వైయస్ సతీమణి రాసిన నాలో..నాతో YSR పుస్తకం భిన్నంగా ఉంది. అందులో పొందుపరిచిన విషయాలు పాతవే అయినా…జీవిత సహచరి కోణంలో ఆ విషయాలు బయటకు రావడం వింత అనుభవమే. రాజకీయ నేతల వల్ల అధికంగా నష్టపోయేది వారి కుటుంభ సభ్యులే. ఆర్దికంగా, సామాజికంగా కుటుంబాలకు భద్రత మిగిలినా..కుటుంబం, అనురాగం, అప్యాయత, సమయం వెచ్చించడాలు అనేవి రాజకీయ కుటుంభాల్లో అతి తక్కువగా ఉంటాయి. అయినప్పటికి YSR తన తో గడిపిన కాలం, మిగిల్చిన అనుభవాలు, ఆయన వ్యక్తిత్వం, ఆదర్శాలు, బంధువులతో ఆయన మెలిగిన తీరు, రాజకీయాలు విజయమ్మ ద్వారా తెలుసుకోవడం చాలా ఎమోషనల్ గా ఉంది. పేరుకు పుస్తకమే అయినా అది చదువుతున్నంత సేపు ఆమే నోటి నుంచి YSR ను గూర్చిన విషయాలు మనం వింటున్నట్లుగానే ఉంటుంది. సాదరణంగా రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాలు బయటి ప్రపంచానికి తెలియవు. అలాంటిది ఈ పుస్తకంలో షర్మిలా మొదటి బలవంతపు పెళ్లి వంటి విషయాలను బహిరంగ పరచడం నిజంగా సాహసమే. షర్మిలా పెల్లి సస్సెక్ గాక మూడు నాలుగు సంవత్సరాలు YSR దంపతులు పడ్డ మానసిక వేదన చూస్తే….స్థాయి, సంఘంలో స్థానంతో నిమిత్తం లేకుండా పిల్లల పెల్లిల్ల విషయంలో మదన పడే ప్రతి తల్లి దండ్రి గుర్తుకు వస్తారు. కాని పిల్లల సుఖ సంతోషాల కోసం..వారి ఇష్టా ఇష్టాలను గౌరవించడం పై స్థాయిలో ఉన్నవారికే సులువవుతుందేమో. సమాజంలో ఎదుగుతున్న, గుర్తింపు పొందే దశలో ఉన్న కుటుంభాలు, పరువు, మర్యాద అనే బ్రమలో బతికే మద్యతరగతి జీవితాల్లో అది కష్టసాధ్యం. అందుకే ‘పరువు హత్యల’ వార్తలు ఎక్కడో ఓ చోట చూస్తేనే ఉంటాం. అలా కాకుండా అనిల్ తో షర్మిల రెండో వివాహాన్ని చాలా కాజువల్ గా YSR తీసుకోవడం మాత్రం నిజంగా ఆదర్శ ప్రాయం. అన్న అంటే ఎదిగిన అమ్మాయి తీసుకున్న నిర్ణయాలను గౌరవించడమే తప్ప తన నిర్ణయాలను రుద్దడమో లేక తన గౌరవానికి భంగం కల్గిస్తుందని అజామాయిషి చేయడం కాదని వైయస్ జగన్ వ్యవహరించిన తీరు ఆయన మెచ్యురిటికి అద్దం పడుతోంది. ఇక వైయస్ మరణ సమయంలో..సతీమణి పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. చివరి నిమిషాల్లో ఆయన ఏలా ఫిలయ్యారు? భయపడ్డారా? కుటుంభం గుర్తుకు వచ్చి ఉంటుందా? ఏమన్న ఆందోళన చెంది ఉంటారా, మరణం తెలిసే జరిగి ఉంటుందా? లేక ఊహించకుండానే ఆయన మరణంలోకి జారుకున్నారా? అని తెలుసుకోవాలనే విజయమ్మ తపన గుండెను బరువెక్కిస్తోంది. ఈ భాధ విజయమ్మ ఒక్కరిదే కాదు. ప్రతి సాధరణ గ్రుహిణి భాధ ఇంచుమించు ఇదే రకంగా ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు, భాధలు పడినా చివరి క్షణాల్లో …హయిగా పోవాలని, ఆ సమయంలో తోడుగా ఉండాలని అంతా కోరుకుంటారు. ఏలాంటి పరిస్తితుల్లో మరణం సంభవించిందో తెలియని పరిస్తితుల్లో, చివరి చూపునకు నోచుకోని నిస్సాహయ స్థితిలో..భర్త చివరి క్షణాలు ఏలా ఉన్నాయో అని తెలుసుకోవాలనే విజయమ్మ తాపత్రయం చూస్తే నాకు సోనియా గాంధి గుర్తుకు వచ్చింది. మరణించే ముందు తన భర్త ఏలా ఉన్నాడు, ఏదన్న టెన్షన్ పడ్డాడా? మరణిస్తానని ఊహించాడా, నీతో చివరగా ఏం మాట్లాడాడు వంటి ప్రశ్నలతో..పెరంబదూర్ పేళుల్ల ముందు వరకు రాజీవ్ గాంధి ని ఇంటర్వు చేసిన నీనా గోపాల్ అనే ఫారన్ జర్నలిస్టును సోనియా అర్దించడం గుర్తుకు వచ్చింది. రాజీవ్ చివర్లో ఏం చెప్పాడో చెప్పు చెప్పు అని నీనా గోపాల్ ( from Neena Gopal’s book on the assassination of Rajiv Gandhi) చేతులు పట్టుకుని మరి మరీ ఆడగటం చూస్తే రాజకీయ పదవులు, ఉన్న స్థానాలు, కుటుంభ గౌరవం, తమ గొప్పతనం వంటి అంశాలను దాటుకుని బయటకు వచ్చే మనసు ఘోషకు మించిన నిస్సాయత లేదు. అదే నిస్సాహయత, నిర్వేదం విజయమ్మ వ్యక్తీకరణలో వ్యక్తమవుతోంది. అయితే పుస్తకంలో కొన్ని పొరపాట్లు దొర్లాయి. 1982 లో వైయస్సార్ విద్యా శాఖ మంత్రిగా బడి పిల్లలకు మద్యహ్న పథకం తెచ్చారని..అది దేశంలోనే మొదటిదని పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఈ పధకాన్ని 1960ల్లోనే తమిళ నాడు లో ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ పరిమితంగా ప్రారంభించగా…ఆ తర్వాత 1980 కి ముందు ఎమ్జీఆర్ రాష్ట వ్యాప్తం చేసారు. మిడ్ డే మీల్ అనే మంచి పథకానికి తమిళ నాడులో బీజం పడగా..దాన్ని వైయస్సార్ ఖాతాలో వేయడం సహేతుకం కాదనిపిస్తోంది. అదే సమయంలో రైతులకు ఇన్సురెన్సు పథకాన్ని వైయస్ అమలు చేసినట్లు చెప్పారు. పంటల భీమాతో సహ ఎన్నో ఆదర్శ పథకాలకు వైయస్ శ్రీకారం చుట్టిన ప్పటికీ..రైతు ఇన్సురెన్సు మాత్రం వైయస్ ప్రవేశ పెట్టినట్లు నేను గమనించ లేదు. కేసీఆర్ రైతు భీమా తోనే దీనికి అంకూరార్పణ జరిగిందని భావిస్తున్నాను. ఈ రెండు విషయాల్లో నేను పొరబడి ఉంటే మిత్రులు సరిచేయగలరు. మొత్తానికి రాజశేఖర్ రెడ్డితో తన ప్రయాణం మొదలుకుని, కుటుంబ వ్యవహరాలు, పిల్లలతో YSR అనుబంధం మొదలుకుని సీఎంగా వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వరకు అన్ని అంశాలను క్రోడికరిస్తూ విజయమ్మ తెచ్చిన పుస్తకం..మనకు తెలిసిన చరిత్రను కొత్తగా మరో సారి ఆవిష్కరించినట్లుంది.
 
            