ధోనీ ఆల్విదా

2382

ధోనీ రిటైర్మెంట్ కథ అలా ముగిసింది..అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పిన మహీ.16 ఏళ్ల కెరియర్ కు ఆగస్టు 15న ముగింపు
ఇన్ స్టా గ్రామ్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించిన జార్ఖండ్ డైనమైట్.జీవితానికి….క్రికెట్ కు అవినాభావ సంబంధమే ఉంది.జీవితంలో మనిషిపాత్ర మరణంతో ముగిస్తే…క్రికెట్ లో రిటైర్మెంట్ తో ఆటకు తెరపడుతుంది.ప్రారంభం ఎలా ఉన్నా…కెరియర్ ముగింపు ఘనంగా ఉండాలని గొప్పగొప్ప క్రికెటర్లు కోరుకోడం అత్యాశ ఏమాత్రం కాదు. అయితే…ఘనంగా క్రికెట్ నుంచివీడ్కోలు తీసుకొనే అవకాశం సచిన్ టెండుల్కర్ లాంటి అతికొద్దిమందికి మాత్రమే దక్కుతుంది.

భారత క్రికెట్ కు 16 సంవత్సరాలపాటుఅసమాన సేవలు అందించిన జార్ఖండ్ డైనమైట్, భారతఅత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి గొప్పగా వీడ్కోలుతీసుకొనే అవకాశం చిక్కలేదు.ముందుగా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్….ఆ తర్వాత అంతర్జాతీయ వన్డే, టీ-20 ఫార్మాట్ల నుంచి నిష్క్రమించక తప్పలేదు.అరుదైన, అసాధారణ క్రికెటర్…సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, అనీల్ కుంబ్లే, జహీర్ ఖాన్ లాంటి మేటి క్రికెటర్లంతా మహానగరాల నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి తారాస్థాయికిఎదిగినవారే. అయితే…క్రికెట్ పునాదులు , మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేని జార్ఖండ్ లాంటి మారుమూల రాష్ట్ర్రం నుంచి భారత క్రికెట్లోకి తారాజువ్వలా దూసుకొచ్చినజులపాలజట్టు రాంచీ రాంబో 16 సంవత్సరాలపాటు భారత క్రికెట్ కు మూలస్తంభంలా నిలవటం అపూర్వం,

.ముషారఫ్ నే మెప్పించిన ధోనీ…
భారత క్రీడాచరిత్రను ఓసారి తిరగేస్తే…అలనాడు జర్మన్ నియంత హిట్లర్ ను ధ్యాన్ చంద్ తన ఆటతీరుతో మంత్రముగ్దుడ్ని చేస్తే….పాక్ నియంత పర్వేజ్ ముషారఫ్ నుమహేంద్ర సింగ్ ధోనీ తన జులపాల జట్టుతో కట్టిపడేశాడు. తన దూకుడు, విలక్షణ ఆటతీరుతో అభిమానిగా మార్చుకొన్నాడు.దేశవాళీ క్రికెట్ ద్వారా భారతజట్టులోకి 2004లో అడుగుపెట్టిన ధోనీ…బంగ్లాదేశ్ గడ్డపై వన్డే అరంగేట్రం చేసినా… ఆ తర్వాత కానీ నిలదొక్కుకోలేకపోయాడు.

2014 డిసెంబర్ లో టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ..ఆ తర్వాత ఐదేళ్ళపాటు ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే ఫార్మాట్లలో భారతజట్టు సభ్యుడిగాకొనసాగాడు.ఇంగ్లండ్ వేదికగా ముగిసిన 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ ప్రత్యర్థిగా తన ఆఖరి అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత నుంచే ధోనీ రిటైర్మెంట్ పై ఊహాగానాలు జోరందుకొన్నాయి. కొద్దివారాలపాటు తనకుతానుగా క్రికెట్ కు దూరమై…భారత సైనికదళాలకు సేవలు అందించాడు. రిటైర్మెంట్ ఊహాగానాల నడుమే…
ఐపీఎల్ 13వ సీజన్ కు సన్నాహాలు ప్రారంభించాడు. ఆస్ట్ర్రేలియా వేదికగా జరగాల్సిన 2020 టీ-20 ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాలని భావించినా..కరోనా మహమ్మారి దెబ్బతో అంచనాలు తలకిందులయ్యాయి.టీ-20 ప్రపంచకప్ సైతం రద్దుల పద్దులో చేరిపోడంతో…వేరే దారిలేని ధోనీ అర్థంతరంగా తన అంతర్జాతీయ కెరియర్ ను ముగించక తప్పలేదు.
భారత్ కు 350 వన్డేలు, 98 టీ-20 మ్యాచ్ ల్లో ప్రాతినిథ్యం వహించిన ధోనీకి …కెప్టెన్ గా 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలుఅందించిన అరుదైన ఘనత, రికార్డులు ఉన్నాయి.మొత్తం 350 వన్డేల్లో 10 వేల 773 పరుగులతో 50.57 సగటు సాధించిన ఘనత ఉంది. ఇందులో 10 శతకాలు, 73 అర్థశతకాలు ఉన్నాయి.98 టీ-20 మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలతో సహా 1617 పరుగులతో 37.60 సగటు సాధించాడు.ఐదో భారత క్రికెటర్ ధోనీ…2019 జనవరిలో 10 వేల పరుగుల వన్డే క్రికెట్ మైలురాయిని చేరడం ద్వారా ధోనీ అరుదైన ఘనతను సాధించాడు. ఈ రికార్డు సాధించిన ఐదవ భారత క్రికెటర్ గా నిలిచాడు.

CH.V.KRISHNA RAO – SPORTS EDITOR