అమరావతి కేసులో పిటిషన్ దాఖలు చేయనున్న జనసేన

2392

ఏపీ రాజధాని అమరావతి తరలింపు అంశంలో హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని జనసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ముఖ్యనేతలతో అధ్యక్షుడు పవన్‌ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఏకాభిప్రాయానికి వచ్చామని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదని ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో తుదివరకు బాధ్యతగా నిలబడతామన్నారు. అమరావతి విషయంలో జనసేన మొదట్నుంచీ స్పష్టంగా ఉంది. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదనేది తమ అభిప్రాయని చెప్పారు. ఇప్పటికే అమరావతిలో కొన్ని నిర్మాణాలు చేపట్టారు. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. రాజధాని కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయలను వెచ్చించారు. పర్యావరణ సహిత రాజధాని నిర్మాణం జరగాలని చెబుతూ వస్తున్నామని పవన్‌ కళ్యాణ్ అన్నారు.