Home Blog Page 5

సామాన్య ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా

తెలంగాణ ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల సందర్శన యాత్రలో భాగంగా ఆయన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందన్న ఆయన.. ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని మండిపడ్డారు. సామాన్య ప్రజల ప్రాణాలకు విలువ లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనా విషయమై ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించినా.. పట్టించుకోలేదని.. ఇప్పుడు దానికి ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమీన్‌పూర్ ఘ‌ట‌న‌పై ‘సిట్’ కు మ‌హిళా సంఘాల డిమాండు

25 ఆగస్టు 2020

అమీన్‌పూర్ ఘ‌ట‌న‌పై సిట్ ఏర్పాటుకు మ‌హిళా సంఘాల డిమాండు.అమీన్‌పూర్ ఘ‌ట‌న‌పై సిట్ ఏర్పాటు చేసి మ‌హిళా పోలీసు అధికారిణి నేతృత్వంలో విచార‌ణ జ‌రిపించాల‌ని మ‌హిళా సంఘాలు, ట్రాన్్స జండ‌ర్ సంఘాల ఐక్య‌కార్యాచ‌ర‌ణ వేదిక డిమాండు చేసింది.
అమీన్పూర్‌ మారుతి అనాధాశ్రమంలో దళిత మైనర్‌ బాలికపై అత్యాచారం, మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి ఈ సంఘాల నేత‌లు క‌ల‌సి ఏర్పాటు చేసిన ప‌త్రికా స‌మావేశంలో కోరారు.

తల్లిదండ్రులను కోల్పోయిన దళిత మైనర్‌ బాలిక సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్‌పూర్‌ మారుతి అనాధాశ్రమంలో ఆశ్రయం పొందుతుండగా అనేకసార్లు అత్యాచారానికి గురయ్యి…తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంఘటన పై సమగ్ర విచారణ జరిపి దోషుందర్ని కఠినంగా శిక్షించాల‌ని, ఇటువంటి అక్రమాలన్నింటిపైన దర్యాప్తు జరపాని మహిళా, టాన్స్‌ జెండర్‌ సంఘాల, వ్యక్తుల ఐక్యకార్యాచరణ డిమాండ్‌ చేస్తున్నది. ఐక్య కార్యాచరణ నిజ నిర్ధారణ కమిటీ విచారణలో తేలిన వాస్తవాల ఆధారంగా చేస్తున్న డిమాండ్లు:(వీటిని సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది.)

-మారుతి అనాధాశ్రమం నిర్వాహకులు పాప అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆసుపత్రికి కాకుండా మార్చి 21న బంధువు ఇంటికి లాక్‌ డౌన్‌ పేరుతో పంపేశారు. జూలై 30న పాప తన మీద జరిగిన అత్యాచారాన్ని బంధువు దృష్టికి తీసుకెళ్లగా జూలై 31న పోలీసుల దగ్గర ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచారం జరిగిందని పరీక్షలో తెలిసినా గానీ, అప్పటికే తీవ్ర అనారోగ్యంతో వున్న పాపకు వైద్యచికిత్స అవసరమయినప్పటికీ పరీక్షలు జరపకుండా ఆగస్టు 7న పరిస్థితి విషమించేదాకా అధికారులు ఆసుపత్రిలో చేర్చలేదు.

పాప చనిపోవటానికి కారణమయ్యారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యమే కాదు వ్యవస్థాగత వైఫల్యం కూడా. దీనికి బాధ్యులైనవారిపై కఠినమైన చర్యలు తీసుకుకోవాలి.
-జులై 31న FIR చేసిన తర్వాత వేణుగోపాల్‌ రెడ్డి, వార్డెన్‌ విజయ, ఆమె తమ్ముడు జయదేవ్‌ను అరెస్టు చేయటంలో జాప్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. FIR లోనిందితుల పూర్తి పేర్లు, వివరాలు ఉండాలి.
ఆగస్టు 1వ తేదీన భరోసా కేంద్రంలో బాలికకు వైద్య పరీక్ష నిర్వహించాక అమె శరీరంపై హింసించిన చిహ్నాలు ఉంటే పాపను వెంటనే ఆసుపత్రికి పంపి, అనుమానితులపై వెంటనే కేసు ఎందుకు పెట్టలేదో విచారించాలి.
ఆగస్టు 3వ తేదిన విచారణకు పిల్చి బాలిక స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకొన్న CWC రంగారెడ్డి జిల్లా బాధ్యులు… ఐదో రోజున అంటే ఆగస్టు 7వ తేదీన తిరిగి బందువుల పైనే పోక్సో కేసు నమోదు చేసి వారి అరెస్టుకు వత్తిడి చేయడానికి కారణాలు విచారించాలి. మారుతి అనాధాశ్రమంలో జరిగిన అత్యాచారం, దానిమీద రిజిస్టరు అయిన FIR (218/2020) ను కనీసం ప్రస్తావించకుండా ఎందుకు వదిలివేశారు?
`ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నింబోలిఅడ్డ హొమ్‌ (CCI) కి ఆగస్టు 3వ తేదీ పాప ని పంపించిన కారణం అక్కడ వైద్యుల పర్యవేక్షణ వుంటుందనే! 7వ తారీఖున పాప ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించేవరకూ అక్కడి అధికారులు ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు.పెద్దల రక్షణ లేని పిల్లల సంరక్షణను బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఈ పాప ఆరోగ్య పరిస్థితిని ఏ మాత్రం సీరియస్‌గా పట్టించుకోకపోవటంతో అత్యంత విషాదకర పరిస్థితిలో చనిపోయింది. ఈ పాప కేసులో ఇన్‌వాల్వ్‌ అయిన అన్ని వ్యవస్థల మీదా కూడా నిష్పక్షపాతమైన విచారణ జరిపి బాధ్యులను శిక్షించాల‌ని డిమాండు చేశారు.-ఈ పాపతో పాటు మార్చికి ముందు ఆశ్రమంలో ఉన్న బాలికను ఎక్కడవున్న వెతికి తీసుకువచ్చి చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీస్‌ అధికారి, సోషల్‌ వర్కర్‌, తల్లి తండ్రులు, చైల్డ్‌ సైకాజిస్టు ఆధ్వర్యంలో నిజాలు వెలికితీయాల‌ని కోరారు. వీరు కింది డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

-ఆశ్రమంలోని బాలలందరికీ ‘‘ట్రామా’’ ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలి.
రిజిస్టర్‌ అయిన లేదా రిజిస్టర్‌ చేసుకోని అన్ని హోమ్‌లు, ఆశ్రమాలపై, వాటి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ప్రభుత్వంచే గుర్తింపబడిన సంస్థల మేలు కలయికతో పారదర్శకంగా పర్యవేక్షణ జరిగేలా చర్యలు చేపట్టాలి.

-NCPCR(నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ది ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్స్‌), NCW ల మార్గదర్శకాలు పాటించని అన్ని హోమ్‌ల గుర్తింపు రద్దు చేయాలి. ఆ బాలలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.
` మారుతీహోమ్‌ విజయ, ఆమెకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ మళ్ళీ ఇటువంటి ఆశ్రమాలు నడపకుండా వారిని బ్లాక్‌ లిస్టు లో పెట్టాలి.
ఈ ప్ర‌త్రికా స‌మావేశంలో సజయ(సామాజిక విశ్లేషకులు), సంధ్య (POW), ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి(దళిత్ విమెన్ కలెక్టివ్), ఖలీదా పర్వీన్ (అమూమత్ సొసైటీ), నాగలక్ష్మి(ఐద్వా), ప్రీతీ (పాప పిన్ని), కొండవీటి సత్యవతి(భూమిక), అనురాధ(అమన్వేదిక) మాట్లాడారు. వీరితో పాటు దేవి,
సుమిత్ర, కృష్ణ కుమారి, ఇందిర, అంబిక, రుక్మిణి, పద్మజ, మల్లు లక్ష్మి, సుమలత, విజయ బండారు, గిరిజ, ప్రకాష్, వెంకటనరసయ్య, ప్రసాద్, బీరం రాము మొదలైనవారు పాల్గొన్నారు.

రాజ్యాంగ పారాయ‌ణం

పోలీసు బాసులూ ఎందుకిలా?

స్టేషన్లతోపాటు అన్ని విభాగాల పోలీస్ సిబ్బందిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో డీజీపీ ఆఫీస్ ఉన్నట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే హోంగార్డు నుంచి ఏపీ స్థాయి అధికారి వరకు నిఘా ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్ప టికే అవినీతి అధికారుల లిస్ట్ తయారుచేసినట్లు తెలిసింది. వారిపై ముందుగా అంతరత విచారణ చేపట్టడంతోపాటు స్టే షన్‌కి వచ్చే బాధితులతో సిబ్బంది బిహేవియర్‌‌‌‌పై ఫీడ్‌‌ బ్యాక్ తీసుకోనున్నారు.యూనిఫామ్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో లంచాలు తీసుకుంటూ కొందరు ఏసీబీకి పట్టుపడుతుంటే, సివిల్‌ సెటిల్మెంట్లలో తలదూర్చి మరి కొందరు సస్పెండ్ అవుతున్నారు. ఇలాంటి సమస్యలపై కంప్లయింట్స్ పెరుగుతుండడంతో ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల సివిల్‌ సెటిల్మెంట్ల ఆరోపణలతో వనస్థలిపురం ఏసీపీ జయరామ్‌‌, ఎస్సార్‌‌‌‌నగర్‌ ‌‌‌ఇన్‌‌స్పెక్టర్‌ ‌‌‌మురళీకృష్ణ, ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా వ్యవహరించిన సిటీ ఎస్బీ ఇన్‌‌స్పెక్టర్‌‌ ‌‌కె.చంద్రకుమార్‌ ‌‌‌సస్పెన్షన్ డిపార్ట్‌మెంట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వరుస ఘటనలతో ఉన్నతాధికారులు అలర్ట్‌అయ్యారు.

. పోలీసుల అవినీతి, అక్రమాలు, వేధింపులపై ఆధారాలుంటే నేరుగా వచ్చి కంప్లయింట్ ఇవ్వచ్చని, కమిషనరేట్ల వాట్సాప్ నంబర్ ద్వారా అయినా తమ దృష్టికి తీసుకురావచ్చని సీపీలు చెప్తున్నారు. తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు సిటిజన్లు సహకరించాలని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఇష్యూ సందర్భంగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ట్ ట్విట్టర్లో కోరారు

ఇప్ప టికే అవినీతి అధికారుల లిస్ట్ తయారుచేసినట్లు తెలిసింది. వారిపై ముందుగా అంతరత విచారణ చేపట్టడంతోపాటు స్టే షన్‌కి వచ్చే బాధితులతో సిబ్బంది బిహేవియర్‌‌‌‌పై ఫీడ్‌‌ బ్యాక్ తీసుకోనున్నారు.ఈ నెల 18న లైంగిక వేధింపుల కేసులో సిటీ ఎస్ బీ ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రకుమార్‌‌పై నిర్భయ కేసు, సస్పెన్ష న్ వేటు. ఈ నెల17న సివిల్‌ సెటిల్మెంట్ ఆరోపణలతో వనస్థ లిపురం ఏసీపీ జయరామ్, ఎస్ఆర్‌నగర్‌‌ ఇన్‌స్పెక్టర్‌‌ మురళీకృష్ణ సస్పెన్ష న్. జూలై 9న కోర్టు ఆర్డర్‌‌ఇంప్లిమెంట్‌ చేసేందుకు రూ.1.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌‌బి.శంకరయ్య, ఏఎస్ ఐ కె.రాజేందర్‌‌. జూన్‌ 6న బంజారాహిల్స్‌ ల్యాండ్‌ కేసులో రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ రవీందర్‌‌. జనవరి 9న స్టే షన్‌ బెయిల్ కోసం రూ.50వే లు, మందు బాటిల్స్‌ తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూబ్లీహిల్స్‌ ఎస్ఐ పి.సుధీర్‌‌, ఇన్‌స్పెక్టర్‌‌ బల్వంతయ్య.మహిళా ఉద్యోగినిని వేధించిన కేసులో మాజీ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ కె.చంద్రకుమార్‌‌ కోసం వనస్థలిపురం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 18న కేసు ఫైల్ కాగా, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు కాల్‌‌డేటా ఆధారంగా రెండు స్పెషల్‌‌ టీమ్స్‌తో సెర్చ్ చేస్తున్నారు. ఆయన సొంత ప్రాంతం ఏలూరుకూ వెళ్లారు. బాధితురాలు కంప్లయింట్చేస్తుందని ప్లాన్‌ ప్రకారమే ఎస్కేప్ అయ్యాడని అనుమానిస్తున్నారు.

సచిన్ పైలెట్ ఎందుకు తగ్గారు

కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ రాజీ పడింది ఎందుకు? అధిష్టానం నుంచి ఏం హామీ లభించింది? నెలరోజుల పాటు హడావిడి చేసిన సచిన్ పైలట్ తిరిగి లొంగిపోవడానికి కారణాలేంటన్న చర్చ జరుగుతోంది. సచిన్ పైలట్ కు రానున్న కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని హామీ లభించినట్లు తెలుస్తోంది. ఆ హామీ వల్లనే సచిన్ పైలట్ తన వర్గంతో కలసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారంటున్నారు.

సచిన్ పైలట్ ఆరేళ్ల పాటు రాజస్థాన్ పీసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యారు. అయితే సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ కారణంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి తప్పిపోయింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యువనేత కావడం, రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక వర్గం ఉండటంతో అధిష్టానం నిర్ణయంతో ఒకింత నిరాశకు గురైనా సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నారు.కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అశోక్ గెహ్లాత్ సచిన్ పైలట్ వర్గాన్ని తొక్కి వేయడానికే ఎక్కువ సమయం కేటాయించారంటున్నారు.

అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్ ల మధ్య 18 నెలల పాటు మాటల్లేవ్ అంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అధిష్టానం సయితం పట్టించుకోలేదు. దీంతోనే సచిన్ పైలట్ థిక్కార స్వరం విన్పించారు. అయితే రాహుల్, ప్రియాంక ల నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే తిరిగి సచిన్ పైలట్ సొంత గూటికి చేరారంటున్నారు.ఇప్పటికిప్పుడు అశోక్ గెహ్లాత్ ను తప్పించకపోయినా ముఖ్యమంత్రి గ్యారంటీ అనే సచిన్ పైలట్ కు హామీ లభించిందంటున్నారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల పాటు పంచాలని సచిన్ పైలట్ చేసిన విజ్ఞప్తిని రాహుల్, ప్రియాంకలు సున్నితంగా తిరస్కరించారంటున్నారు. అయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పడంతోనే సచిన్ పైలట్ తలొగ్గారన్నది ఆ వర్గం నుంచి విన్పిస్తున్న మాట. మరో మూడేళ్లలో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సచిన్ పైలట్ ను ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. అందుకే సచిన్ పైలట్ తిరిగి సొంత గూటికి చేరారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ కాంగ్రెస్‌లో సెప్టెంబ‌ర్ ప‌రీక్ష‌ల టెన్ష‌న్‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ కాంగ్రెస్‌లో సెప్టెంబ‌ర్ ఎన్నిక‌ల టెన్ష‌న్ మొద‌లైంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని టిఆర్ ఎస్ యువ‌రాజు కెటిఆర్ న‌గ‌రం న‌లుమూల‌ల చుట్టి వ‌స్తున్నారు. ఫ్లైఓవ‌ర్ల వంటి అనేక ప్రాజెక్టుల‌తో గ్రేట‌ర్ ఎన్నిక‌ల వైత‌ర‌ణి దాటేందుకు య‌త్నిస్తున్నారు.గ్రేట‌ర్ హైద‌రాబాద్‌గ్రేటర్హై ద‌రాబాద్ లో సెప్టెంబ‌ర్ ఎన్నిక‌ల టెన్ష‌న్ మొద‌లైంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని టిఆర్ ఎస్ యువ‌రాజు కెటిఆర్ న‌గ‌రం న‌లుమూల‌ల చుట్టి వ‌స్తున్నారు. ఫ్లైఓవ‌ర్ల వంటి అనేక ప్రాజెక్టుల‌తో గ్రేట‌ర్ ఎన్నిక‌ల వైత‌ర‌ణి దాటేందుకు య‌త్నిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో గ్రేట‌ర్ గ‌ణ‌నాధుని ఎంపిక‌పైనే స్ప‌ష్ట‌త లేదు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ప్రెసిడెంట్‌ పోస్టు కోసం కాంగ్రెస్‌లో రేసు మొదలైంది. ప్రెసిడెంట్‌ పోస్టు కోసమే సిటీ లీడర్లు నువ్వా నేనా అంటున్నారు. ఒక్కొక్కరి కి ఒక్కో సీనియర్‌ లీడర్‌ సపోర్ట్‌‌‌ చేయ‌డంతో పార్టీలో గ్రూపులుగా విడిపోయారు. గ్రేటర్‌ హైదరాబాద్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌ పాలక మండలి టర్మ్‌ ఫిబ్రవరిలో ముగుస్తుంది.

డిసెంబర్‌ నుంచి టర్మ్‌ ఎండింగ్‌ నాటికి ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చనని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఈ మధ్యే పీసీసీ ముఖ్య నేతలు సమావేశమై నిర్ణయించారు. దాంతో గ్రేటర్‌ అధ్యక్ష పదవి, మేయర్‌ క్యాండిడేట్‌ అంశంపై పార్టీలో చర్చ జోరందుకుంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్రేటర్‌ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు అనిల్‌‌‌‌ కుమార్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకే కుటుంబానికి రెండు పదవులు ఎందుకనే చర్చ పార్ట‌లో మొదలైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్‌‌‌‌ నియోజక వర్గం నుంచి అనిల్ కుమార్‌ టికెట్‌ దక్కించుకున్నారు. ఈ విషయంలో లోకల్ లీడర్లు కొందరు గుస్సాతో ఉన్నారు. సిటీలోని కొందరు సీనియర్ నేతలకు, అంజన్ వర్గానికి పడటం లేదన్న ప్రచారం ఉంది.
గ్రేటర్ ఎన్నికల‌కు ముందే సిటీ ప్రెసిడెంట్‌ ను మారిస్తేనే పార్టీ ఉనికిని చాటుకుంటుందని, లేకపోతే కష్టమని లోకల్ లీడర్స్ హెచ్చరించడం మొదలు పెట్టారు.గత గ్రేటర్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థి గా అనౌన్స్‌‌‌‌ అయిన విక్రమ్ గౌడ్‌‌‌‌, మాజీ మేయర్‌ బండ కార్తీకతోపాటు ముషీరాబాద్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌కు చెందిన కొందరు లీడర్లు పార్టీ సిటీ ప్రెసిడెంట్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం ఉంది. విక్రమ్ గౌడ్‌‌‌‌ మాజీ మంత్రి, దివంగత నేత ముఖేష్‌ గౌడ్‌‌‌‌ కుమారుడు కావడంతో పలువురు సీనియర్ నేతల్లో సానుభూతి ఉంది. విక్రమ్ కు పదవి ఇస్తే ముఖేష్‌ కుటుంబాన్ని గౌరవించినట్లు ఉంటుందని వారు అంటున్నారు. విక్రమ్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌‌‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సపోర్టుగా ఉన్నట్లు తెలుస్తోంది.

మల్కాజ్‌ గిరి ఎంపీ, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మాత్రం అంజన్‌ కుమార్‌ కే మద్దతు పలుకుతున్నట్లు ప్రచారంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌‌‌‌ నియోజకవర్గంలో విక్రమ్‌‌‌‌ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారని, నేతలందరినీ కలుపుకుపోయే సత్తా ఆయనకు లేదని కొందరు సీనియర్లతో పాటు సిటీ లీడర్లు అంటున్నారు. మేయర్‌ గా పని చేసిన కార్తీక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌‌‌‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. తనకు సిటీ ప్రెసిడెంట్‌ గా అవకాశం కల్పించాలని కార్తీక కోరుతున్నారు.ముషీరాబాద్‌‌‌‌ నేత నగేశ్ ముదిరాజ్‌ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డారు. పీసీసీ చీఫ్ కు సన్నిహితుడిగా పేరున్న ఆయన కూడా సిటీ ప్రెసిడెంట్‌ పోస్టు ఆశిస్తున్నారు.

సాధారణంగా గ్రేటర్‌ ఎన్నికలు వస్తున్నాయంటే తమను మేయర్‌ క్యాండిడేట్గా ప్రకటించాలని లీడర్లు సీనియర్ నేతల చుట్టూ చక్కర్లు కొడుతారు. కానీ.. ఈసారి కాంగ్రెస్లో అలాంటి ఊసే లేదు. మేయర్‌ అభ్యర్థిగా అనౌన్స్‌ అయితే కొందరు కార్పొరేటర్లనైనా గెలిపించుకోవాల్సి వస్తుందని, పార్టీ కోసం ఖర్చు పెట్టు కోవాల్సి వస్తుం దని భావించి చాలా మంది అందుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది సిటీ ప్రెసిడెంట్‌ పోస్టులో ఉంటే డివిజన్‌ టికెట్లు ఇప్పించుకొని మైలేజీ పొందే అవకాశం దక్కుతుందని కొందరు భావిస్తున్నారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయాలని ఆశపడ్డ పార్టీ ట్రెజరర్‌ గూడూరు నారాయణ రెడ్డి మాత్రం మేయర్‌ క్యాండిడేట్‌ గా తనను ప్రకటించాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌‌‌‌ సీటును టార్గెట్‌ గా పెట్టుకొని ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ధోనీ ఆల్విదా

ధోనీ రిటైర్మెంట్ కథ అలా ముగిసింది..అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పిన మహీ.16 ఏళ్ల కెరియర్ కు ఆగస్టు 15న ముగింపు
ఇన్ స్టా గ్రామ్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించిన జార్ఖండ్ డైనమైట్.జీవితానికి….క్రికెట్ కు అవినాభావ సంబంధమే ఉంది.జీవితంలో మనిషిపాత్ర మరణంతో ముగిస్తే…క్రికెట్ లో రిటైర్మెంట్ తో ఆటకు తెరపడుతుంది.ప్రారంభం ఎలా ఉన్నా…కెరియర్ ముగింపు ఘనంగా ఉండాలని గొప్పగొప్ప క్రికెటర్లు కోరుకోడం అత్యాశ ఏమాత్రం కాదు. అయితే…ఘనంగా క్రికెట్ నుంచివీడ్కోలు తీసుకొనే అవకాశం సచిన్ టెండుల్కర్ లాంటి అతికొద్దిమందికి మాత్రమే దక్కుతుంది.

భారత క్రికెట్ కు 16 సంవత్సరాలపాటుఅసమాన సేవలు అందించిన జార్ఖండ్ డైనమైట్, భారతఅత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి గొప్పగా వీడ్కోలుతీసుకొనే అవకాశం చిక్కలేదు.ముందుగా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్….ఆ తర్వాత అంతర్జాతీయ వన్డే, టీ-20 ఫార్మాట్ల నుంచి నిష్క్రమించక తప్పలేదు.అరుదైన, అసాధారణ క్రికెటర్…సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, అనీల్ కుంబ్లే, జహీర్ ఖాన్ లాంటి మేటి క్రికెటర్లంతా మహానగరాల నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి తారాస్థాయికిఎదిగినవారే. అయితే…క్రికెట్ పునాదులు , మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేని జార్ఖండ్ లాంటి మారుమూల రాష్ట్ర్రం నుంచి భారత క్రికెట్లోకి తారాజువ్వలా దూసుకొచ్చినజులపాలజట్టు రాంచీ రాంబో 16 సంవత్సరాలపాటు భారత క్రికెట్ కు మూలస్తంభంలా నిలవటం అపూర్వం,

.ముషారఫ్ నే మెప్పించిన ధోనీ…
భారత క్రీడాచరిత్రను ఓసారి తిరగేస్తే…అలనాడు జర్మన్ నియంత హిట్లర్ ను ధ్యాన్ చంద్ తన ఆటతీరుతో మంత్రముగ్దుడ్ని చేస్తే….పాక్ నియంత పర్వేజ్ ముషారఫ్ నుమహేంద్ర సింగ్ ధోనీ తన జులపాల జట్టుతో కట్టిపడేశాడు. తన దూకుడు, విలక్షణ ఆటతీరుతో అభిమానిగా మార్చుకొన్నాడు.దేశవాళీ క్రికెట్ ద్వారా భారతజట్టులోకి 2004లో అడుగుపెట్టిన ధోనీ…బంగ్లాదేశ్ గడ్డపై వన్డే అరంగేట్రం చేసినా… ఆ తర్వాత కానీ నిలదొక్కుకోలేకపోయాడు.

2014 డిసెంబర్ లో టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ..ఆ తర్వాత ఐదేళ్ళపాటు ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే ఫార్మాట్లలో భారతజట్టు సభ్యుడిగాకొనసాగాడు.ఇంగ్లండ్ వేదికగా ముగిసిన 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ ప్రత్యర్థిగా తన ఆఖరి అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత నుంచే ధోనీ రిటైర్మెంట్ పై ఊహాగానాలు జోరందుకొన్నాయి. కొద్దివారాలపాటు తనకుతానుగా క్రికెట్ కు దూరమై…భారత సైనికదళాలకు సేవలు అందించాడు. రిటైర్మెంట్ ఊహాగానాల నడుమే…
ఐపీఎల్ 13వ సీజన్ కు సన్నాహాలు ప్రారంభించాడు. ఆస్ట్ర్రేలియా వేదికగా జరగాల్సిన 2020 టీ-20 ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాలని భావించినా..కరోనా మహమ్మారి దెబ్బతో అంచనాలు తలకిందులయ్యాయి.టీ-20 ప్రపంచకప్ సైతం రద్దుల పద్దులో చేరిపోడంతో…వేరే దారిలేని ధోనీ అర్థంతరంగా తన అంతర్జాతీయ కెరియర్ ను ముగించక తప్పలేదు.
భారత్ కు 350 వన్డేలు, 98 టీ-20 మ్యాచ్ ల్లో ప్రాతినిథ్యం వహించిన ధోనీకి …కెప్టెన్ గా 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలుఅందించిన అరుదైన ఘనత, రికార్డులు ఉన్నాయి.మొత్తం 350 వన్డేల్లో 10 వేల 773 పరుగులతో 50.57 సగటు సాధించిన ఘనత ఉంది. ఇందులో 10 శతకాలు, 73 అర్థశతకాలు ఉన్నాయి.98 టీ-20 మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలతో సహా 1617 పరుగులతో 37.60 సగటు సాధించాడు.ఐదో భారత క్రికెటర్ ధోనీ…2019 జనవరిలో 10 వేల పరుగుల వన్డే క్రికెట్ మైలురాయిని చేరడం ద్వారా ధోనీ అరుదైన ఘనతను సాధించాడు. ఈ రికార్డు సాధించిన ఐదవ భారత క్రికెటర్ గా నిలిచాడు.

CH.V.KRISHNA RAO – SPORTS EDITOR

రాజ‌స్థాన్‌తో రాహుల్‌కు రాచ‌క‌ళ‌…

న్యూఢిల్లీ, ఆగస్టు 21

రాజస్థాన్ రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ కు కొంత ఊపిరి పోసినట్లే చెప్పాలి. కాంగ్రెస్ నాయకత్వం పట్ల కూడా నేతల్లో నమ్మకం ఏర్పడింది. .కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు ఇష్టపడని రాహుల్ గాంధీ సచిన్ పైలట్ విషయంలో చూపిన చొరవను కూడా పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. సచిన్ పైలట్ కు రాహుల్ గాంధీ ఎలాంటి హామీలు ఇచ్చారన్న విషయం పక్కన పెడితే ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.
వరసగా చేష్టలుడిగి చూస్తూ కమలం పార్టీకి రాష్ట్రాలను ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్ రాజకీయ పరిణామాలు పెద్ద రిలీఫ్ ఇచ్చాయనే చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కన్నేసింది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి అత్యంత సులువుగా మారింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాలును బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది.మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్ ను చావుదెబ్బతీసి పవర్ లోకి వచ్చింది.

రాజస్థాన్ రాజకీయాల్లో అనిశ్చితి ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్ చేజారి పోతుందని అందరూ భావించారు. కానీ అందరు అంచనాలను తలకిందులు చేసి కాంగ్రెస్ రాజస్థాన్ లో నిలదొక్కుకోవడం పార్టీకి ఎంతో రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అసంతృప్తితో బయటకు వెళ్లిపోయిన సచిన్ పైలట్ ను తిరిగి రప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి

.రాజస్థాన్ తర్వాత టార్గెట్ మహారాష్ట్ర అని కమలనాధులు బాహాటంగా చెప్పకపోయినా వారి అడుగులు అవే చెబుతున్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసి మహారాష్ట్రలో చేజారిన అధికారాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని బీజేపీ భావించింది. శివసేనతో మళ్లీ కలసి ప్రయాణం చేసేందుకు కూడా బీజేపీ సిద్ధమయింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను సయితం బీజేపీ దువ్వింది. అయితే రాజస్థాన్ రాజకీయ పరిణామాలతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వానికి కొంత బలం చేకూరిందని చెప్పాలి


రీమేక్‌ల జోరులో వ‌కీల్ సాబ్‌..


హైద్రాబాద్, ఆగస్టు 21
పవన్ కళ్యాణ్ కి సినిమా ల విషయంలో మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా త్రివిక్రమే. పవన్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత త్రివిక్రమ్ జనసేనకు పవన్ స్పీచ్ కి మాటలు రాసాడని టాక్ ఉంది. తర్వాత రాజకీయాల్లో పవన్ బిజీ అయ్యాక.. త్రివిక్రమ్ సినిమాల్లోకి వచ్చేసాడు. అయితే అప్పట్లోమెగా ఫ్యామిలీ కి ఇష్టం లేకుండా పవన్ జనసేన పార్టీ పెట్టాడని.. దానికి తివిక్రమ్ హెల్ప్ ఉందని… అందుకే మెగా హీరోల ఛాన్స్ లు త్రివిక్రమ్ కి రావని ప్రచారం జరిగింది.

మధ్యలో పవన్ రాజకీయాల్లో త్రివిక్రమ్ నాకు హెల్ప్ చెయ్యలేదు అంటూ త్రివిక్రమ్ మీద మచ్చ లేకుండా మాట్లాడాడు. తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమాలు చేసాడు అది వేరే విషయం.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ చెబితేనే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం వేణు శ్రీరామ్ కన్ఫర్మ్ చేసాడు. త్రివిక్రమ్ పింక్ రీమేక్ చెయ్యమని త్రివిక్రమ్ సూచించబట్టే పింక్ రీమేక్ వకీల్ సాబ్ చేస్తున్నాడు.

ఇక తాజాగా త్రివిక్రమ్ మరో రీమేక్ పవన్ ని చెయ్యమని చెప్పినట్టుగా సోషల్ మీడియా టాక్. పవన్ కళ్యాణ్ ని మలయాళ రీమేక్ అయ్యప్పన్ కోషియం రీమేక్ చెయ్యమని త్రివిక్రమ్ చెప్పాడట. ఎందుకంటే హారిక అండ్ హాసిని వారి ఓన్ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ వారే అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ రైట్స్  కొన్నారు. ఆ సినిమా చూసి  పవన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని త్రివిక్రమ్ చెప్పాడని.. ఈ రీమేక్ ని పవన్ సూచనలతో త్రివిక్రమ్ తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి చేతిలో పెట్టనుననట్లుగా ఫిల్మ్నగర్ టాక్.

అయితే పవన్ మాత్రం త్రివిక్రమ్ ఏది చెప్పినా చేస్తాడని.. ఇక ఈ సినిమాలో మరో పాత్రకి తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉన్నట్లుగా టాక్.  వకీల్ సాబ్ పూర్తయ్యి, క్రిష్ సినిమాని, హరీష్ శంకర్ సినిమాలు పూర్తయ్యాకే ఈ మలయాళ రీమేక్ పట్టాలెక్కుతోంది అని అంటున్నారు

పాతాళ భైరవి కి 70 ఏళ్ళా..,


ఏడు దశాబ్దాల తీపి జ్ఞాపకాల తేనెపట్టు.
పాతాళ భైరవి సినిమాకు 70 ఏళ్ళా అని ఆశ్చర్యపోయాను..నిత్యనూతనంగా,నిత్యవసంతంలా,అమృతం తాగిన అప్సరసలా ఎంత అద్భుతంగా వుంది..ఈ సినిమా సూపర్ సీనియర్…Old is gold…Gold is always Gold…ఈ సినిమా గురించి నా ఆలోచనలు మీతో పంచుకోకుండా ఎలా…అసలు ఇంత అద్భుతమైన సినిమా రావడానికి,ఇంతకాలం ఇందరి హృదయాలను ఏలడానికీ,నా హృదయం కొల్లగొట్టడానికీ కారణం ఏమిటా అని ఆలోచిస్తే ఇద్దరే ఇద్దరు కనిపించారు…

ఒకరు కె.వి.రెడ్డి, రెండు పింగళి…కె.వి.దర్శకత్వ ప్రతిభ పింగళి వారి పాండితీ ప్రకర్ష రెండూ కలగలిపి పోటాపోటిగా ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టాయి అనటానికి నిదర్శనం పాతాళభైరవి.యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యం, ఘంటసాల సంగీతం, పాటలు దీనిని చరిత్ర లో చిరస్థాయిగా నిలిపేందుకు మరింత దోహదం చేసాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.కాశీ మజిలీ కథలు, అల్లాద్దీన్ కథలప్రేరణతో ఈసినిమాకు కథను తయారు చేసినా కొద్దిగా రామాయణ పోకడలు నాకు కనిపించాయి..

ఉదాహరణకు రాజు గారి తోటరాముడిని బంధించి విడుదల చేసిన తరువాత ఇంటికి వస్తాడు.అప్పుడు రాముడితల్లి అతనితగిలిన గాయాన్ని తుడుస్తూ బాధ పడుతుంటే అంజి డైలాగ్ వుంటుంది.. మహారాజు గురించి..”సాక్షాత్తు జనకమహారాజే పిన్నీ!ఉరిదీయకుండా ఉపదేశం చేసి పంపించాడు”అని…”అమ్మా దీవించి పంపమ్మా”అని రాముడు అన్నప్పుడు అంజిచేత,తల్లిచేత ఒక డైలాగ్ అనిపిస్తారు..”సాక్షాత్తు శ్రీరామచంద్రుడంతటివాడివై సీతామహాలక్ష్మిని తీసుకురా”అని…పాతాళభైరవి సాయంతో మాంత్రికుడు రాకుమార్తెను తాకకుండానే మాయమవటం, రాకుమారి లంకలో సీతమ్మలా ఆభరణాలు, ఎటువంటి అలంకారాలు లేకుండా,నిరాహారంగా రాముడికోసం శోకిస్తూ వుండటం,ఆమె చుట్టూ లంకలో రాక్షసుల్లాంటి ఆడవాళ్ళను కావలి వుంచటం,చివరకు తోటరాముడు అంజి(ఆంజనేయుడి పేరేగా)సాయంతో రాక్షసుడిని సంహరించి రాకుమార్తెను రాజ్యానికి తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం..అయితే రామాయణంలో వనవాసంలో వుండగా సీతమ్మవారిని రావణుడు ఎత్తుకువెళతాడు…
అదొక్కటే చిన్నతేడా..ఇక ఈ చిత్రంతో బాలకృష్ణ పేరు జనాల్లో అంజిగా స్థిరపడిపోయింది…ముఖ్యంగా పింగళి వారి మాటలు,పాటలు జవజీవాల్లా ఈ చిత్రవిజయానికి దోహదం చేసినయ్యంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు..”సాహసం సేయరా డింభకా,””నరుడా ఏమి నీ రికా,”
“జనం అడిగింది మనంచేయవలెనా??మనం చేసింది జనం చూడవలెనా???”ఇక తోటరాముడి తల్లి తరుచుగా వాడే మాట”ఒక కొడుకు నిమ్మంటే రాక్షసుడిని ఇచ్చావేమిరా దేవుడా”…ఇదే డైలాగ్ ని మహేష్ బాబు అతడు సినిమాలో త్రివిక్రమ్ కొంచెం మార్చి వాడాడు”దేవుడా కూతుర్నిమ్మంటే క్వశ్చన్ బ్యాంక్ నిచ్చావు తండ్రి”అని.అలాగే తోటరాముడి ఊతపదం…”నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా”…
దీన్ని మన కళాతపస్వి విశ్వనాథ్ గారు”స్వాతిముత్యం”చిత్రంలో హీరోకి పెట్టారు…”నిజం చెప్పనా-అబద్ధం చెప్పనా”అని కమలహాసన్ అడుగుతాడు…అలాగే రాకుమార్తె గదిలోకి తో.రా వచ్చినప్పుడు చాటుగా పొంచివున్న రా.బా(రేలంగి-రాజుగారి బావమరిది)వచ్చి వెదుకుతూ రాకుమార్తె ప్రశ్నలకు”అంతేగా, అంతేగా”అని సమాధానమిస్తాడు…

దీన్ని F2 సినిమాలో ప్రదీప్ పాత్రకు ఊతపదంగా వాడాడు అనిల్ రావిపూడి..7 దశాబ్దాలుగా ఇన్ని తరాల వారిని ఆ మాటలు ప్రభావితం చేశాయంటే సామాన్యమా!!”సరిలేరు నీకెవ్వరూ పింగళి”అని అనాలికదూ…”గురు,బుల్ బుల్,గుబుల్ గుబుల్,తప్పు తప్పు”ఇలాంటి ఎన్నో మాటలు సామాన్యుల నుండి అసమాన్యుల వరకు ఊతపదాలుగా బహుళ ప్రచారం పొందాయి..అంతేనా…ఈ సినిమాలోని పాటలలో కొన్ని మాటలు సినిమా టైటిల్స్ గా మారి టైటిల్స్ కోసం పడే శ్రమను తగ్గించాయి..”కలవరమాయే మదిలో””ఎంత ఘాటు ప్రేమయో”..ఇలా..
ఇక దర్శకుడు కె.వి.గురించి కె.వి లో కె అంటే కొంటెతనం,వి అంటే వినోదం అన్నది ఈ సినిమాలో బాగా ఎస్టాబ్లిష్ అయింది…
ఇక సినిమా గురించి ఏ టూ జెడ్ తెలిసిన కె.వి.రెడ్డి గారి అంతరంగం తెలిసిన ముఖ్యులుగా పింగళిగారిని,కమలాకర కామేశ్వరరావు గారిని చెప్పుకోవచ్చేమో…

టి.జి.కమలాదేవి పాటలో …”యుగయుగానికొక కథానాయకుడు..”అని అనిపిస్తారు…అంతే కాకుండా “కధానాయకుడి లక్షణం చూపించావోయి”అంటూ విజయీభవ అని ఆమె ఆశీర్వదిస్తుంది..తరువాత అక్కడ గుంపులు గుంపులుగా వున్న జనంచేత”కథానాయకుడికి జై”అని ముమ్మారు జేజేలు కొట్టించి రామారావుని తిరుగులేని కథానాయకుడిగా ఉజ్వలంగా రాణిస్తాడని అక్షరాక్షతలతో పండితోత్తముడు పింగళి,ఎన్.టి.ఆర్ Career కి రాచబాట వేసిన దర్శకదేవుడు కె.వి.ఆశీస్సులు అమోఘంగా ఫలించి రామారావు నటవిశ్వరూపం జనంలో,సినీ జగత్తులో శాశ్వతంగా నిలిచింది…అలాగే మాంత్రికుడి పాత్ర రూపకల్పన..ఎస్.వి.ఆర్. ఓకన్ను చిన్నదిచేసి గడ్డం సవరించుకొనే మానరిజం అతనిలోని క్రూకెడ్ మెంటాలిటికి ప్రతీకగా నిలుస్తుంది…

పాత్రల స్వభావాన్ని బట్టి ఆయా పాత్రల రూపకల్పన తానే స్వయంగా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దే వారు కె.వి…
ముఖ్యంగా హీరో విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు”రామారావు పృష్ఠభాగం ఎత్తుగా వుంటుంది కదా అందుకని ఆ పైజమాను ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేయించారు రెడ్డి గారు”అని డి.వి.నరసరాజుగారు నా ఇంటర్వ్యూ లో చెప్పారు…పుంసాం మోహన రూపాయా అన్నట్టు రామారావుని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో రెడ్డి గారు… ముఖ్యంగా Hair Style… అద్భుతం…కె.వి.మలచిన బొమ్మ రామారావు.. ఎందుకంటే ఏరీకోరీ ఈ పాత్రకు రామారావే కావాలని కోరుకున్నాడు..అందుకే ఆ అభిమానంతోనే రామారావుని అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు.ధైర్యశౌర్యపరక్రమాలకు నిలువెత్తు అద్దంలా పురుషసింహం అనే పదానికి perfect నిర్వచనంలా రామారావుని చూపించడంలో రెడ్డిగారు కృతకృత్యులయ్యారు..హీరోయిజానికి సరికొత్త నిర్వచనాన్ని చెప్పి తెలుగు చలనచిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా ఎన్.టి.ఆర్.ను తీర్చిదిద్దారు కె.వి.అందుగ్గానుప్రారంభంలోనే నాంది పలికారు…

ఈ ఒక్క చిత్రంతోనే నటనా దురంధరుడిగా ఎస్.వి.ఆర్.విజయకేతనం ఎగురవేసారు..తరువాత చాలా సినిమాల్లో మాంత్రికులకు ఇదే స్టైల్ మార్గదర్శకంగా నిలిచిందీ…నాయక, ప్రతి నాయక పాత్రల గ్రామర్ ను తిరగరాసి రాబోయే తరాలకు ఒక కొత్త బాణినీ సృష్టించారు కె.వి…తరువాత కాలంలో వచ్చిన జానపద చిత్రాల్లో అదే ఒరవడి కొనసాగింది…కెఅంటే కొంటెతనంవిఅంటే వినోదం రెండూ జాస్తియే మనరెడ్డి గారికి అని చెప్పాను కదూ…

ఈ సీనే ఉదాహరణ…”అక్కు…అక్కు…”అంటూ పిలుస్తూ రాణీగారి చాటున బ్రతికే తమ్ముడిగా రాజుగారి ప్రాపకంలో బతికే బావమరిది పాత్రలో రేలంగి..”పిల్లి-ఒక పిల్లి-పిల్లి ముందు రెండు పిల్లులు-పిల్లి వెనుక రెండు పిల్లులు-రెండు పిల్లుల మధ్య పిల్లి”…సరదాగా ఉడుకుమోతు మేనమామను ఏడిపిస్తూ రాకుమార్తె పొడుపుకథ… పిల్లుల పొడుపుకధ విన్న రేలంగి ఉక్రోషంతో ఉడికిపోతూ చేసిన చేష్టలు చూసే మాయాబజార్ లో లక్ష్మణకుమారుడి పాత్రకు రెండో ఆలోచన లేకుండా రేలంగిని కె.వి. ఫిక్స్ చేసుంటారు.ఇక జీవికా జీవుల్లాంటి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్పుకోవాలి..
వారే కె.వి..పింగళి…పింగళి నాగేంద్రరావుది పాత్రలస్వభావాల రూపకల్పనలోను, ఊతపదాలు సృష్టించడలోను అందెవేసిన చేయి.
అందువల్లే తొలి చిత్రమైన గుణసుందరి కథతో కె.వి/పింగళి మధ్య ప్రారంభమైన అక్షరానుబంధం పాతాళభైరవి తో అపురూపమై”మాయా బజార్”తో విడలేని అనుబంధంగా మారి భాషా భావంలా కలిసిపోయాయి…. అందుకే పాతాళభైరవి టైటిల్స్ లో మొట్టమొదటి పేరే
కథా,మాటలు,పాటలు”పింగళి నాగేంద్రరావు”అని వేసి అగ్రతాంబూలమిచ్చి తన ఆత్మీయతను వ్యక్తం చేశారు కె.వి…
ఈ చిత్రానికి సంబంధించి ప్రతి నిర్ణయం కె.వి.దే కావటం గమనార్హం…పింగళి గారికి అంతటి సమున్నత స్థానం ఎందుకు ఇచ్చారో ఈ చిత్రంలోని అక్షరంఅక్షరం నిరూపీస్తుంది…అసలు కవి అన్నవాడు సినిమాలోని ఆయాపాత్రల స్వభావాన్ని అర్ధం చేసుకోవాలి..
తరువాత సంభాషణలు కానీ,పాటలు కానీ వ్రాసేటప్పుడు ఆ పాత్రలను ఆవాహన చేసుకొని ఆయా పాత్రల స్వభావానికనుగుణంగా ఆ పాత్రల ఔచిత్యం దెబ్బ తినకుండా రచన చేయాలి…

ఈ విషయంలో పింగళి గురించి ప్రత్యేకంగా చెప్పాలి.సినిమా పాట,మాట ఎలారాయాలో,ఎలారాయకూడదో స్పష్టమైన అవగాహన వున్న రచయిత పింగళి…కొన్ని సందర్భాల్లో అత్యున్నతమైన పాటలు,పద్యాలు రాసి తెలుగు సినిమాకు కావ్యగౌరవం కలిగించిన అభినవ శ్రీనాధుడు…ఇక పింగళి చమత్కారానికి,ప్రతిభకు పట్టంకట్టే మచ్చుతునకల్లాంటి సరదామాటలు,పేర్లు హరమతి,కాలమతి,దైవాధీనం,నిక్షేపరాయుడు,సదాజప,ఏకాశ, రెండు చింతలు,త్రిశోకానందుడు,డింగరి, డింభకా,అక్కూఇంకా చాలా వున్నాయి…లాచిత్రవిచిత్రమైన పదజాలంతో ప్రేక్షకులను మాయజేసి తనవైపు లాక్కొనే మాటల మరాఠీ మన రచయిత పింగళి అంటే ఏమాత్రంఅతిశయెక్తి లేదు…అందుకే ఆయన సంభాషణలు,పాటలతో తబ్బిబ్బైన నేను ఆయనకు ఇచ్చుకున్న బిరుదులు”విచిత్రకవి, విశిష్టకవి”…చిత్రవిచిత్ర పదజాలాల వైతాళికుడు పింగళి…ఆయన కలం స్ప్రశించని సాహితీ ప్రక్రియ లేదు…తన విద్వత్తును జనబహూళ్యంలోకి తీసుకువెళ్ళిన పింగళి కవనం తప్ప కనకం మొహం చూడని శ్రోత్రయ బ్రాహ్మణుడు..ఆయనేమిటి ఆతరంలో దాదాపు అందరూ”దోచుకోవటం-దాచుకోవటం” తెలియని పండితోత్తములే…ఇకముఖ్యంగా ఆయన రాసిన మదిని కలవరపరిచే పాట…”ఎంత ఘాటు ప్రేమయో”…

అక్కడికీ రేలంగికి సందేహమొచ్చి అడిగాట్టా”బ్రహ్మచారై వుండి ఇలాంటి పాటలు ఎలా రాస్తున్నారు”అని…ఆయన సమాధానమేదైనా…”సంసారంలో ఈదులాడేవాడికి ఇంత రసానుభూతి వుంటుందా..”అన్నది నా సందేహం…వుండదుగాక వుండదు అందుకే ఆ పాట సూపర్ డూపర్ హిట్టై ఆల్ టైం మనసులను హిట్టు చేస్తోంది…ఇంతేనా కొంతమందైతే”ఘాటు ప్రేమ ఏమిటండీ పింగళిగారు…ప్రేమకు రంగు,రుచి,ఇంకా వాసన కూడానాపైగా అదో దుష్ట సమాసం…భావప్రకటన కూడా సరికాదు…”అన్నారట”గుడిసెలో వుండే తోటరాముడికి,కోటలోని రాకుమార్తెకి మధ్య పుట్టిన ప్రేమ అది… రాకుమారికి రాముడి ప్రేమ ఘాటుగా అన్పించింది…

అయినా ప్రేమలో పడ్డవాడికి వ్యాకరణమేమిటి…ళ్ళు పాడిందే పాట గానీ…”అని కొంటె సమాధానంతో వాళ్ళ నోటికి తాళం వేసారు పింగళి…ఆ పాట ఆంధ్ర దేశమంతటా ఎంత గొప్పగా మారుమ్రోగిందో చెప్ప నవసరం లేదు…కె.వి,పింగళి గార్ల కాంబినేషన్ ఆరోజుల్లో కళతోపాటు కాసుల వర్షం కురిపించిందిపాతాళభైరవి.. అందుకే ఇది బ్లాక్ అండ్ వైట్ బంగారం…ఇప్పటికే చాలా సుదీర్ఘమైన రైటప్ అయింది… అందుకని”ఎంత ఘాటు ప్రేమయో”పాట గురించి మళ్ళీ మాట్లాడుకుందాం..ఈ సినిమా తమిళంలో కూడా రు,హిందీలో డబ్ చేసారు కూడా…సరదాగా తమిళపాటను చూద్దాం…అటువంటి అందగాడైన రామారావు పక్కన ఒకే ఒక్క సినిమాలో నటించి చరిత్రలో మిగిలిపోయింది”మాలతి”మళ్ళీ మన తెలుగు ఘాటు ప్రేమతో కలుద్దాం… శెలవ్…