తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్

1891

భాషాజ్ఞాని గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ, ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు అంటూ మోదీ తెలుగులోనే ట్వీట్ చేశారు.

తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్రవేసిన గిడుగు వెంకట రామ్మూర్తి గారికి ఇవాళ నివాళులు అర్పిస్తున్నాను అంటూ మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, నేడు విద్యార్థులతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టోనీ అనే తెలుగు విద్యార్థితో మాట్లాడుతూ తనకు తెలుగు బాగా వచ్చని చమత్కరించారు. టోనీ తెలుగులో మాట్లాడిన కొన్ని మాటలు విని, చూడు… నాకెంత బాగా అర్థమైందో! అంటూ నవ్వేశారు.