అడ్డగోలు దోపిడీ తప్ప, అభివృద్ధి ఎక్కడుంది?

2156

15 నెలల జగన్ పాలనలో ఎక్కడా రాష్ట్రంలో రూ.లక్ష రూపాయల అభివృద్ధి జరగలేదని, కోటిరూపాయలతో ఒక్కప్రాజెక్ట్ పనిజరగలేదని, గతప్రభుత్వం కట్టినభవనాలకు రంగులేసుకోవడం తప్ప, జగన్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఏంచేశారో చెప్పాలని, టీడీపీ తరుపున గతంలో అనేకసార్లు ఈ పాలకులను ప్రశ్నించి, చర్చకు రావాలని సవాల్ చేస్తే, ఒక్కరూ రాలేదని, చివరకు చేసేదిలేక తోక ముడిచారని బొండా ఎద్దేవాచేశారు. వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఏంచేసిందో, ఏఏప్రాంతాలకు న్యాయంచేశారో చెబుతూ శ్వేతపత్రం విడుదల చేయాలనికోరినా ప్రభుత్వంనుంచి ఎవరూముందుకు రాలేదన్నారు. టీడీపీప్రభుత్వం 13 జిల్లాల అభివృద్ధికి కృషిచేసిందని, రూ.64వేల కోట్లతో సాగు, తాగునీటి ప్రాజెక్టులునిర్మించిందన్నారు. విజయవాడలో నిర్మించిన కనకదుర్గ మ్మ ఫ్లైఓవర్ నిర్మాణం టీడీపీ ప్రభుత్వంలో జరిగితే, దాన్ని తాము నిర్మించామని కొందరు మూర్ఖులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు విజయవాడలో జరిగిన ధర్నా కార్యక్రమానికిహాజరై, అక్కడున్న సమస్యను గుర్తించి, అధికారం లోకి రాగానే ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పడం జరిగిందన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న జోగిరమేశ్, మల్లాది విష్ణు, లగడపాటి రాజగోపాల్, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడంజరిగిందన్నారు. అటువంటి మూర్ఖులు గతం మర్చిపోయి, టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఫ్లైఓవర్ కు సున్నాలేసుకుంటూ, తామేకట్టామని నిర్లజ్జగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను ప్రచారం కోసం తమబిడ్డని చెప్పుకునే నీచస్థితికి వైసీపీప్రభుత్వం దిగజారిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. 2009-14 మధ్య శాసనసభ్యులుగా ఉన్న కొందరుబఫూన్లు, చిల్లరకోసం కక్కుర్తిపడి విజయవాడ అభివృద్ధిని అడ్డుకున్నారని బొండాఆగ్రహంవ్యక్తంచేశారు. కనకదుర్గ మ్మ ఫ్లైఓవర్ కట్టడానికి వీల్లేదంటూ నాడు ప్రతిపక్షనేత చంద్రబాబు ధర్నాను అడ్డుకున్నారన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వర్షాలతో వరదలు వచ్చినప్పుడు ప్రజలు పడవలు వేసుకొని తిరిగారన్నారు. టీడీపీప్రభుత్వం వచ్చాక రూ.500కోట్లతో డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించి, నగరంలోని 59 డివిజన్లలో వరదనీరు నిలవకుండా చర్యలు తీసుకుందన్నారు. విజయవాడ నగరాభివృద్ధి కాంగ్రెస్ పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా ఉండేదన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఫ్లైఓవర్ పై నడవడానికి ముందు, ఆనాడు దానినిర్మాణాన్ని అడ్డుకున్నవారందరూ ముందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బొండా డిమాండ్ చేశారు.
విజయవాడ ప్రజలందరూ వైసీపీకి ఓటేసినందకు తమచెప్పుతో తామేకొట్టుకుంటున్నారని ఉమా స్పష్టంచేశారు. మంత్రి వెల్లంపల్లి గుడిని, గుడిలో లింగాన్ని మింగేసేలాతయారయ్యాడని, పవిత్రమైన దేవాలయా లను పెట్టుబడివనరులుగా మార్చుకున్నాడని బొండా ఆక్షేపించారు. సింహాచలం దేవాలయ భూములపై కన్నేశాడని, కనకదుర్గమ్మ గుడిలో కోట్లాదిరూపాయలను, అన్నవరం సత్యదేవుని ఆలయంలో సొమ్ముని వెల్లంపల్లి దిగమింగుతున్నాడ ని టీడీపీనేత మండిపడ్డారు. శ్రీశైలం ఆలయంలో టిక్కెట్ల కుంభకోణంతో కూడా దండుకున్నారన్నారు. గుంటూరు ఎమ్మెల్యే గుట్కా ప్యాకెట్లు అమ్ముకుంటుంటే, మరోనేత పేకాటకేంద్రాలు నిర్వహిస్తున్నాడన్నారు. కర్నూల్లో ఒకమంత్రి పేకాట క్లబ్ లు నిర్వ హిస్తూ దండుకుంటున్నాడన్నారు. విజయవాడలో మంత్రేమో కరోనా పేరుచెప్పి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలుచేసి, ఆఖరికి కరోనా వైరస్ తో కూడా వ్యాపారం చేసి, పడకలు ఇప్పిస్తామని చెప్పి, రోగులనుంచి సొమ్ములు వసూలుచేసే నీచస్థాయికి దిగజారాడన్నారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ప్రజలనుంచి, వ్యాపారుల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకుంటున్నారన్నారు. అవినీతి రూపుమాపడానికి టోల్ ఫ్రీ నంబర్లు పెట్టామని, మహిళలకోసం దిశాచట్టం తెచ్చామని చెప్పుకుంటూ తిరుగుతున్న వైసీపీనేతలు ఎంతమందికి న్యాయం చేశారో చెప్పాలని ఉమా నిలదీశారు. దళిత యువకులకు శిరోముండనాలు చేసినప్పుడు, తూర్పుగోదావరిలో దళిత బాలికపై, కర్నూల్లో గిరిజన మహిళపై అత్యాచారం చేసినప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చిన పనికిమాలిన చట్టాలు ఏమయ్యాయని బొండా మండిపడ్డారు. విజయవాడ నగరంతోపాటు, రాష్ట్రాభివృద్ధిపై చర్చించడానికి ముందుకొచ్చే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వంలోని వారికిగానీ ఉంటే తక్షణమే బహిరంగచర్చకు రావాలని బొండా మరోసారి సవాల్ విసిరారు.