జెసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

1840

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన కడప జైల్లో ఉన్నారు. జైల్లో ఉండగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్‌రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు.

దీంతో ఆయనకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ను అనంతపురం కోర్టు మంజూరు చేసింది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలై ఇంటికొస్తుండగా కోవిడ్ నిబంధనల మేరకు వాహనాల అనుమతికి ఓ పోలీస్ అధికారి అనుమతి ఇవ్వలేదు.

దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీస్ అధికారి ఫిర్యాదుతో ఆయనపై మళ్లీ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కడప జైలుకు తరలించారు. జైల్లో ఉండగా కరోనా వైరస్ సోకింది. ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతారో తెలియాల్సి ఉంది.