ఉస్మానియా ఆస్పత్రి అంశంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చెరుకుందని.. రోగులు, డాక్టర్లు, సిబ్బందికి ప్రాణాపాయం ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. వర్షాలకు ఆస్పత్రి భవనంలోకి చేరిన నీటి గురించి మీడియా వార్తలు, కథనాలను చూసామని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. కొన్ని వ్యాజ్యాలు పురావస్తు భవనం కూల్చివేయొద్దని, మరికొన్ని కూల్చివేసి కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలని కోరుతున్నాయని వాటిని విభజించి విచారణ జరుపుతామని హైకోర్టు సీజే ధర్మాసనం వెల్లడించింది
పురావస్తు భావనాన్ని కూల్చకుండా 26 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించవచ్చని కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన ఓ పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి అన్నారు. మరో కౌన్సిల్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఎవరుపడితే వారు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయం వృధా చేస్తున్నారని బెంచ్ కు తెలిపారు.
పిటిషనర్ దేబారా 15 ఏళ్ల నుంచి ప్రజాపోరాటంలో పాలుపంచుకుంటున్నారని, ఎన్నో వ్యాజ్యాలు వేశారని ఇప్పటికీ హైకోర్టులో ఇతర అంశాలపై రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు విచారణ దశలో ఉన్నాయని కోర్టుకు న్యాయవాది రచనారెడ్డి తెలిపారు.
పురావస్తు భావనాన్ని కూల్చకుండా 26 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించవచ్చని కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన ఓ పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి అన్నారు. మరో కౌన్సిల్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఎవరుపడితే వారు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయం వృధా చేస్తున్నారని బెంచ్ కు తెలిపారు.
పిటిషనర్ దేబారా 15 ఏళ్ల నుంచి ప్రజాపోరాటంలో పాలుపంచుకుంటున్నారని, ఎన్నో వ్యాజ్యాలు వేశారని ఇప్పటికీ హైకోర్టులో ఇతర అంశాలపై రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు విచారణ దశలో ఉన్నాయని కోర్టుకు న్యాయవాది రచనారెడ్డి తెలిపారు.
74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో శనివారం ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన తర్వాత, గవర్నర్ రాజ్ భవన్ సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ డిస్టెన్స్ నిబంధనల ప్రకారం దూర దూరంగా నిలుచున్న ఆఫీసర్లు, పోలీస్, ఇతర సిబ్బంది వద్దకు గవర్నర్ స్వయంగా వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసు సిబ్బందికి స్వయంగా మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ భర్త డా. సౌందరరాజన్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు గవర్నర్ దంపతులు, కుటుంబ సభ్యులు రాజ్ భవన్ లోని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్ భవన్ లోని చారిత్రక దర్భార్ హాల్ ముందు జరిగిన ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్ సలహాదారులు రిటైర్డ్ ఐఎఎస్ ఎపివిఎన్ శర్మ, రిటైర్డ్ ఐపిఎస్ ఎకె మొహంతి, గవర్నర్ సెక్రటరి కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘుప్రసాద్, అనుసంధాన అధికారి సిహెచ్ సీతారాములు, డా. రాజారామ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పార్టీ మారినప్పుడు ఉన్న దూకుడు ఇప్పుడు చాలా మంది నాయకుల్లో కనిపించడం లేదు. టీడీపీలో సీనియర్లుగా ఉన్న నాయకులు.. ఆ పార్టీ గుర్తుపై ఎదిగిన నాయకులు.. టీడీపీ చెట్టునీడన రాజకీయాలు నేర్చుకున్న నాయకులు తర్వాత కాలంలో ఆ పార్టీ తరఫున అనేక పదవులు చేపట్టిన నాయకులు ఇటీవల చాలా మంది వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు కొందరు ప్రత్యక్షంగా మద్దతు చెప్పలేక.. పరోక్షంగా వైఎస్సార్ సీపీకి మద్దతు పలికారు. వీరి పరిస్థితి ఒకింత బాగానే ఉందని అనుకోవాలి. గత ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయాక ఆ పార్టీకి చెందిన వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరిధర్, కరణం బలరాం వైసీపీకి దగ్గరయ్యారు. ఇక ఎన్నికల్లో ఓడిన నేతల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్సీలు సైతం జగన్ చెంతకు చేరిపోయి సేద తీరుతున్నారు. వీరితో పాటు వీరిని నమ్ముకుని ఉన్న చాలా మంది ఇతర నాయకులు కూడా చంద్రబాబుకు జల్ల కొట్టి.. వైఎస్సార్ సీపీలో చేరిపోయారు.
ఈ లిస్ట్ ఓ సారి చూస్తే తూర్పుగోదావరికి చెందిన తోట త్రిమూర్తులు, అనంతకు చెందిన యామినీ బాల, శమంతకమణి, ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, అనకాపల్లిలో ఎంపీగా ఓడిపోయిన గుడివాడ అమర్నాథ్ వంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే, వీరికి ప్రాధాన్యం లేదనే టాక్ వినిపిస్తోంది. ఏదో వచ్చారు.. ఏదో ఉన్నారు అనే ధోరణిలోనే వైఎస్సార్ సీపీ నాయకత్వం భావిస్తోందని చెబుతున్నారు. కానీ ఇలా వచ్చిన వారికి మాత్రం చాలా ఆశలు మాత్రం ఉన్నాయి. టీడీపీలో దక్కని పదవులు ఏవో తమకు ఇక్కడ దక్కుతాయని అనుకున్నారు. కానీ, ఇక్కడ ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు
దీనికి కారణాలు ప్రధానంగా రెండు కనిపిస్తున్నాయి. ఒకటి ఇప్పటికే వైఎస్సార్ సీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా పార్టీ కోసం కాడిమోసిన వారే.. త్యాగాలు చేసిన వారే.. ఇప్పుడు వీరిని కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం సరికాదనే భావన వైఎస్సార్ సీపీలో కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే జగన్ మండలి రద్దు చేస్తానన్న మాట చెప్పడంతోనే పార్టీ నేతల్లో చాలా మంది ఆశలు ఆవిరిపోయాయి. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం భారీ పోటీ ఉంది. ఇక జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ? ఎవరికి ఏ పదవి ఇస్తారో ? ఆయన చర్యలు ఊహాతీతం అన్నట్టుగా ఉన్నాయి. ఈ మాట సొంత పార్టీ నేతలే అంటున్నారు.జగన్ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన అవంతి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల ముందే వచ్చిన పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం పార్టీలోనే చాలా మందికి నచ్చడం లేదు. పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్న వారికే దిక్కూ దివాణం లేదు. ఇక ఎన్నికల తర్వాత పార్టీ మారిన వారిని జగన్ ఇప్పుడు అందలం ఎక్కిస్తారని ఆశించడం అత్యాశే అవుతుందని… ఈ జంప్ జిలానీలపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఇక, రెండో కారణం..
ఇలా వచ్చిన వారికి సొంత పార్టీలోనే ప్రాధాన్యం దక్కలేదు. పైగా వీరికిజన బలం కూడా పెద్దగా లేదు. ఇలాంటి వారు వస్తామంటే.. రమ్మన్నారు తప్ప.. వారి వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉంటుందని జగన్ భావించడం లేదు.పోతుల సునీత, యామినీ బాల, శమంతకమణి, గుడివాడ అమర్నాథ్ వీరిలో పార్టీ మారిన వారికి బిజినెస్‌లు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి చూసుకోవడం మినహా పదవులపై ఆశలు పెట్టుకుంటే కష్టంగానే కనిపిస్తోంది. ఇక వీరి సొంతంగా కేడర్ కూడా లేకపోవడంతో వీరు పార్టీ మారిన రోజు మినహా ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జగన్మోహన్‌రెడ్డి రెండోసారి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని వాళ్లే లీకులు ఇస్తోన్న పరిస్థితి
హైదరాబాద్ ప్రగతి భవన్‌లో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులున్నారు.