 లో వచ్చిన క్యాన్సర్ ను సైతం ఆయన జయించారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు..సర్ ఇంకా మీరు 6 నెలలే బతుకగలరు అని చెబితే….డాక్టర్ల వాదన తప్పని సవాల్ విసిరి నిరూపించారు. మానసిన స్థైర్యం, మనో నిబ్బరమే మనిషి అయుష్షుకు రక్షణ కవచం అని..అందుకే విపత్కర పరిస్థుతులను ధైర్యంగా ఎదుర్కొనే లక్షణాన్ని అలవర్చకున్నారు. అందుకే నేను “సూపర్ సన్ ఆఫ్ సూపర్ మామ్” అని..అంత సులభంగా పోను అంటూ చమత్కరాలు విసురుతుంటారు. శరద్ పవార్ తల్లి దేశ స్వాతంత్ర్యానికి పూర్వం పూణే స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధిగా ఎన్నికవుతారు. శరద్ పవార్ పుట్టిన మూడో రోజే చంటి బిడ్డతో పాటు నాలుగు గంటలు బస్సు ప్రయాణం చేసి అత్యవసర సర్వసభ్య సమావేశానికి హజరవుతారు. అప్పుడు సభకు చైర్మన్ గా ఉన్న పెద్ద మనిషి లేచి నిలబడి పవార్ తల్లికి వందం చేసి…He is super son of super mom అని, మూడు రోజుల వయసుల్లోనే ప్రజా జీవితాన్ని ప్రారంభించాడని అభినందిస్తాడు. తల్లి రాజకీయాల ఆదర్శంగా..యావత్ కుటుంభం సోషలిస్టులుగా ఉంటే వారిని కాదని కాంగ్రెస్ లో చేరి రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టి 53 ఏండ్లుగా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న శరద్ పవార్ జీవితం నిజంగా స్పూర్తి దాయకం. తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరిని తన ఆత్మకథ ద్వారా భాహ్య ప్రపంచానికి పరిచయం చేసారు. తనకు 40 సంవత్సరాలుగా డ్రైవర్ గా పనిచేస్తున్న “గామా” కు సైతం పుస్తకంలో ఒక పేజీ కేటాయించడం నిజంగా అబ్బుర పరిచే అంశం. ఆయన ఆత్మకథ కేవలం ఆయనకు సంభంధించిందే కాదు..తొలి ప్రధాని నెహ్రూ అనంతర కాంగ్రెస్ రాజకీయాలకు, భారత ప్రభుత్వంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. రాజకీయాలు, కళలు, సాహిత్యం, నాటకం, క్రీడలు..ఇలా ఎన్నో రంగాల్లో తన పట్టును నిలుపుకున్న శరద్ పవార్ వ్యక్తిత్వం ఏకత్వంలో భిన్నత్వమే. రాజకీయ ప్రత్యర్ధులను..బద్ద శత్రువులుగా పరిగణించే కాలంలో.. రాజకీయ వైరుద్యాలు, ఎన్నికల ప్రత్యర్ధులతో వ్యక్తిగత మిత్రుత్వం కొనసాగించిన శరద్ పవార్ ది నిజంగా భిన్నమైన మనస్తత్వమే.

సచివాల ఉద్యోగాల భర్తీ

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి నిర్వహించే పరీక్షల ప్రక్రియ పకడ్భందీగా జరిగేలా జిల్లా కలెక్టర్లు బాధ్యత వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారి సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలు అత్యంత పారదర్శకంగా జరిగాయని అన్నారు.

అదే విధంగా రెండో విడత నిర్వహిస్తున్న పరీక్షలు సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. గతానికి, ప్రస్తుతానికి మద్య తేడా వుందని, కోవిడ్ కారణంగా అభ్యర్ధుల ఆరోగ్య భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాల్సి వుందని అన్నారు. పరీక్షలు రాసే అభ్యర్ధుల మధ్య భౌతికదూరం తప్పనిసరిగా వుండాలని అన్నారు. ఈసారి మొత్తం 16,208 ఖాళీలకు గానూ 10,63,168 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారని, వారికి మొత్తం వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ వుంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు పరీక్షల కోసం జిల్లా జాయింట్ కలెక్టర్లను, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. అలాగే పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు.

కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలకు హాజరైన అభ్యర్ధుల్లో కోవిడ్ పాజిటీవ్, కోవిడ్ అనుమానిత లక్షణాలు వున్నట్లయితే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అలాగే ఈ పరీక్షల నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బందిలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు వున్నట్లు గుర్తిస్తే వెంటనే వారి స్థానంలో వేరే వారికి బాధ్యతలు అప్పగించేలా ముందుగానే ప్రణాళికను సిద్దం చేసుకోవాలని సూచించారు.  సిబ్బందితో పాటు పరీక్షలకు హాజర్యే అభ్యర్ధులకు కూడా కోవిడ్ జాగ్రత్తలపై ముందుగానే అవగాహన కల్పించాలని అన్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాలకు అందుబాటులో అత్యవసర మెడికల్ బృందాలను సిద్దం చేసుకోవాలని కోరారు. అన్ని పరీక్షా కేంద్రాలను ముందుగానే డిసిన్ఫెక్షన్ స్పేతో శుభ్రం చేయాలని అన్నారు. ప్రతి అభ్యర్ధి ఖచ్చితంగా మాస్క్ ధరించాలని, పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్లను, ధర్మల్ స్కానింగ్‌ను కూడా అందుబాటులో వుంచాలని అన్నారు. 

పరీక్షా కేంద్రాల కోసం క్లస్టర్‌లను గుర్తించాలి  
ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు క్లస్టర్‌లను గురించి, వాటిలోనే మొత్తం పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికను సిద్దం చేసుకోవాలని కోరారు. ప్రధానంగా జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యమైన అర్బన్‌ ప్రాంతాల్లో ఈ పరీక్షా కేంద్రాలు వుండేలా చూసుకోవాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు ఆయా పరీక్షా కేంద్రాలకు ఇన్‌చార్జిగా వ్యవహరించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. దివ్యాంగులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే పరీక్ష రాసేలా జాగ్రత్త తీసుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించడం, పరీక్ష అనంతరం స్కానింగ్ కేంద్రాలకు జవాబు పత్రాలను సకాలంలో తరలించడంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో నిర్వహించిన మాదిరిగానే ఈసారి కూడా పరీక్షా కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్ కొనసాగించాలని సూచించారు. అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేందుకు అవసరమైన రవాణా సదుపాయం కూడా వుండేలా జిల్లా కలెక్టర్లు జాగ్రత్త తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆర్టీసి సైతం పూర్తిస్థాయి సర్వీసులు నిర్వహించలేకపోతోందని, దీనిని పరిగణలోకి తీసుకుని స్థానికంగా వున్న ఆర్టీసి రీజనల్ మేనేజర్లతో సంప్రదించి రవాణా సదుపాయం వుండేలా జాగ్రత్త తీసుకోవాలని కోరారు.

వైసీపీ పాలన కంటే, బ్రిటీష్ వారి పాలనే నయం

రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే బ్రిటీషువారిపాలనే నయమనిపిస్తోం దని, ఆనాడు వారు మాతృభాషకు మంగళం పాడి, ఇంగ్లీషుని ప్రజలపై రుద్దారని, 74ఏళ్ల తరువాత ఏపీలో ఇప్పుడు అదే చూస్తున్నామని టీడీపీఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, నాటి బ్రిటీషువారి పాలనకు, నేడు జగన్ పాలనకు అనేక సారూప్యతలు ఉన్నాయన్నారు. బుధవారం ఆయన తన నివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆనాడు ఆంగ్లేయులు భారతీయులను కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి పాలిస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థంకోసం ప్రజలమధ్య అలానే చిచ్చు రేపుతున్నాడన్నారు. ఈస్టిండియా కంపెనీవారు వ్యాపారం కోసం దేశాన్ని పాలిస్తే, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాండ్, ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియాలను యథేచ్ఛగా సాగిస్తోందన్నారు. ఆనాడు పోలీస్ వారు భారతీయులపై లాఠీలు ఝళిపిస్తే, ఈనాడు ఏపీలోని పోలీసులు రాష్ట్ర ప్రజలను శిక్షిస్తూ, వైసీపీవారికి వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుల్లా పనిచేస్తున్నారని దీపక్ రెడ్డి మండిపడ్డారు. ఆనాడు ప్రజలు ఎవరైనా మాట్లాడితే, వారిపై దాడిచేసేవారని, నేడున్న వైసీపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రశ్నించేవారిపై, మీడియాపై దాడులకు తెగబడుతోందన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలను ఎదిరించి నిలిచే నాయకులపై కేసులు పెట్టే సంస్కృతిని తెల్లవాళ్లు ప్రారంభిస్తే, నేడు వైసీపీవారు దాన్ని కొనసాగిస్తూ, టీడీపీనేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని దీపక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిటీషు పాలనలో కలెక్టర్లు డబ్బులు పోగుచేయడానికే పరిమితమయ్యేవారని, నేడు రాష్ట్రంలోని కలెక్టర్లు కూడా ప్రభుత్వానికి అదేపని చేస్తూ, ప్రజలకష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. సాంకేతికత పెరిగినా, ప్రజలకు సకాలంలో రక్షణ, వైద్యసేవలు అందించలేని ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దళితమహిళను అత్యంత కిరాకతంగా పదిమంది మూడురోజులపాటు అత్యాచారం జరిపి, పోలీస్ స్టేషన్ వద్ద పడేసి వెళ్లిన సంఘటన, బ్రిటీషుపాలనలో కూడా జరిగి ఉండదన్నారు. దళితయువకుడికి శిరోముండనం చేసినఘటన దారుణమని, తనకు జరిగిన అవమానంపై సదరు యువకుడు రాష్ట్రపతికి లేఖరాస్తే, మంత్రులు అతన్నిఅవహేళన చేయడం సిగ్గుచేటని దీపక్ రెడ్డి ఆగ్రహించారు. స్థానికఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి వెళ్లిన మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన అధికారపార్టీ వారు, వారిదుస్తుల్లో చేతులుపెట్టి, ఎంతఅసభ్యంగా ప్రవర్తించారో అందరం చూశామన్నా రు. ఇదేనా రాష్ట్ర ప్రజలకు వచ్చిన స్వాతంత్ర్యం అని దీపక్ రెడ్డి నిలదీశారు. దళిత యువకుడు తనకు జరిగిన అవమానంపై రాష్ట్రపతికి లేఖరాస్తే, రాష్ట్ర మంత్రులు అతని గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజలకు పప్పుబెల్లాల్లా చిల్లర పంచుతున్నామని, మేం ఏమిచేసినా వారు పడుండాలంటూ అధికార పార్టీవారు అహంకారంతో వ్యవహరిస్తున్నారని దీపక్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకోసం వైసీపీ ప్రభుత్వం ఒక్క రోజుకూడా ఎందుకని అఖిలపక్ష సమావేశం నిర్వహించలేద న్నారు. మండలిలో ఛైర్మన్ ను దూషించి, ప్రతిపక్ష సభ్యులపై దాడిచేయడం ఈ రాష్ట్రంలోనే జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చేముందు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా నని చెప్పారని, ప్రజావేదిక కూల్చడం అలా పనిచేయడమా అని టీడీపీనేత నిగ్గదీశారు. నేను ఉన్నాను..నేను విన్నాను అన్నవ్యక్తి తన ప్రభుత్వ పాలసీ వల్ల ఇసుకకొరతతో పనిలేకుండా రోడ్డున పడిన భవననిర్మాణ కార్మికుల గోడు వినలేదా అన్నారు. మాటతప్పను, మడమతిప్పను అన్నాయన, అమరావతి విషయంలో ఏంచేశాడో చెప్పాలన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడిన వైసీపీవారిపై ఏం చర్యలు తీసుకుందని ఎమ్మెల్సీ ప్రశ్నించారు.
జే.సీ.దివాకర్ రెడ్డిపై 54 తప్పుడు కేసులు పెట్టినప్రభుత్వం, చివరకు ఆయన్ని కరోనాకు గురిచేసిందన్నారు. బెయిల్ పై ఆయన బయటకు రాగానే వారి అనుచరులపై, వాహనాలపై పోలీసులే దాడిచేసి, ఆయన్ని ఎలాగైనా రెచ్చగొట్టాలని చూశారన్నారు. చివరకు మరో తప్పుడు కేసుతో ఆయన్ని అరెస్ట్ చేసి, పోలీస్ కస్టడీకి తీసుకెళ్లి, కరోనా వచ్చేలా చేశారన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న జే.సీ.ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడానికి పోలీసులే కారణమని, డీజీపీ దీనిపై ఏం సమాధానం చెబుతారన్నారు. అనంతపురం, తాడిపత్రి డీఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులపై హత్యాయత్నం కేసులు పెట్టాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము న్యాయపరంగా చర్యలు తీసుకోకముందే, ప్రభాకర్ రెడ్డికి కరోనా వచ్చేలా చేసిన పోలీసులపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధంగా శాడిజం చూపితే ప్రజలు హర్షించరనే విషయాన్ని పాలకులు తెలుసుకోవాలని, వైసీపీకి 50శాతం ఓట్లు వస్తే, టీడీపీకి 40శాతం వచ్చాయని, 100కి 100శాతం ఓట్లు వచ్చినట్లు ప్రవర్తించడం మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిపైనే ఉందని, బీజేపీప్రభుత్వం కూడా రాష్ట్రంలో జరిగే పరిణామాలపై స్పందించాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలను పాలించే హక్కు మాత్రమే పాలకులకు ఉంటుందని, తెలుగుదేశం పార్టీ భయపెడితే భయపడదని, ఎందుకంటే అది దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతిలో నుంచి పుట్టిన పార్టీ కాదనే విషయాన్ని వైసీపీవారు తెలుసుకుంటే మంచిదని టీడీపీఎమ్మెల్సీ హితవు పలికారు.

ఓరుగల్లు ఎందుకు మునిగింది?

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం ఏమైనా ఉందంటే అది వరంగల్ మాత్రమే. హైదరాబాద్ మాదిరే వరంగల్ సైతం జంట నగరాలే. వరంగల్.. హన్మకొండ పేరుతో చెట్టాపట్టాలేసుకున్న ఈ నగరం.. తాజాగా కురిసిన భారీ వర్షాలకు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. నగరం మొత్తం జలమయం కావటమే కాదు.. వేలాది మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చరిత్రలో ఇంతకు ముందెప్పుడు ఎదురుకాని పరిస్థితి తాజా వర్షాల కారణంగా చోటు చేసుకుంది? మరి.. దీనికి కారణం భారీ వర్షాలు మాత్రమేనా? మరే కారణం లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే.. అసలు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి.

వరంగల్ లో నెలకొన్న దారుణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియనివి కావు. ఎందుకంటే.. దాదాపు ఐదేళ్లకు ముందు అంటే.. 2015 జనవరి పదకొండున వరంగల్ కు వచ్చిన ఆయన.. అక్కడి బస్తీ వాసులను ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేశారు. కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే.. ‘‘వానొస్తే నడుములబట్టి నీళ్ళొచ్చి, గిన్నెలు నెత్తినబెట్టుకుని.. గడ్డకు పోయి, వండుకుని తిని.. నీళ్ళు గుంజినంక ఇంటికస్తున్నరు. వరంగల్‌లో 80 కాలనీల్లో ఇదే పరిస్థితి. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత ఇదే పెద్ద నగరం. మరి ఇట్లుంటే ఎట్లా..? వరంగల్‌ అంటే అద్దం లెక్కనుండాలే. మీరంతా సహకరిస్తే.. రెండుమూడేళ్లలో ఈ పరిస్థితిని మార్చేస్తా’’ అని పేర్కొన్నారు.

ఈ మాటల్ని చూసినప్పుడు అర్థమయ్యేదేమంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరంగల్ సమస్య గురించి అవగాహన ఉండేదనేగా?మరి.. గడిచిన ఐదేళ్లుగా ఆయనేం చేయలేదు ఎందుకు? అన్నది ప్రశ్న. ఇదిలా ఉంటే.. భారీగా కురిసిన వర్షాలతో వరంగల్ లోని చాలా ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లల్లోకి చేరటమే కాదు.. ప్రజలు మిద్దెలకెక్కి సాయం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. దీనంతటికి కారణం చెప్పాల్సి వస్తే చరిత్రలోకి కాస్త తొంగి చూడాలి. వరంగల్ నగర పరిధిలోని రెవెన్యూ రికార్డుల ప్రకారం 248 చెరువులు ఉండాలి. వాటిల్లో ఇప్పుడు 55 చెరువులు మాయం అయ్యాయి. అధికారికంగా చెప్పే లెక్క ఇలా ఉంటే.. అనధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువని చెబుతున్నారు.

చెరువు ప్రాంతాల్ని కబ్జా చేసిన రాజకీయ నేతలు.. ఆ ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ల నిర్మాణాన్ని చేపట్టటం.. వాటికి అధికారులు పర్మిషన్లు ఇవ్వటం లాంటి వాటితో.. అక్రమనిర్మాణాలు భారీగా పెరిగాయి. నగరం కాంక్రీట్ జంగిల్ లా మారి.. అక్రమ నిర్మాణాలు.. నీరు తనంతట తాను వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. దీంతో.. తాజా దుస్థితి నెలకొంది.

అంతేకాదు.. వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ లెక్క ఇంకా తేల్లేదు. ఒకప్పుడు వరంగల్ లో విశాలంగా ఉన్న నాలాలు కబ్జాల కారణంగా పిల్ల కాలువల్ని తలపిస్తున్నాయి. హన్మకొండలోని నయిం నగర్ ప్రాంతంలోని రెండు బడా విద్యా సంస్థలు నాలాల్ని ఆక్రమించి భారీ భవనాల్ని నిర్మించాయని అధికారులే చెబుతున్నారు. మరి.. చర్యలు తీసుకోవచ్చుగా? అని ప్రశ్నిస్తే సమాధానం రాని పరిస్థితి. పాలకుల హామీలు అమల్లోకి రాకపోవటం.. ఇష్టం వచ్చినట్లుగా సాగుతున్న అక్రమనిర్మాణాల్ని అడ్డుకోవటంలో ప్రభుత్వం విఫలం కావటం ఈ రోజు ఇలాంటి పరిస్థితి కారణంగా చెప్పక తప్పదు.

నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు

నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర
వైయస్సార్‌ ఆసరాకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం
ఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వం
నాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల చేతికివ్వనున్న ప్రభుత్వం
2020–21 సంవత్సరానికి రూ.6792.21 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం
దాదాపు 90 లక్షల మంది లబ్ధిదారులు

సెప్టెంబరు 5 న జగనన్న విద్యా కానుక ప్రారంభానికి కేబినెట్‌ ఆమోదం
దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి
మూడు జతల యూనిఫారమ్, నోటుబుక్స్, టెక్ట్స్‌బుక్స్, ఒక జత షూ,
రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌ విద్యా కానుక కింద పంపిణీ
విద్యా కానుక కోసం రూ.648.09 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

సెప్టెంబరు 1న వై.యస్‌.ఆర్‌. సంపూర్ణ పోషణ్‌ ప్లస్, సంపూర్ణ పోషణ్‌ ప్రారంభం
77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ ప్లస్, మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ అమలు
గర్భవతులకు, బాలింతలకు, 6 నుంచి 36 నెలల వరకు, అలాగే 36 నుంచి 72 నెలల పిల్లలకు పౌష్టికాహారం
ఈ కార్యక్రమాలకు ఏడాదికి రూ.1863 కోట్లు
30 లక్షల మందికి లబ్ధి
గతంలో కేవలం రక్తహీనతతో ఉన్న గర్భవతులకు, బాలింతలకు మాత్రమే ఆహారం అందించగా… ఇప్పుడు అందరు బాలింతలకు, గర్భవతులకు వర్తింపు
గత ప్రభుత్వ కాలంలో రూ.762 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. ఈ ప్రభుత్వ కాలంలో మూడు రెట్లు పెంచి దాదాపు రూ.1863 కోట్లు కేటాయించి అమలు చేస్తున్నారు

డిసెంబరు 1నుంచి లబ్దిదార్ల గడపవద్దకే తినగలిగే నాణ్యమైన బియ్యం అందించడానికి చర్యలు
9260 వాహనాలు కొనుగోలు కోసం రుణాలు తీసుకునేందుకు సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీ
సార్టెక్స్‌ చేసిన నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదార్ల ఇంటి వద్దకే చేర్చేందుకు ఈ వాహనాలు వినియోగం
60శాతం సబ్సిడీ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను అందిస్తారు
వాహనాల కోసం లబ్ధిదార్లు 10 శాతం చెలిస్తే చాలు
30 శాతం బ్యాంకు రుణం కాగా 60 శాతం సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం
నిరుద్యోగులైన యువకులకు ఆరేళ్ల పాటు ఈ కాంట్రాక్టు ఇవ్వనున్న ప్రభుత్వం
ప్రతినెలా రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి మార్గం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం
దీని కోసం రూ.550 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
సార్టెక్స్‌ చేయడం వల్ల గతంలో 25 శాతం ఉన్న నూకలు 15 శాతానికి తగ్గనుంది
రంగు మారిన బియ్యం 6 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గనుంది
ఇందుకు గాను ప్రతికిలోకు అదనంగా రూ.1.10 వ్యయం
30 పైసలు డిస్ట్రిబ్యూషన్‌ కోసం ఖర్చు
పర్యావరణ హితంగా ఉండే 10 కేజీలు, 15 కేజీలు రీయూజబుల్‌ బ్యాగులు లబ్దిదార్లకు ఇవ్వనున్న ప్రభుత్వం
మొత్తం సార్టెక్స్‌ చేయడానికి రూ.480 కోట్లు వ్యయం
డోర్‌ డెలివరీకి రూ.296 కోట్లు వ్యయం చేయనున్న ప్రభుత్వం
అదనంగా 776 కోట్లు ఖర్చు

వై.ఎస్‌.ఆర్‌.బీమా కింద సామాజిక భద్రతా పథకం
సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు
శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు
శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు, 51–70 ఏళ్ల మధ్య వర్తింపు
బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే వర్తించనున్న వై.యస్‌.ఆర్‌. బీమా
రాష్ట్రంలో సుమారు 1కోటి 50 లక్షల బియ్యంకార్డు కుటుంబాలు

ఎల్‌ ఐ సి, కేంద్ర ప్రభుత్వం గత పథకాన్ని ఉపసంహరించిన నేపధ్యంలో ఈ కొత్త పథకాన్ని సొంత ఖర్చుతో తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఏడాదికి రూ.583.5 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్‌ పోస్టులు, 14 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం
వై.ఎస్‌.ఆర్‌ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్‌ పోస్టులు, 8 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం

విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో అదనంగా 2 యూనిట్లు
115 మెగావాట్లు చొప్పున 2 యూనిట్లు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
దాదాపు రూ.510 కోట్లు వ్యయంతో ఏర్పాటుకు ఆమోదం

వై.ఎస్‌.ఆర్‌ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
పులివెందుల సబ్‌డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త సబ్‌డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం
రాయచోటిలో కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకూ ఆమోదం,
వై.యస్‌.ఆర్‌ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం

నూతన పారిశ్రామిక విధానం 2020–23 కేబినెట్‌ ఆమోదం

రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
2000 ఎకరాల్లో ఏర్పాటు కానున్న బల్క్‌ డ్రగ్‌ పార్క్‌
బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా
దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా
భారీగా ఉపాధి అవకాశాలు
ఏపీఐఐసీ కి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీబీడీఐసీ) ఏర్పాటు

వై.ఎస్‌.ఆర్‌ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించిన మంత్రిమండలి
రూ.10వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, 1 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని అంచనా
క్లస్టర్ల మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.730 కోట్లు ఖర్చు
ఎలక్ట్రానిక్‌ రంగంలో కీలక పరిశ్రమలు ఆకట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు

భావనపాడు పోర్టు కోసం రైట్స్‌ కంపెనీ డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం
ఫేజ్‌ –1 కే దాదాపు రూ. 3669.95 కోట్లు ఖర్చు
శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చనున్న పోర్టు
ఉత్తరాంధ్రలో మరో కీలక ప్రాజెక్టు
తొలి దశలో భాగంగా 2024–25 నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హేండిలింగ్‌ చేయాలన్న లక్ష్యం
2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హేండలింగ్‌ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ సీడ్‌( క్వాలిటీ కంట్రోల్‌ ) యాక్టు– 2006 సవరణలపై ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం

రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తాజా పరిస్ధితులుపై మంత్రిమండలిలో చర్చ
ఈ యేడు 26 శాతం అధికంగా వర్షపాతం నమోదు
101 శాతానికి చేరిన సాగు విస్తీర్ణం

జీవిత సహచరి మనసు ఘోష

వైయస్ సతీమణి రాసిన నాలో..నాతో YSR పుస్తకం భిన్నంగా ఉంది. అందులో పొందుపరిచిన విషయాలు పాతవే అయినా…జీవిత సహచరి కోణంలో ఆ విషయాలు బయటకు రావడం వింత అనుభవమే. రాజకీయ నేతల వల్ల అధికంగా నష్టపోయేది వారి కుటుంభ సభ్యులే. ఆర్దికంగా, సామాజికంగా కుటుంబాలకు భద్రత మిగిలినా..కుటుంబం, అనురాగం, అప్యాయత, సమయం వెచ్చించడాలు అనేవి రాజకీయ కుటుంభాల్లో అతి తక్కువగా ఉంటాయి. అయినప్పటికి YSR తన తో గడిపిన కాలం, మిగిల్చిన అనుభవాలు, ఆయన వ్యక్తిత్వం, ఆదర్శాలు, బంధువులతో ఆయన మెలిగిన తీరు, రాజకీయాలు విజయమ్మ ద్వారా తెలుసుకోవడం చాలా ఎమోషనల్ గా ఉంది. పేరుకు పుస్తకమే అయినా అది చదువుతున్నంత సేపు ఆమే నోటి నుంచి YSR ను గూర్చిన విషయాలు మనం వింటున్నట్లుగానే ఉంటుంది. సాదరణంగా రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాలు బయటి ప్రపంచానికి తెలియవు. అలాంటిది ఈ పుస్తకంలో షర్మిలా మొదటి బలవంతపు పెళ్లి వంటి విషయాలను బహిరంగ పరచడం నిజంగా సాహసమే. షర్మిలా పెల్లి సస్సెక్ గాక మూడు నాలుగు సంవత్సరాలు YSR దంపతులు పడ్డ మానసిక వేదన చూస్తే….స్థాయి, సంఘంలో స్థానంతో నిమిత్తం లేకుండా పిల్లల పెల్లిల్ల విషయంలో మదన పడే ప్రతి తల్లి దండ్రి గుర్తుకు వస్తారు. కాని పిల్లల సుఖ సంతోషాల కోసం..వారి ఇష్టా ఇష్టాలను గౌరవించడం పై స్థాయిలో ఉన్నవారికే సులువవుతుందేమో. సమాజంలో ఎదుగుతున్న, గుర్తింపు పొందే దశలో ఉన్న కుటుంభాలు, పరువు, మర్యాద అనే బ్రమలో బతికే మద్యతరగతి జీవితాల్లో అది కష్టసాధ్యం. అందుకే ‘పరువు హత్యల’ వార్తలు ఎక్కడో ఓ చోట చూస్తేనే ఉంటాం. అలా కాకుండా అనిల్ తో షర్మిల రెండో వివాహాన్ని చాలా కాజువల్ గా YSR తీసుకోవడం మాత్రం నిజంగా ఆదర్శ ప్రాయం. అన్న అంటే ఎదిగిన అమ్మాయి తీసుకున్న నిర్ణయాలను గౌరవించడమే తప్ప తన నిర్ణయాలను రుద్దడమో లేక తన గౌరవానికి భంగం కల్గిస్తుందని అజామాయిషి చేయడం కాదని వైయస్ జగన్ వ్యవహరించిన తీరు ఆయన మెచ్యురిటికి అద్దం పడుతోంది. ఇక వైయస్ మరణ సమయంలో..సతీమణి పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. చివరి నిమిషాల్లో ఆయన ఏలా ఫిలయ్యారు? భయపడ్డారా? కుటుంభం గుర్తుకు వచ్చి ఉంటుందా? ఏమన్న ఆందోళన చెంది ఉంటారా, మరణం తెలిసే జరిగి ఉంటుందా? లేక ఊహించకుండానే ఆయన మరణంలోకి జారుకున్నారా? అని తెలుసుకోవాలనే విజయమ్మ తపన గుండెను బరువెక్కిస్తోంది. ఈ భాధ విజయమ్మ ఒక్కరిదే కాదు. ప్రతి సాధరణ గ్రుహిణి భాధ ఇంచుమించు ఇదే రకంగా ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు, భాధలు పడినా చివరి క్షణాల్లో …హయిగా పోవాలని, ఆ సమయంలో తోడుగా ఉండాలని అంతా కోరుకుంటారు. ఏలాంటి పరిస్తితుల్లో మరణం సంభవించిందో తెలియని పరిస్తితుల్లో, చివరి చూపునకు నోచుకోని నిస్సాహయ స్థితిలో..భర్త చివరి క్షణాలు ఏలా ఉన్నాయో అని తెలుసుకోవాలనే విజయమ్మ తాపత్రయం చూస్తే నాకు సోనియా గాంధి గుర్తుకు వచ్చింది. మరణించే ముందు తన భర్త ఏలా ఉన్నాడు, ఏదన్న టెన్షన్ పడ్డాడా? మరణిస్తానని ఊహించాడా, నీతో చివరగా ఏం మాట్లాడాడు వంటి ప్రశ్నలతో..పెరంబదూర్ పేళుల్ల ముందు వరకు రాజీవ్ గాంధి ని ఇంటర్వు చేసిన నీనా గోపాల్ అనే ఫారన్ జర్నలిస్టును సోనియా అర్దించడం గుర్తుకు వచ్చింది. రాజీవ్ చివర్లో ఏం చెప్పాడో చెప్పు చెప్పు అని నీనా గోపాల్ ( from Neena Gopal’s book on the assassination of Rajiv Gandhi) చేతులు పట్టుకుని మరి మరీ ఆడగటం చూస్తే రాజకీయ పదవులు, ఉన్న స్థానాలు, కుటుంభ గౌరవం, తమ గొప్పతనం వంటి అంశాలను దాటుకుని బయటకు వచ్చే మనసు ఘోషకు మించిన నిస్సాయత లేదు. అదే నిస్సాహయత, నిర్వేదం విజయమ్మ వ్యక్తీకరణలో వ్యక్తమవుతోంది. అయితే పుస్తకంలో కొన్ని పొరపాట్లు దొర్లాయి. 1982 లో వైయస్సార్ విద్యా శాఖ మంత్రిగా బడి పిల్లలకు మద్యహ్న పథకం తెచ్చారని..అది దేశంలోనే మొదటిదని పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఈ పధకాన్ని 1960ల్లోనే తమిళ నాడు లో ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ పరిమితంగా ప్రారంభించగా…ఆ తర్వాత 1980 కి ముందు ఎమ్జీఆర్ రాష్ట వ్యాప్తం చేసారు. మిడ్ డే మీల్ అనే మంచి పథకానికి తమిళ నాడులో బీజం పడగా..దాన్ని వైయస్సార్ ఖాతాలో వేయడం సహేతుకం కాదనిపిస్తోంది. అదే సమయంలో రైతులకు ఇన్సురెన్సు పథకాన్ని వైయస్ అమలు చేసినట్లు చెప్పారు. పంటల భీమాతో సహ ఎన్నో ఆదర్శ పథకాలకు వైయస్ శ్రీకారం చుట్టిన ప్పటికీ..రైతు ఇన్సురెన్సు మాత్రం వైయస్ ప్రవేశ పెట్టినట్లు నేను గమనించ లేదు. కేసీఆర్ రైతు భీమా తోనే దీనికి అంకూరార్పణ జరిగిందని భావిస్తున్నాను. ఈ రెండు విషయాల్లో నేను పొరబడి ఉంటే మిత్రులు సరిచేయగలరు. మొత్తానికి రాజశేఖర్ రెడ్డితో తన ప్రయాణం మొదలుకుని, కుటుంబ వ్యవహరాలు, పిల్లలతో YSR అనుబంధం మొదలుకుని సీఎంగా వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వరకు అన్ని అంశాలను క్రోడికరిస్తూ విజయమ్మ తెచ్చిన పుస్తకం..మనకు తెలిసిన చరిత్రను కొత్తగా మరో సారి ఆవిష్కరించినట్లుంది.

రాజధాని కేసు వాయిదా..!! విచారణ నుండి తప్పుకున్న జస్టిస్ నారీమన్..!

ఏపీ ప్రభుత్వం రాజధాని బిల్లులకు గవర్నర ఆమోదంతో చట్టాలుగా మారుస్తూ గజెట్ విడుదల చేసింది. దీని పైన రైతులు హైకోర్టులో ఈ చట్టాల అమలు నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ తొలుత ఈ నెల 14వ తేదీ వరకు ఆ చట్టాలు అమలు కాకుండా స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది.

దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలంటూ స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన రెండు రోజుల క్రితం విచారణకు సిద్దమైన సమయంలో చీఫ్ జస్టిస్ కుమార్తె అమరావతి రైతుల తరపున వాదిస్తున్న విషయం తెలియటంతో ఆయన నాట్ బిఫోర్ మీ అంటూ..ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని కోరుతూ కేసును వాయిదా వేసారు. ఇక, ఈ రోజు ఈ కేసు జస్టిస్ నారీమన్ వద్దకు వచ్చింది. అయితే, ప్రభుత్వ పిటీషన్ కు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి సైతం కోర్టును ఆశ్రయించారు.

అయితే, రైతుల తరపున న్యాయమూర్తి తండ్రి న్యాయవాదిగా వాదనలకు సిద్ద పడటంతో..జస్టిస్ నారీమన్ నాట్ బి ఫోర్ మీ అంటూ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు. దీంతో..ఈ కేసు మరో సారి వాయిదా పడింది. అయితే, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేయటంతో..ప్రస్తుతం ప్రభుత్వం సుప్రీంలో విచారణ పైన ఫోకస్ చేసింది.

డీజీపీ పై యనమల ఫైర్

ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే, డిజిపి, హోంమంత్రి భుజాలు తడుముకోవడం ఏమిటి..?
-ఏపిలో ఫోన్ ట్యాపింగ్ లలో, సుప్రీంకోర్టు పేర్కొన్న హేతుబద్ద కారణాలు ఉన్నాయా..?
-ఆర్టికల్ 19,21ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘనే, కేంద్ర చట్టాల ఉల్లంఘనే
-ఏపిలో ఫోన్ ట్యాపింగ్ పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను కాలరాయడమే
-ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే, ‘‘రూల్ ఆఫ్ లా’’ ను అతిక్రమించడమే
-ప్రధాని స్పందన దాకా డిజిపి, హోం మంత్రి ఎందుకని ఆగలేక పోయారు..?
-ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి, జ్యడిషియరీని బ్లాక్ మెయిల్ చేయడానికి బరితెగించారు
-వాదనలు వినిపించే న్యాయవాదుల ఫోన్ ట్యాపింగ్ కన్నా తీవ్ర నేరం మరొకటి లేదు.
-దేశ భద్రతకు భంగం వాటిల్లిందా ఇక్కడ ఏ అంశంలోనైనా..? ప్రజా భద్రతకు భంగం కలిగిందా ఇందులో ఎక్కడైనా..? మరి ఏ కారణంతో అడ్వకేట్లు, జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు..?
-ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు ఏమైనా లిఖితపూర్వక ఆదేశాలు అందజేశారా..?
-ఫోన్ ట్యాపింగ్ లో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి. ముద్దాయే సాక్ష్యాధారాలు ఇవ్వాలని అడగడం ఎక్కడైనా ఉందా..?
-ట్యాపింగ్ పై కేసు పెట్టాలని డిజిపి సలహా ఇవ్వడం మరో విడ్డూరం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే దోషిగా ఉన్నప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి..? డిజిపి, హోంమంత్రి స్పందన ఫోన్ ట్యాపింగ్ పై అనుమానాలను బలపరుస్తోంది
-వైసిపి ప్రభుత్వ దుశ్చర్యలపై మండిపడ్డ యనమల రామకృష్ణుడు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతంలో అనేక సందర్భాల్లో, అనేక రాష్ట్రాల్లో జరిగిందేమిటో చూశాం. హైకోర్టులు, సుప్రీంకోర్టు దీనిపై స్పష్టమైన మార్గదర్శకం చేశాయి.
1)ప్రజా భద్రతా ప్రయోజనాలు, 2) అత్యవసర పరిస్థితులు ఉత్పన్నం అయితే, దేశ సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతకు భంగం వాటిల్లిన సందర్భాల్లో మాత్రమే దీనికి ఆమోదం ఉంటుందని పియూసిఎల్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. మాస్ సర్వైలెన్స్ ప్రొహిబిటెడ్ అన్నారు.
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం, దీనిపై ఇంటర్ సెప్షన్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వుంటుంది. ఆర్డర్స్ ఇచ్చేముందు అందులో పైన పేర్కొన్న హేతుబద్ద కారణాలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖల కార్యదర్శులు చూడాలి. ఆ తర్వాతే సదరు ఆర్డర్ కాపీలను సర్వీస్ ప్రొవైడర్లకు అందజేయాలని స్పష్టంగా నిర్దేశించింది.
ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ లలో అలాంటి హేతుబద్ద కారణాలేమీ లేవు. హైకోర్టులు పేర్కొన్న మార్గదర్శకాలు గాని, సుప్రీంకోర్టు నిర్దేశించిన 2అంశాలుగాని ఇక్కడ వర్తించేవి కావు.
అటువంటప్పుడు ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్ లన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే, కేంద్ర చట్టాల ఉల్లంఘనలే. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ఉల్లంఘనలే.
హైకోర్టు మార్గదర్శకాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను ఇది పూర్తిగా ధిక్కరించడమే. (పియూసిఎల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో 1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ పేజి 568)
అత్యున్నత స్థాయిలో వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ లు చేయడం ‘‘రూల్ ఆఫ్ లా’’ కు ఇది వ్యతిరేకం.
నిజంగా ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితులే వస్తే, లిస్ట్ ఆఫ్ టెలిఫోన్ల జాబితా సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వాలి, డేటా కలెక్షన్ చేపట్టాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలి.
ప్రధాని నరేంద్రమోదికి మాజీ సిఎం చంద్రబాబు లేఖ రాస్తే, దానికి డిజిపి స్పందించడం నిజంగా భుజాలు తడుముకోవడంలాగానే ఉంది.
దళిత యువకుడు వర ప్రసాద్ శిరోముండనం కేసులో రాష్ట్రపతి ఏవిధంగా స్పందించారో, అదేవిధంగా ప్రధాని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పై స్పందిస్తారు. అప్పటిదాకా ఆగకుండా డిజిపి వెంటనే భుజాలు తడుముకుని, కొన్నిగంటల్లోనే మాజీ సీఎంకు లేఖ రాయడం, హోం మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం విచిత్రంగా ఉన్నాయి.
రాజకీయ పార్టీలను అణిచేయడానికి, ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి, జ్యుడిసియరీని బ్లాక్ మెయిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే బరితెగించారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్య విరుద్దం, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన, ప్రాథమిక హక్కులను కాలరాయడమే.
ఏపిలో ఫోన్ ట్యాపింగ్ గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. దానిపై తన బాధ్యతగా మాజీ సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. తర్వాత పరిణామాలపై ఎదురు చూడకుండా రాష్ట్ర హోం మంత్రి, డిజిపి స్పందించడాన్నిబట్టి అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కన్నా తీవ్ర నేరం మరొకటి లేదు. వివిధ అంశాలపై న్యాయస్థానాల్లో న్యాయవాదులు వాదనలు వినిపించేటప్పుడు, న్యాయవాదులు వాదనలను జడ్జిలు వినేటప్పుడు, అడ్వకేట్ల ఫోన్లను, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేయడం అనేది చాలా తీవ్రమైన అంశం.
ఇంతకన్నా ప్రమాదకరమైన పోకడ మరొకటి లేదు. దురుద్దేశ పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ దుర్మార్గాలను ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం.
దేశ భద్రతకు భంగం వాటిల్లిందా ఇక్కడ ఏ అంశంలోనైనా..? ప్రజా భద్రతకు భంగం కలిగిందా ఇందులో ఎక్కడైనా..? మరి ఏ కారణంతో అడ్వకేట్లు, జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు..?
ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు ఏమైనా లిఖితపూర్వక ఆదేశాలు అందజేశారా..? ఇచ్చివుంటే సదరు ఫోన్ నెంబర్ల లిస్ట్ బైట పెట్టాలి. వాళ్లిచ్చిన సమాచారం వెంటనే కేంద్రానికి పంపాలి.
ఫోన్ ట్యాపింగ్ చేసేది రాష్ట్రప్రభుత్వంలో వాళ్లే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి. ముద్దాయే సాక్ష్యాధారాలు తనకివ్వాలని అడగడం ఎక్కడైనా ఉందా..? ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా..?
ట్యాపింగ్ పై కేసు పెట్టాలని డిజిపి సలహా ఇవ్వడం మరో విడ్డూరం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే దోషిగా ఉన్నప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి..?
అందుకే కేంద్రానికి ఫిర్యాదు పంపడం జరిగింది. కేంద్రం స్పందన కోసం అందరం వేచి వుండాలి. అలా కాకుండా కేంద్రాన్ని కూడా ప్రభావితం చేసేలా డిజిపి, హోంమంత్రి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.
ఫోన్ ట్యాపింగ్ పై మీడియాలో కథనాలు రాకూడదని ఆంక్షలు పెట్టడానికి అదేమీ నిషేధిత అంశమేమీ కాదు. మీడియా ప్రతినిధులను సోర్సెస్ వెల్లడించాలని కోరడం జర్నలిజం మూలసూత్రాలకే వ్యతిరేకం అనేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో చట్టాలను అతిక్రమించి, న్యాయవ్యవస్థను అతిక్రమించి, రూల్ ఆఫ్ లాను అతిక్రమించి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని ఈ దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలి.
యనమల రామకృష్ణుడు
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత