ఏకత్వంలో భిన్నత్వం ..శరద్ పవార్ వ్యక్తిత్వం

2536

నాకు శరద్ పవార్ అంటే అంతగా నచ్చకపోయేవాడు. అయన ప్రొఫెషనల్ పొలిటీషన్ కావడం, తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ లబ్దితో కూడుకుని ఉండటం, పొత్తులు, ఎత్తుగడల రాజకీయ వ్యూహాలు నా వంటి సామాన్యులకు అర్దం కాకపోవడం, రాజకీయాలు చాలవన్నట్లు క్రికెట్ రంగాన్ని శాసించడం, కుటుంబ పాలన వంటి కారణాల వల్ల ఆయన గురించి పెద్దగా తెలుసుకోవాలని అనిపించ లేదు. కాని కాంగ్రెస్ సంప్రదాయ రాజకీయాలను బద్దలు కొట్టి..శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి తర్వాత శరద్ పవార్ కేవలం పవర్ కోసం ఆ పనిచేయలేదు. ఇంక ఏదో బలమైన కారణం ఉంటుందన్న భావన నాలో కలిగింది. ఎందుకంటే మహరాష్ట సీఎంగా నాలుగు పర్యాయాలు, కేంద్ర మంత్రిగా మూడు పర్యయాలు పనిచేసిన సీనియర్ మోస్ట్ పోలిటిషన్..రాజకీయ వైరుధ్యాలను కాదని శివసేనతో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది, ఆయన రాజకీయ వ్యూహమేంటీ, అసలు శరద్ పవార్ రాజకీయ ఎదుగుదుల, మహారాష్ట్రకు, దేశానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. దీంతో ఆయన అటోబయోగ్రఫి “On My Terms” చదివితే…ఆయన ఎంత ఇన డెప్త్ పొలిటిషనో అర్ధం అవుతోంది. 1967 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు గెలిచి అసెంబ్లీ మొదలు కుని రాజ్యసభ వరకు అన్ని పదవులను అనుభవించారు. 53 ఏల్ల సూదీర్ఘ రాజకీయంలో ఏనాడు ఓటమి చెందని పవార్..మహరాష్ట రాజకీయాలకు పర్యాయపదంగా మారారు. 80 సంవత్సరాల వయసులోనూ నిత్య విద్యార్ధిగా కొత్త విషయాలను, దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు, వస్తున్నమార్పులు, తెస్తున్న నూతన సంక్షేమ పథకాలను అద్యయనం చేసేందుకు ఆరాట పడతారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి సమయం వెచ్చించడం మొదలుకుని మంత్రిగా గత ప్రభుత్వాల అనుభవాలను, అభిప్రాయాలను తెలుసుకునేందుకు మంత్రుల నోట్ ఫైల్స్ ను క్షుణ్ణంగా అద్యయనం చేయడం ద్వారా..రాజకీయాలు, ఎన్నికలు, పరిపాలన రంగాల్లో బలంగా పాతుకు పోగలిగారు పవార్. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ప్రజల కేంద్రంగా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. మన దేశంలో కరువు పనులు అనే కాన్సెప్ట్ తెచ్చిందే శరద్ పవార్. 1960ల్లో మహరాష్టలో భీకరమైన కరువు వచ్చింది. ఐరాస లోని ప్రపంచ ఆహర సంస్థ మహరాష్టలో ప్రజల ఆకలిని తీర్చేందుకు ఉచితంగా తిండి గింజలు సరఫరా చేసేది. అయితే ఉచితం సముచితం కాదని..దేనికైనా సోషల్ వాల్యు ఉండటం ముఖ్యమని, కరువు నివారణ కోసం ప్రతి తిండి గింజ పెట్టుబడి కావాలని పనికి ఆహర పథకం తీసుకోచ్చే విధంగా ప్రపంచ ఆహర సంస్థ ను ఒప్పిస్తారు. అయితే అది కొత్త పథకం కావడం, ఏలా అమలు చేయాలో తెలియక పోవడం తో..శరద్ పవార్ కే భాద్యతలు అప్పజెప్పి ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన ఈ కరువు పనులు విజయవంతం కావడంతో..పనికి ఆహర పథకానికి మన దేశంలో బాటలు పడ్డాయి. పనికి ఆహరం పథకం కింద చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, వాటర్ కన్సర్వేషన్ పెరగడంతో..కరువు ను కట్టడి చేయగలిగారు. ఇప్పటికీ కరవు పీడిత ప్రాంతాల్లో ఈ పథకం అమలు కావడం చూస్తే 50 సంత్సరాల క్రితం శరద్ పవార్ చేసిన ఆలోచన ఎంత ఉన్నంతగా ఉందో అర్థం అవుతోంది. సీఎంగా ముంబాయి బాంబు పేలుల్లు, లాతూర్ బుకంప సంక్షోభాలను సమర్ధవంగా ఎదుర్కున్న పేరు సంపాదించారు. బాంబే పేలుల్లు హిందు ముస్లిం మత ఘర్షణలుగా మారకుండా ఉండేందుకు ముస్లిం ఏరియాల్లో సైతం బాంబులు పేలాయని మీడియా సమావేశాల్లో అవాస్తవాలు చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. లాతూర్ భూ కంప బాధితుల కోసం లక్ష ఇండ్లను ఒక్క ఏడాదిలో నిర్మించి తన పనితనాన్ని నిరూపించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. పండ్ల రైతులను ప్రోత్సహించేందుకు పనికి ఆహర పథకాన్ని వారికి వర్తింప చేసారు. వ్యవసాయానికి గ్రామీణ ఉపాది హమీ పథకాన్ని అనుసంధానం చేయడం అసాధ్యం అంటున్న కేంద్రం..శరద్ పవార్ అనుభవనాలను అద్యయనం చేస్తే సరిపోతుంది. సహకార సంఘాల్లో రాజకీయ పెత్తనాన్ని కట్టడి చేసేందుకు 10 సంవత్సరాలకు మంచి ఏవరూ పాలక మండల్లో ఉండకుండా చట్టం చేసారు. అటు కేంద్ర మంత్రిగా ఎన్నో పనులు చేసారు. ప్రధాని పదవి కోసం పీవితో పోటి పడి ఓటమి చెందినా నిరుత్సాహపడకుండా..దేశ హితం కోసం పీవీ మంత్రి వర్గంలో రక్షణ శాఖ మంత్రిగా..సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించారు. తద్వారా ఆదా అయిన సొమ్మును పేదరికం, నిరుద్యోగిత నిర్మూలన కోసం వెచ్చించ వచ్చని చైనా అధ్యక్షుడిని ఒప్పించి..వాస్తవాధీన రేఖ వెంట పాక్షికంగానే అయినా శాంతిని నెలకొల్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా.. పంటలకు బోనస్ అందించే విధానాన్ని తీసుకొచ్చి అన్నదాతకు కాస్తైనా ఊరట కల్పించారు. ఒక్క సారి రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత తన కాంగ్రెస్ సిద్దాంతాల కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు పవార్. తన రాజకీయ గురువు Y.B చవాన్ మొదలుకుని, ఐరన్ లేడీ ఇందిరా గాంధి, డైనమిక్ పీఎం రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిన ప్రతిసారి తిరుగుబాటు జెండా ఎగుర వేసారు. ఆత్మగౌరవ పతాకగా నిలిచారు. మహరాష్ట మంత్రిగా యూపీ పర్యటనలో యూపీ సీఎం కాల్లు మొక్కేందుకు నిరాకరించారు. యూపీ సీఎం నొచ్చుకున్నా, మహరాష్ట్ర విజ్నప్తులను మన్నించకున్నా..పవార్ మాత్రం తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేదు. ఆకలిని భరిస్తాం తప్ప ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనని తెగేసి చెప్పారు. ఆ ఆత్మగౌరవం కోసమే బద్ద విరోధి అయిన శివ సేనతో జట్టకట్టాడు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న శరద్ పవార్..ఎప్పుడు రొడ్డు ప్రయాణానికే ప్రధాన్యత నిస్తారు. ఆయా మార్గంలో వస్తున్న మార్పులు, జరుగుతున్న అభివ్రుద్ది, ప్రజల ఆకాంక్షలు వంటి విషయాలను తెలుసుకునేందుకు ఇష్టపడతారు. ప్రజలతో ఉంటేనే వారి సాధక భాధకాలు తెలుస్తాయన్న బలమైన విశ్వాసం అయనది. ఎప్పుడు లండన్ వెల్లినా అక్కడి పార్లమెంటు సమావేశాలను పవార్ తప్పకుండా హజరు అవుతారు. గ్యాలరి లో కూర్చిని వారి అర్ధవంతమైన చర్చను ఆస్వాదిస్తూ..అక్కడి లైబ్రరిలో సమయాన్ని వెచ్చిస్తూ ప్రపంచంలో వస్తున్న మార్పులు, మారుతున్న ప్రజల ఆకాంక్షలను ఆధ్యయనం చేసే అలవాటును అలవర్చుకున్నారు. దీన్ని బట్టె అర్ధం అవుతుంది ఆయనెంత నిత్య అధ్యయన శీలి అని. భవిష్యత్తు తరాలకు ప్రాంతం, మతం, కులం వంటి కుంచిత భావాలు కాకుండా ఓవరాల్ అవుట్ లుక్ ఉండాలని, డెవలప్ మెంట్ ఓరియేంటేషన్ ఉండాలని బలంగా నమ్మె శరద్ పవార్..పార్టీ యువ నాయకులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడమే కాకుండా పోటెన్షియల్ లీడర్లను ప్రపంచ సంస్థలకు అనుసంధానించడం ద్వారా భవిష్యత్తు భారతావని అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే సామర్ద్యం అవలడుతుందంటాడు. అప్పుడే ఒత్తిడులకు లొంగకుండా మోరల్ కన్విక్షన్ కు అనుగుణంగా విధనాలు రూపకల్పన జరుగుతుందంటాడు. అందుకే ఎన్ని అవంతరాలు ఎదురైనా తాను అనుకున్నది చేయగలిగానంటాడు. సాధరణంగా ఆత్మకథలో ఆత్మస్థుతి, పరనిందలుంటాయి. కానీ పవార్ ఆత్మకథలో మాత్రం తనపై వచ్చిన అన్ని విమర్శలు, వాటి వెనకగల కారణాలను వివరించారు. ఆ విమర్శల్లో ఎంత మేర వాస్తవముందో నిర్ధారించుకునే అవకాశాలన్ని పాఠకులను వదిలేసారు. పవార్ విల్ పవర్ చాలా గొప్పది. 2004 లో వచ్చిన క్యాన్సర్ ను సైతం ఆయన జయించారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు..సర్ ఇంకా మీరు 6 నెలలే బతుకగలరు అని చెబితే….డాక్టర్ల వాదన తప్పని సవాల్ విసిరి నిరూపించారు. మానసిన స్థైర్యం, మనో నిబ్బరమే మనిషి అయుష్షుకు రక్షణ కవచం అని..అందుకే విపత్కర పరిస్థుతులను ధైర్యంగా ఎదుర్కొనే లక్షణాన్ని అలవర్చకున్నారు. అందుకే నేను “సూపర్ సన్ ఆఫ్ సూపర్ మామ్” అని..అంత సులభంగా పోను అంటూ చమత్కరాలు విసురుతుంటారు. శరద్ పవార్ తల్లి దేశ స్వాతంత్ర్యానికి పూర్వం పూణే స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధిగా ఎన్నికవుతారు. శరద్ పవార్ పుట్టిన మూడో రోజే చంటి బిడ్డతో పాటు నాలుగు గంటలు బస్సు ప్రయాణం చేసి అత్యవసర సర్వసభ్య సమావేశానికి హజరవుతారు. అప్పుడు సభకు చైర్మన్ గా ఉన్న పెద్ద మనిషి లేచి నిలబడి పవార్ తల్లికి వందం చేసి…He is super son of super mom అని, మూడు రోజుల వయసుల్లోనే ప్రజా జీవితాన్ని ప్రారంభించాడని అభినందిస్తాడు. తల్లి రాజకీయాల ఆదర్శంగా..యావత్ కుటుంభం సోషలిస్టులుగా ఉంటే వారిని కాదని కాంగ్రెస్ లో చేరి రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టి 53 ఏండ్లుగా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న శరద్ పవార్ జీవితం నిజంగా స్పూర్తి దాయకం. తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరిని తన ఆత్మకథ ద్వారా భాహ్య ప్రపంచానికి పరిచయం చేసారు. తనకు 40 సంవత్సరాలుగా డ్రైవర్ గా పనిచేస్తున్న “గామా” కు సైతం పుస్తకంలో ఒక పేజీ కేటాయించడం నిజంగా అబ్బుర పరిచే అంశం. ఆయన ఆత్మకథ కేవలం ఆయనకు సంభంధించిందే కాదు..తొలి ప్రధాని నెహ్రూ అనంతర కాంగ్రెస్ రాజకీయాలకు, భారత ప్రభుత్వంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. రాజకీయాలు, కళలు, సాహిత్యం, నాటకం, క్రీడలు..ఇలా ఎన్నో రంగాల్లో తన పట్టును నిలుపుకున్న శరద్ పవార్ వ్యక్తిత్వం ఏకత్వంలో భిన్నత్వమే. రాజకీయ ప్రత్యర్ధులను..బద్ద శత్రువులుగా పరిగణించే కాలంలో.. రాజకీయ వైరుద్యాలు, ఎన్నికల ప్రత్యర్ధులతో వ్యక్తిగత మిత్రుత్వం కొనసాగించిన శరద్ పవార్ ది నిజంగా భిన్నమైన మనస్తత్వమే.