Home Blog Page 3

జాతీయ విద్యా విధానం 2020- స‌మ‌స్య‌లు, స‌వాళ్ళు- G.Varalakshmi, Research Scholar, HCU

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నాయ‌క‌త్వంలోని కేంద్ర‌మంత్రి వ‌ర్గం కస్తూరి రంగ‌న్ నివేదిక‌ను జాతీయ విద్యావిధానం 2020గా అమోదించింది. ఇందులో అనేక అనుకూల అంశాల‌తో పాటు స‌మ‌స్య‌లు, స‌వాళ్ళు వున్నాయి. సుమారు 3 ద‌శాబ్దాల త‌ర్వాత భార‌త‌దేశంలో కొన‌సాగుతున్న విద్యావిధానం పైన స‌మీక్ష చేసి అనేక సిఫార‌సుల‌ను చేసిన క‌స్తూరి రంగ‌న్ నివేదిక స‌మ‌కాలీన స‌మ‌స్య‌ల‌కు అద్దం ప‌డుతుంది.ఈ నివేదిక భార‌త‌దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంలో వచ్చింది. దేశంలో అమ‌ల‌వుతున్న నూత‌న ఆర్థిక విధానాల ఫ‌లితంగా విద్యా వ్య‌వ‌స్థ‌లో మార్పులు చేయాల్సిన అవ‌స‌రాన్ని ఈ నివేదిక తేల్చి చెప్పింది.
అత్యంత కీల‌క‌మైన అంశాల‌లో ఒక‌టి – పాఠ‌శాల విద్య వ‌య‌స్సును 3 నుంచి 18 సంవ‌త్ప‌రాలుగా గుర్తించి సూచ‌న‌లు చేయ‌డం. పూర్వ ప్రాథ‌మిక విద్య నుంచి పాఠ‌శాల విద్య పూర్తి అయేంత‌వ‌రకు స‌మ‌గ్ర‌మైన సిఫార‌సులు చేసింది.

పూర్వ ప్రాథ‌మిక విద్య‌ను 0-3 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌ర‌కు త‌ల్లి,పిల్ల‌ల పౌష్టికాహారం, విద్య , ఆరోగ్యం వంటి అంశాలను అంగ‌న్‌వాడి కేంద్రాల‌ను నిర్వ‌హిస్తున్నాయి. మూడు నుంచి 6 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగిన పిల్ల‌ల‌కు స‌రైన విద్య పౌష్టికాహారం వంటి అంశాల‌లో స‌రైన దిశా నిర్ధేశం లేక పోవ‌డం వ‌ల్ల వీరిలో చాలా మంది బాల కార్మికులుగా మారిపోతున్నార‌ని అనేక ప‌రిశోధ‌న‌ల‌లో తేలింది. ప‌లు స్వ‌చ్చంధ సంస్థ‌ల అనుభ‌వం కూడా ఇదే చెబుతోంది. ఈ వ‌య‌స్సులోని వారు పాఠ‌శాల‌లో చేరినా వారికి అక్క‌డ నాణ్య‌మైన విద్య ల‌భించ‌డం లేద‌ని కూడా అనేక అధ్య‌య‌నాల‌లో తేలింది. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా 3-6 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగిన పిల్ల‌ల‌కు ఆట‌పాట‌ల‌తో కూడిన చ‌దువును ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో అందించ‌డంతో పాటు పౌష్టికాహారం అందించాల‌ను కేంద్ర‌ ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఈ వ‌య‌స్సు పిల్ల‌ల చ‌దువుకు సంబంధించిన పాఠ్యాంశాల రూప‌క‌ల్ప‌న చేసే బాధ్య‌త‌ను జాతీయ విద్యా, ప‌రిశోథ‌న‌, శిక్ష‌ణా సంస్థ (ఎన్‌సిఆర్ టి) కు అప్ప‌గించారు

మూడు నుంచి 6 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వారిని గుర్తించి నాణ్య‌‌మైన విద్య‌కు పునాది వేయ‌డం స‌రైన నిర్ణ‌యం అయినప్ప‌టికీ 3-18 సంవత్స‌రాల వ‌య‌స్సు వారిని ప్రాథ‌మిక నిర్భంధ విద్య చ‌ట్టం 2009 లో చేర్చ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ విద్యా విధాన నిర్ణ‌యం విమ‌ర్శ‌ల‌కు చోటిచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన 60 ఏళ్ళ త‌ర్వాత ఉచిత నిర్భంధ ప్రాథ‌మిక చ‌ట్టం 2009 వ‌చ్చింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం దేశంలోని 6-14 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ్ర‌ప‌తి బాల‌బాలిక‌ల‌కు ప్రాథ‌మిక విద్య రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన హ‌క్కు. జాతీయ విద్యా విధానం 2020లో పాఠ‌శాల విద్య‌ను 3-18 సంవ‌త్స‌రాలుగా విధాన నిర్ణ‌యం తీసుకోవ‌డం వ‌ల్ల ఉచిత నిర్భంధ ప్రాథ‌మిక విద్యా చ‌ట్టం 2009 పై అనేక ప్ర‌శ్న‌లు తెలెత్తుతున్నాయి. ఈ నిర్ణ‌యం వ‌ల్ల 2009 విద్యా హ‌క్కు చ‌ట్టం అలాగే కొన‌సాగుతుందా, ర‌ద్దు చేస్తారా లేక ఈ చ‌ట్టాన్ని 3-18 సంవ‌త్స‌రాల‌కు పొడిగిస్తారా అనేది ప్ర‌శ్నార్థ‌కంగా వుంది.
ఉన్న‌త విద్య‌కు సంబంధించిన 4 సంవ‌త్స‌రాల కాలంలో ఏ సంవ‌త్స‌రంలోనైనా విద్యార్థి చ‌దువు నుంచి నిష్క్ర‌మించ‌డం వ‌ల్ల స‌ర్టిఫికెట్ ను , రెండు సంవ‌త్స‌రాలు పూర్తి చేస్తే డిప్లొమాను, మూడు సంవ‌త్స‌రాలు పూర్తి చేస్తే ప‌ట్టాను (డిగ్రీ), నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేస్తే స‌మీకృత ప‌ట్టా (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ) పొంద‌వ‌చ్చు. ఈ విధానంలో 1,2 సంవ‌త్స‌రాల‌లో పొందిన స‌ర్టిఫికెట్ వ‌ల్ల ఉపాధి అవ‌కాశాలు వుంటాయా? అన్న‌ది ఒక ప్ర‌శ్న కాగా, రెండ‌వ‌ది విద్యార్థికి విష‌య ప‌రిజ్నానం పైన ప‌ట్టు వుంటుందా?ఉన్న‌త విద్య‌కు సంబంధించి ఈ విద్యా విధానం ద్వారా జాతీయ స్థాయిలో ఉన్న‌త విద్యామండ‌లి రానున్న‌ది. ఈ మండ‌లి కింద ఉన్న‌త విద్య నియంత్ర‌ణా సంస్థ‌, జాతీయ అకాడ‌మి, అక్రిడేష‌న్ మండ‌లి, జాతీయ నిధుల కేటాయింపు సంస్థ‌, సాధార‌ణ విద్యా మండ‌లి అనే నాలుగు కొత్త సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌బోతున్నారు.
ఉన్న‌త విద్య‌కు సంబంధించి ఈ విద్యా విధానం ద్వారా జాతీయ స్థాయిలో ఉన్న‌త విద్యామండ‌లి రానున్న‌ది. ఈ మండ‌లి కింద ఉన్న‌త విద్య నియంత్ర‌ణా సంస్థ‌, జాతీయ అకాడ‌మి, అక్రిడేష‌న్ మండ‌లి, జాతీయ నిధుల కేటాయింపు సంస్థ‌, సాధార‌ణ విద్యా మండ‌లి అనే నాలుగు కొత్త సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌బోతున్నారు. ఇన్ని సంస్థ‌ల వ‌ల్ల ఉన్న‌త విద్య కేంద్రీకృతమ‌వుతుందా అనే సందిగ్దం త‌లెత్తుతోంది. గ‌త అనుభ‌వాల దృష్టిలో వుంచుకుని చూసిన‌ప్పుడు ఉన్న‌త విద్యా నియంత్ర‌ణ కు సంబంధించిన సంస్థ‌ల‌న్నీ దేశ రాజ‌ధానిలో కేంద్రీకృత‌మవ‌డం వ‌ల్ల ఉన్న‌త విద్య‌లో నాణ్య‌త లోపించింది అనే విమ‌ర్శ .

2020 జాతీయ విద్యా విధానం ముందుకు తెచ్చిన మ‌రో ముఖ్య‌మైన అంశం నైపుణ్యాల‌ను పెంపొందించ‌డం‌, వృత్తి విద్య‌ల‌ను ప్రోత్స‌హించ‌డం. వీటి ద్వారా వీటిని అభ్య‌శించిన వారిని స్వ‌యం ఉపాధి కొర‌కు ప్రోత్స‌హించ‌డం లేద‌క కార్పొరేట్ రంగానికి కావ‌ల‌సిన నైపుణ్య ం క‌లిగిన శ్రామిక శ‌క్తిని త‌యారు చేయ‌డ‌మా అనే ప్ర‌శ్న లేవ‌నెత్తుతున్నారు. కాలం గడుస్నున్న కొల‌దీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు త‌గ్గిపోవ‌డం వ‌ల్ల వృత్తి విద్య‌ల‌లో నైపుణ్యం పొందిన వారికి ప్ర‌భుత్వం ఉద్యోగం దొర‌క‌డం క‌ష్ట‌మ‌వుతోంది. క‌నుక స్య‌యం ఉపాధి ద్వారా సాంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన చేతి వృత్తి సేవ‌ల్లో ఉపాధి అవ‌కాశాలు సృష్టించుకోవ‌డం లేక ప్రైవేటు కార్పొరేట్ రంగంలో శ్రామికుడిగా ఉపాధి పొంద‌డం ద్వారా వ‌చ్చే ఆదాయం త‌క్కువ‌గా వుండ‌డ‌మే కాకుండా, చాకిరి చాలా ఎక్కువ‌గా వుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వృత్తుల‌ను వ‌ద‌లివేసిన వారు ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స వ‌చ్చి ఇటీవ‌ల క‌రోనా సంక్షోభంలో ఎంత ఇబ్బ ంది ఎదుర్కొన్నార‌న్న విష‌యం ప్ర‌పంచానికంతా తెలుసు. అందు వ‌ల్ల వృత్తి నైపుణ్యం పొందిన వారికి వున్న ఒకే ఒక ఉపాధి అవ‌కాశం కొర్పొరేట్ రంగం మాత్ర‌మే.

ఫ‌లితంగా వృత్తి నైపుణ్యం పొందిన వారి నుంచి ప్రైవేటు కార్పొరేట్ రంగా పెద్ద ఎత్తున ప్ర‌యోజ‌నం పొంద‌నుంది.
అదే విధంగా దేశ ఆర్ఙిక‌వ్య‌వ‌స్థ పెద్ద ఎత్తున ప్రైవేటుప‌రం అవుతున్న ందు వ‌ల్ల విద్యా రంగం కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. ఒక ప‌క్క ప్రైవేటు మ‌రొక ప‌క్క ప్ర‌భుత్వ రంగ ఉన్న‌త విద్యా సంస్థ‌లు పోటీప‌డ‌డం తో పాటు విదేశీ విద్యా సంస్థ‌ల‌తో కూడా పోటీప‌‌డంతో పాటు విదేశీ సంస్థ‌ల‌తో కూడా పోటీ ప‌డ‌వ‌ల‌సి వుంటుంది. ప్ర‌భ‌త్వ విద్యా సంస్థ‌ల‌లో విద్య నాణ్య‌తా ప్ర‌మాణాలు పెంచ‌డానికి మౌలిక స‌దుపాయాలు పెంచ‌డంతో పాటు బోధ‌నా సిబ్బంది నియాయ‌కం కీల‌క‌మైన‌ది. ఈ విద్యా విధానం ద్వారా దేశంలోని ప్ర‌తి జిల్లాలో విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటు కాబోతుంది. ప్ర‌స్తుతం ఉనికిలో వున్న విద్యా సంస్థ‌ల‌లో కొన్ని సంవ‌త్స‌రాలుగా నియామ‌కాలు లేక‌పోవ‌డం వ‌ల్ల సుమారు 30-40 శాతం బోధ‌నా సిబ్బంది పోస్ట‌లు ఖాళీగా వున్న‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.
ఈ స‌మ‌స్య‌లు, స‌వాళ్ల‌తో పాటు ఈ విద్యా విధానంలో ఇంకా కీల‌క‌మైన అంశాల‌పైన లోతుగా చ‌ర్చింది ఈ విధానాల‌ను అమ‌లు చేయ‌డానికి జారీ చేసే ఆచ‌ర‌ణాత్మ‌క నియ‌మ నిబంధ‌న‌ల‌లో వివర‌ణాత్మ‌కంగా స్ప‌ష్టం చేయాల్సి వుంది.

జి.వ‌ర‌ల‌క్ష్మి
రీసెర్్చ స్కాల‌ర్‌
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్‌
యూనివ‌ర్శిటీ ఆఫ్ హైద‌రాబాద్‌

బాలసుబ్ర‌హ్మ‌ణ్యం లేడు అంటారేంది… రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

రాత్రినుంచి ఒక‌టే టెన్ష‌న్‌..
కాలు కింద‌పెడ‌తాంటే మెడాల‌మీద తెలీని ఒత్తిడి..
మెద‌డంతా మొద్దుబారిన‌ట్టు, గుండె ప‌గిలిపోతాందేమో అనుకున్య‌ట్లు ఒక‌టే బాధ‌. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంగారికి బాగ‌లేదు, క‌ష్ట‌మేమో అనుకున్య‌ప్పుడు.. క‌మ‌ల్‌హాస‌న్ చూడ‌టానికి పోయినాడ‌నే వార్త విని భ‌య‌మేసి ఫేస్‌బుక్‌, ఛానెళ్లు క‌ట్టిపెట్టి భ‌య‌ప‌డిపోయి ప‌డుకున్యా. మాయ‌మ్మ చ‌నిపోయిన రోజు ఎలా భ‌య‌ప‌డ్డానో.. అట్ల‌నే బాలుగారి గురించి బాధ‌ప‌డ్డాను. బువ్వ తిన‌బిద్ధి కాలేదు. ఇంత‌లోనే వాట్స‌ప్పులో బాలుగారి ప్రొఫెల్ చూసి గుండెప‌గిలిపోయింది. దిక్కుతోచ‌ని ప‌రిస్థితి.

అస‌లు నేనెందుకు బాధ ప‌డాలి..
ఆయ‌న నా బంధువు కాదు.. ఫ్రెండు కాదు.. మార్గ‌ద‌ర్శ‌కుడూ కాదు.. నా ఓన‌రూ కాదు. ఆయ‌న్ని ఎందుకు అంత‌గా ఓన్ చేసుకున్యానంటే.. తెలీదు. ఆయ‌న నా ఆత్మ‌బంధువు.
1995ల్లో రాత్రిళ్ల పూట‌ బువ్వ‌తిని అర‌గ‌ల‌మింద కూకోని య‌వ్వారాలు కొడ‌తాంటే.. మా ప‌క్కింటి అనంత‌మ్మ‌వ్వ రాజావ‌లీ.. ఆ రేడియో పెట్టు జాన‌ప‌ద‌పాట‌లు వ‌చ్చాయేమో ఇంటా అనేది. రేడియో ఆన్ సేచ్చే.. గానం ఎస్‌.పీ.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం-జాన‌కి పాడిన యుగ‌ళ‌గీతం అని తొలిసారి ఇన్యా. అట్ల నాకు బాలు ప‌రిచ‌య‌మైనాడు. మా క‌డ‌ప రేడియో స్టేష‌ను ఎప్పుడు పెట్నా.. గానం ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం-ఎస్పీ శైల‌జ‌.. ఎస్పీబాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం-చిత్ర అంటూ ఇన‌ప‌చ్చాండ‌. యా పాట‌లో చూసిన బాలు పేరు ఉంటాండ్య‌. ఏ పాట పాడిన బాలుదే అనుకుంటాంటి.

పెద్ద‌బ‌ళ్లో చ‌దువుతాండేట‌ప్పుడు.. గోళిగుండ్లు ఆడివ‌చ్చి కాళ్ల‌కు, చేత‌ల‌కుండే మ‌ట్టి గ‌బ‌గ‌బా క‌డుక్కోని, హ‌వాయి చెప్పులు కాళ్ల‌కు త‌గిలిచ్చుకోని టీవీల‌కాడికి ప‌రిగిత్తాంటి. ఈటీవీలో వ‌చ్చే పాడుతా తీయ‌గా ఎవురూ పెట్టోటోళ్లు కాదు. చానామంది సిన్మాలు చూసేవాళ్లు. పాడుతా తీయ‌గా ఎవురింట్లో వ‌చ్చాంటాదో ఆడ‌నే కూకుంటాంటి. కండ్ల‌తో బాలు స‌ర్‌ను చూడ‌టం, ఆయ‌న చెప్పే క‌రెక్ష‌న్లు.. అన్నింటికంటే పాట‌ల‌ర‌చ‌యిత‌, సంగీత ద‌ర్శ‌కులు, డైర‌క్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్ల గురించి ఆయ‌న చెప్పే మాట‌ల‌కోస‌ర‌మే సూపెట్టుకుంటాంటి. ఆ టైములో కొంద‌రు అట్ల చాన‌లు మార్చేవాళ్లు. వాళ్ల‌ను తిట్టుకుంటాంటి. మా ఇంట్లో టీవీ వ‌చ్చినాక మంచంమింద ప‌డుకోని నిమ్మ‌ళంగా మా బీపీఎల్ బ్లాక్ అండ్ వైట్ టీవీలో పాడుతా తీయ‌గా సూచ్చాంటి. అట్ల సూడంగా సూడంగా పెద్దోన్న‌యితి. హైద‌రాబాద్ వ‌చ్చి. జాబ్ సేచ్చి.నాకు బిడ్డ పుట్టినాది. అయినా పాడుతా తీయ‌గా వ‌చ్చానే ఉంది. బాలుని అట్ల‌నే సూచ్చాన‌. చ‌క్కెర‌పోసిన‌ట్లుండే ఆయ‌న తేనెమాట‌లు, తెలుగు మాట‌ల‌ను ప‌లికే విధానం, ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఆయ‌న హాస్యం, ఆయన హుందాత‌నం, సింగ‌ర్ల‌కు ఏసే మాట‌ల మొటిక్కాయ‌లు.. చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వు. ఓ పెద్ద త‌రామంచిగా తెలుగుపాట‌కు ప్రాణం పోసినాడు. ఆ ఆటిట్యూడ్ అంటే నాకు చ‌చ్చేంత ఇష్టం.

బాలు అంద‌రికీ న‌చ్చుతాడు.. అంద‌రివాడు.
ఏ రేడియో, టీవీ, ఏ మంచి సినిమా చూసినా బాలు పాట ఇన‌ప‌డ‌తాది.
ఆయ‌న డ‌బ్బింగ్ అంటే నేను ప‌డిచ‌చ్చిపోతా. క‌మ‌ల్‌హాస‌న్ జీవిస్తే.. దానికి ప్రాణం పోసింది బాలునే క‌దా. మ‌నం చానా సినిమాలు చూసిన్లా. బాల్యంలో, టీనేజ్‌లో, డిగ్రీలో, ఉద్యోగం వ‌చ్చినాక‌.. నా ప్ర‌తి సంతోషంలోనూ, నా ప్ర‌తి బాధ‌లోనూ నా వాడిలా క‌న‌ప‌చ్చినాడు. నా ఫ్రెండులా క‌న‌ప‌న్యాడు. మా నాయినలా, మా అమ్మ‌లా, మా తోడుబుట్టువులా, మా అయివారులా క‌న‌ప‌చ్చినాడు. నా జీవితంలోని ప్ర‌తి మ‌లుపులో బాలు ఉన్యాడు. తీవ్ర మాన‌సిక ఒత్తిడికి లోన‌యిన‌ప్పుడు ఓ కుటుంబ‌స‌భ్యుడిలా పాట‌తో ఓదార్చి వైద్యం చేసినాడు. బాధ‌లో ఉన్య‌ప్పుడు త‌న గానంతో ఈ జీవితంలో ఏదో ఉందిప్పా అంటూ ఫ్రెండులాగా జీవితం మింద ప్రేమ‌ను పెంచినాడు. అట్లాంటి.. బాలును నేనెట్ల మ‌ర్చిపోతా చెప్పు?

సీనియ‌ర్ ఎన్టీయార్‌, బాల‌య్య‌, హ‌రిక‌క్రిష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీయార్‌..అక్కినేని, నాగార్జునచిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌.. ఇట్లా ఎవ‌రికి పాడినా.. ఏ త‌రానికి పాడినా ఆ హీరో గొంతుగానే అనిపించేది. అదీ ఆయ‌న గొప్ప‌త‌నం. ముత్యాలు వ‌స్తావా..అంటా గొంతుతో మిమిక్రీ చేయ‌డం ఆయ‌న‌కే వ‌చ్చు. ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో ఏక్ దుజియే లియే సినిమాలో పాట‌లు పాడితే అక్క‌డోళ్లంతా బెదురుకున్యారు. తెలుగాయ‌ప్ప హిందీలో ఇట్ల పాట‌లు పాడ‌తాడా, ఇంత స్ప‌ష్టంగా అని.
బాలుగారు పాట‌గాడే కాదు.. స్వ‌ర‌క‌ర్త కూడా!మంచి న‌టుడు.. అద్భుతంగా డ‌బ్బింగ్ చెబుతారు. సాహితీ ప్రేమికుడు!నిర్మాతగా మంచి సిన‌మాలు తీసినాడు.ఆయ‌న్ని సూచ్చే పుంభావ స‌ర‌స్వ‌తి ఆయ‌న క‌డుపులో కొలువై ఉండాది అనిపిచ్చేది. దేవుడు ఇట్లాంటి మ్యానిఫ్యాక్చ‌రింగ్ ప్ర‌పంచంలోనే చేయ‌లేదు అనిపిచ్చాది. అంత గొప్ప‌వ్య‌క్తి. ఆయ‌న ఏ పాట‌లు పాడినా మా వాడు అని అంటారు. తమిళోళ్లయితే బాల‌సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌ అంటూ రాసుకుంటారు. మ‌నం సిగ్గుప‌డాలి. తెలుగువాడై ఉండి తెలుగువాళ్లు ఆయ‌న్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదేమో అనిపిచ్చాది. మీడియాలో నా సీనియ‌ర్లు, మా క్యాస్టు కాద‌ని ఇత‌రులు.. ఆయ‌న అంద‌రినీ తొక్కేశాడంటూ ఏడ్చేవారు. ఎందుకు ఏడుస్తారో అర్థ‌మ‌య్యేది కాదు. ఆయన తెలుగువాడిగా పుట్ట‌డం తెలుగువాళ్లు చేసుకున్న పుణ్యం.

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారు ఈటీవీ కార్య‌క్ర‌మాల్లో పాడుతుంటే నాకు ఏ క్రికెట్‌, ఏ మంచులూ, అస‌లు బువ్వ కూడా ఆక‌ల‌య్యేది కాదు. ఆయ‌న స్వ‌రం ఆక‌లిని కూడా మాన్పిచ్చాది. ఇళ‌య‌రాజా, కె.వి.మ‌హ‌దేవ‌న్‌, రాజ్ కోటి.. ఎవ‌రి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో అయినా.., కె.విశ్వ‌నాథ్‌, భార‌తీరాజా, వంశీ.. ఇట్ల ఏ మంచి ద‌ర్శ‌కుడిని చూసినా బాలు పాట‌లేనిదే వాళ్ల సినిమాల్లేవు, వాళ్ల పాట‌లూ లేవు. పాట‌ల‌న్నీ ఆయ‌నే పాడాడ‌ని కొంత‌మంది ఏడుచ్చారు. 50 ఏండ్ల‌ల్లో 40 వేల పాట‌లు పాడ‌ట‌మంటే ఓ ప్ర‌పంచ రికార్డే. ఆయ‌న పాడిన‌న్ని పాట‌లు, 16 భాష‌ల్లో భూమ్మీద ఎవురూ పాడ‌ల్య‌. అదీ ఈ బాలుడి రికార్డు!

టీవీ9లో ప‌నిచేసేప్పుడు నాంపల్లి తెలుగు ల‌లిత‌క‌ళాతోర‌ణంలో ఓ ప్రోగ్రామ్ జ‌రిగినాది. అదే చివ‌రి కాన్సెర్టు బ‌య‌ట అనే మాట ఇని ఎలాగైనా చూడాల‌ని బంజార‌హిల్స్ నుండి బైకులో, బ‌స్సులో, ఉరికిత్త పోయింది మొన్న‌నే అనిపిచ్చాంది. ఆ పొద్దు బాలు పాట‌లు విని ఆయ‌న‌తో మాట్లాడ‌టానికి ఎంతో ప్ర‌య‌త్నించినా కుద‌ర‌ల‌. బాలు పాట ద‌గ్గ‌ర‌గా చూడ‌టం చాలు ఈ జ‌న్మ‌కు అనుకున్యా.

2018 ఆగ‌ష్టు 18 వ తేదీన‌
ఈనాడు వ‌సుంధ‌ర ఇంచార్జి, మా సీనియ‌ర్ వీరూ స‌ర్ బాలుగారి ఇంట‌ర్వ్యూకు పోతాంటే తెల్చింది. వీరూ స‌ర్ కి ఫోన్ చేస్తే ర‌మ్మ‌న్నారు. ఆ పొద్దు బాలుగారి ఎదుట కూర్చోని, ఆయ‌న మాట‌ల‌న్ని రికార్డు చేసుకున్యా. ఆ మాట‌లు ఇప్ప‌టికీ విన‌ప‌డుతున్నాయి. శివ‌రంజ‌ని పాట ఆయ‌న పాడుతోంటే ఎదురుగా కూర్చోని ఇన‌టం నా పూర్వ‌జ‌న్మ‌సుకృత‌మే అనిపిచ్చినాది. ఆయ‌న ముఖ‌వర్ఛ‌స్సు, ఆయ‌న సునిశిత‌హాస్యం.. అద్భుత‌హా. మాట‌ల్లో చెప్ప‌ని ఆనందం. ఆ గంట‌న్న‌ర పాటు శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని ఆయ‌న ఇంట్లో కూర్చున్య‌ట్లు కాదు.. ఓ దీవిలో దివ్య‌త్వం పొందిన‌ట్లు అనిపిచ్చినాది. ఆ పొద్దు మాది సింహాద్రిపురం. ప‌ద్మ‌నాభం వాళ్ల ఊరు అంటే.. అయ్యో నాకు తెలుసు. సింహాద్రిపురం. మ‌హానుభావుడు ప‌ద్మ‌నాభం గారు ఎన్ని సార్లు డ‌బ్బులు ఇచ్చారో అంటూ న‌మ‌స్కారం పెట్టినారు. అదీ బాలులోని గొప్ప‌ద‌నం. ఆ పొద్దు ఆయ‌న తొలిసారి స్టార్ హోట‌ల్‌లో తాగిన చాయి, కోక్‌, తొలి 150 రూపాయ‌ల పారితోషికం.. ఎన్నో విష‌యాలు .. ఆయ‌న జీవితాన్ని క‌ళ్ల‌ముందే కూర్చోని ఇన‌టం నా అదురుష్టం.

నేను ఓ క‌విత‌రాయాల‌న్నా..
క‌థ రాయాల‌న్నా.. ఆయ‌న పాట‌తో ఓ కొత్త శ‌క్తి వ‌చ్చేది.
కోపం చ‌ల్లారాల‌న్నా..
ఉదయం ఆహ్లాద‌క‌రంగా ఉండటానికి నా గానా, జియో శావ‌న్ యాప్‌లో ఆయ‌న నాతో పాటు కాలి న‌డ‌క‌న న‌డిచేవాడు.
రోజు దివ్య‌త్వంగా ఉండాలంటే నా గుండెలోకి బాలు పాట ఇంకాల్సిందే.
పొర‌పాటున రిపోర్టింగు లేదా ఇత‌ర బిజీతో బాలు పాట ఇన‌కుంటే .. ప‌డుకుండేట‌ప్పుడైనా యూట్యూబ్‌లోని జ్యూక్ బాక్స్‌లో బాలు పాట వినాల్సిందే. లేకుంటే పొద్దుపోదు. నిద్ద‌ర రాదు. ఆయన పాటే నాకు అమ్మ‌పాట‌!

బాలు పాడిన పాట ఏది బాగుంటాదంటే.. ఓ అభిమానిగా నేను చెప్ప‌లేను. చెప్ప‌టానికి త‌క్కువొచ్చా కూడా. బాలు.. బాలు.. బాలు.. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం! ఈ పేరు ఎన్నోకోట్ల‌మందికి ద‌గ్గ‌ర‌గా ఉండొచ్చు. అయినా నాకు అంద‌రికంటే నాకే ద‌గ్గ‌ర అనుకుండే ఓ పిచ్చి అభిమానిని. ఆయ‌న లేడంటే నాకు కాళ్లూ, చేతులు ఆడ‌డం లేదు. మైండు బ్లాంకు అయినాది.
మ‌ళ్లా.. దేవుళ్లంద‌రూ ఒక్క‌టైనా అట్లాంటి పాట‌గాడిని పుట్టించ‌లేరు.
బాలు ఇక లేడు అనే మాట నేను న‌మ్మ‌ను.
అస‌లు ఎందుకొప్పుకోవాలి. ఒప్పుకోను కూడా.
నా నెత్త‌ర‌లో ఉండాడు. నా న‌రాల్లో పాటై ప్ర‌వ‌హిచ్చానాడు. నా మెద‌డులో అప్ర‌య‌త్నంగా పాడుతున్నాడు. నా గుండెంతా ఆయ‌న పాట‌ల‌తో నిండిపోయింది. నా చుట్టూ అంతా ఆ బాలుడి ప‌ల్ల‌వీ, చ‌ర‌ణాల‌తో ఊయ‌లూగుతోంది. ఇట్లాంట‌ప్పుడు బాలు లేడు. అని ఎట్లా అనాల‌. బాలు మంచి అని తెల్చు. అయినా అత‌నికి చావులేదు. మ‌నందరి గుండెల్లో ఉండాడు. మీరు రేడియో, టీవీ, యూట్యూబ్.. ఏది ఆన్ చేసినా బాలు పాట ఉండాల్సిందే. ఎవ‌రు పాట‌పాడిన బాలు పాట‌ను పాడాల్సిందే.
మ‌రి బాలసుబ్ర‌హ్మ‌ణ్యం లేడు అంటారేంది వీళ్లంతా.
ఎన్ని త‌రాలు మారినా..
యుగాలు మారినా..
ఈ పాట‌ల‌బాలుడు మ‌నంద‌రి గుండెల్లో బ‌తికే ఉంటాడు.నాలాంటి ప్ర‌తి గుండెను బ‌తికిచ్చే.. ఈ పాట‌ల‌బాలుడికి పుట్టుకే కానీ మ‌ర‌ణం దేవుడు కూడా రాయ‌లేక‌పోయాడు. పాట‌ల‌తో ఎళ్ల‌కాలం జీవిస్తాడు బాలు.
ఇట్లు
ఓ బాలు అభిమాని
✍🏻✍🏻✍🏻✍🏻
రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి
25.9.20

నిత్య‌యౌవ‌నుడు గాన‌గంధ‌ర్వుడు బాలు-కె.వి.రామకృష్ణ

Collapse all
In new window
P


త‌న‌ అద్భుత గాత్రంతో వేలాది సుమధుర గీతాలకు  ప్రాణ ప్రతిష్ట చేసిన గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కోట్లాదిమంది అభిమానులను శోక సంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడటంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎమ్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేరారు. కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. గత 50 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన  సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ఆ ఆశలు అడియాసలు చేసి అనంతలోకాలకు పయనమై వెళ్లిపోయారు.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు.  ఆయన తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో నిష్ఠాతులు కావడంతో  బాలసుబ్రహ్మణ్యంకు సంగీతంపట్ల అమితాసక్తి ఏర్పడింది. చిన్నతనం నుండే పాటలు పాడటమే కాదు, పాటల పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకొన్నారు.  బాలసుబ్రహ్మణ్యం ఇంజనీరు కావాలని ఆయన తండ్రి ఎంతో ఆశపడేవారు. ఆయన కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు.  చదువుకుంటూనే పాటల పోటీలలో పాల్గొనేవారు.
చదువుకుంటున్న సమయంలోనే బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో ప్రముఖ హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర  జీవితం ప్రారంభించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన  సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణికి ఎంతగానో రుణపడి ఉంటానని అనేక సందర్భాలలో చెప్పారాయన. తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు కోదండపాణిపై భక్తితో, అభిమానంతో  ‘కోదండపాణి ఆడియో లాబ్స్’ అని పేరు పెట్టుకున్నారు ఆయన.
సినిమా రంగానికి, సంగీతానికి బాలసుబ్రహ్మణ్యం చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ని 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులతో గౌరవించింది. తమిళనాడు ప్రభుత్వం  ‘కళైమామణి’ బిరుదుతో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో విభిన్న భాషల్లో నలభై వేలకు పైగా మరపురాని ఎన్నోసుమధుర గీతాలు ఆయన గళం నుంచి వెలువడ్డాయి. తన సుమధుర గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఎంతోమంది నటులకు వారి హావభావాలకు అనుగుణంగా పాటలు పాడి జీవం పోశారు.  ఘంటసాల మాస్టారు తరువాత చిత్రసీమలో  ఆయనకు అసలైన వారసుడిగా నిలిచారు బాలసుబ్రహ్మణ్యం. స్వరంతోనే కాకుండా నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  కమల్ హాసన్, జెమిని గణేషన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మోహన్ లాల్ తదితర పలువురు హీరోలకు డబ్బింగ్ చెప్పారు.
ఆయన తమ అమృత గానంతో, గాత్ర మాధుర్యంతో  ప్రతి ఒక్కరిని తన్మయులను చేసారు. బాలసుబ్రహ్మణ్యం గాత్రం గురించి ఎంతగా వర్ణించినా తక్కువే. ఆ గొంతులో ప్రతి ఒక్కరిని సమ్మోహనం చేసే శక్తి ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కలిపి మొత్తం ఆరుసార్లు జాతీయ స్థాయిలో  ఉత్తమ గాయకుడిగా అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించారు. గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా , నటుడిగా, సంగీత దర్శకుడిగా 29 సార్లు నంది పురస్కారాన్ని అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో  ‘సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016’  అవార్డు అందుకున్నారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసారు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసారు.
కోట్లాదిమంది ప్రజలలో పరిపూర్ణత సాధించడం అనేది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. తాను చేపట్టిన వృత్తిలో శిఖరాగ్రానికి చేరుకొని ఒక చరిత్ర సృష్టించి అందరికి స్ఫూర్తిగా, అందరి మనస్సులో నిలిచిపోయిన గాన గంధర్వులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంది అటువంటి పరిపూర్ణ జీవితమే. ఆయన పాడే ప్రతి పాటలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. సన్నివేశానికి తగిన భావ వైశిష్ట్యం కలగజేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు అయిన ఆయన వివిధ భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడి సంగీతాభిమానులను అలరించారు. యుగళ గీతాలు, విషాద గీతాలు, భక్తి గీతాలు… ఇలా వైవిధ్యభరితమైన పాటలను తన మధురమైన గళంతో, స్పష్టమైన ఉచ్చారణతో అజరామరం చేసారు. సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఎన్నో తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారు

స్వ‌ర‌మాంత్రికుడు పిబి శ్రీనివాస్‌- కెవి. రామ‌కృష్ణ, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్్ట‌

స్వరములు ఏడే అయినా రాగాలు కోకొల్లలు. కానీ కొన్ని ప్రత్యేక స్వరాల మేళవింపు మాత్రమే పరిపూర్ణతను సంతరించుకుంటుంది. సప్త స్వరాల మేళవింపు అసంఖ్యాకమైన రాగాలను ఆవిష్కరిస్తుంది. ఏ భావమైన ఆ రాగాల మేళవింపుతో మనసుని అలరిస్తుంది. అటువంటి అద్భుతమైన గీతాలు కూడా పి.బి.శ్రీనివాస్ మధుర గానంతో పరిపూర్ణతను సంతరించుకుని శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. యుగళ గీతాలు, విషాద గీతాలు, భక్తి గీతాలు… ఇలా వైవిధ్యభరితమైన పాటలను తన మధురమైన గళంతో అజరామరం చేసారు పి.బి.శ్రీనివాస్. చిత్ర ప్రపంచం గర్వించతగ్గ మధుర గాయకులలో పి.బి.శ్రీనివాస్ ఒకరని నిస్సందేహంగా చెప్పవచ్చు. తన గాన మాధుర్యంతో సంగీతాభిమానులను మైమరపించారు. సెప్టెంబరు 22, 1930 సంవత్సరంలో పి.బి. శ్రీనివాస్ కాకినాడలో జన్మించారు. తండ్రి  సంస్కృత పండితులు కావటంతో  ఆయన చిన్నతనంలోనే సంస్కృతం భాషమీద  పట్టు సాధించారు. ఆయన సంగీతంలో ఓనమాలు దిద్దుకున్నది తల్లి నుంచే. గాయకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నది అయన చిరకాల వాంఛ.
1952 లో వచ్చిన “మిస్టర్ సంపత్” హిందీ చిత్రంతో తన చలనచిత్ర జీవితం ప్రారంభించారు. వాస్తవానికి అయన మాతృభాష తెలుగు అయినా కూడా కన్నడ, తమిళ చిత్రాలలోనే ఎక్కువ పాటలు పాడారు.  మహానటులు ఎన్టీఆర్, అక్కినేని కి అమర గాయకుడు ఘంటసాల తప్ప మరే గాయకుడు పాడినా సంగీత అభిమానులకు అంతగా రుచించేది కాదు. పి.బి. శ్రీనివాస్ తన గాన మాధుర్యంతో వారిద్దరికీ మరచిపోలేని ఎన్నో మధుర గీతాలను పాడారు. ప్రేమించి చూడు మూవీలో అక్కినేనికి అయన పాడిన “మీ అందాల చేతులు కందేను పాపం…, “బుచ్చబ్బాయి పని కావాలోయ్..” లాంటి పాటలు అప్పుడే కాదు, ఇప్పటికి  ఎప్పటికి నిత్య నూతనమే. ఆడబ్రతుకులో ఎన్టీఆర్ కు అన్ని పాటలను ఆయనే పాడారు. ముఖ్యంగా “బుజ్జి బుజ్జి పాపాయి..” అనే పాట ఎప్పటికి  ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ అంటారు సంగీత ప్రియులు. వివాహ బంధంలో భానుమతితో కలసి పాడిన యుగళ గీతం వింటే తెలుస్తుంది ఎంత గంభీరంగా ఆ పాటను అయన  గానం చేసారో.
ధర్మేంద్ర, మీనాకుమారి హీరో హీరోయిన్స్ గా నటించిన ‘మై భీ లడకీ హూ’ హిందీ చిత్రంలో ఆయన లతా మంగేష్కర్ తో కలసి పాడిన “చందా సె హోగా వో ప్యారా”  గీతం సంగీత ప్రియులను అలరించింది. అప్పట్లో దక్షిణాది గాయకులు హిందీ  చిత్రాల్లో పాటలు పాడటం అనేది చాలా అరుదనే చెప్పాలి. అందులోను లతా మంగేష్కర్ తో కలసి పాడటం అంటే మాములు విషయం కాదు. ముందు పి.బి. శ్రీనివాస్ ను ఎంతో తేలిగ్గా తీసుకున్న ఉత్తరాది సంగీతాభిమానులు అయన గాన మాధుర్యం విని మైమరచిపోయారు. తరువాత ఎన్ని అవకాశాలు వచ్చినా అయన మాత్రం దక్షిణాది  సినిమాలకే ప్రాధాన్యమిచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, సంస్కృతం ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడటమే కాదు, ఈయన స్వయంగా ఎన్నో గజళ్లు వ్రాసారు.  
వివిధ భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను మాత్రం  కన్నడ భాషలోనే పాడారు. మహానటుడు రాజ్‌కుమార్‌కు సుదీర్ఘ కాలం పాటు ఎన్నో అజరామరమైన పాటలను పాడారు. అయన తమిళంతో ఎం.జి.రామచంద్రన్,  శివాజీ గణేశన్ లకు పాడినప్పటికీ అయన ఎక్కువగా జెమిని గణేశన్ కు ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడారు.


తెలుగు హీరోల్లో అయన గాత్రం జగయ్య, కాంతారావు, హరనాథ్ లకు బాగా నప్పేదని అంటారు. జగయ్యకు అయన పాడిన పాటల్లో “తలచినది జరిగినదా దైవం ఎందులకు”, “ఓహో గులాబీ బాల… అందాల ప్రేమ మాల..” పాటలను ఎంతో మృదు మధురంగా పాడారు. పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో హీరో కాంతారావు కు మరచిపోలేని ఎన్నో పాటలు పాడారు. హాస్యనటులకు పాటలు పాడే సందర్భం వచ్చినప్పుడు సంగీత దర్శకులు కొంత కాలం ఎదురు చూసైనా ఆయనతోనే పాటలు పాడించుకునేవారట.


అక్కినేని హీరోగా నటించిన ‘మూగనోము’ చిత్రంలో  ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ను ముందుగా ఘంటసాల చేత పాడిదామనుకున్నారట సంగీత దర్శకులు. కానీ ఆ సమయంలో  ఘంటసాల అందుబాటులో లేకపోవడంతో ఆ పాటను పి.బి.శ్రీనివాస్ చేత పాడించారు. తరువాత అదే పాటను తిరిగి ఘంటసాల చేత పాడించారు సంగీత దర్శకులు. ఈ పాటను  పి.బి.శ్రీనివాస్ ముందుగా పాడారన్న విషయం తెలిసిన ఘంటసాల మాస్టారు పి.బి.శ్రీనివాస్ వద్దకు వెళ్లి ‘ముందుగా ఈ పాటను మీరు పాడారని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోను పాడేవాడిని కాదని’ బాధ పడ్డారట. ఘంటసాలగారి గొప్పతనం, సంస్కారం గురించి తరచూ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించేవారట అయన. తమిళనాడు ప్రభుత్వం నుంచి  కలైమామణి, పురస్కారాన్ని అందుకున్న ఆయనకు ఆరిజోనా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.
ఆయనను కలుసుకోవడానికి అభిమానులు ఏ సమయంలో వచ్చినా ఆప్యాయతతో మాట్లాడేవారు. వారు అడిగిన వాటన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానాలిచ్చేవారు. తీరిక సమయంలో  తనకెంతో ఇష్టమైన కవితలను వ్రాసుకుంటూ ఉండేవారు. మధురమైన తన గానంతో సంగీత అభిమానులను అలరించిన పి.బి. శ్రీనివాస్ ఏప్రిల్ 14, 2013లో గుండెపోటుతో  చెన్నైలో అస్తమించారు. భౌతికంగా ఆయన మనమధ్య లేకపోయినా సంగీతాభిమానుల హృదయాలలో అయన ఎప్పటికి నిలిచేవుంటారు


BOUNTIFUL KRISHNA


Krishna Mohan K.S.  secretary, Krishna District Amateur Photographers Society

న‌వ‌ర‌స న‌ట‌సామ్రాట్‌-అక్కినేని-కెవి.రామ‌కృష్ణ‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్్ట‌

సెప్టెంబర్ 20 అక్కినేని జయంతి

మహోన్నత వ్యక్తిత్వం అక్కినేని సొంతం.మౌనంగానే ఎదిగినవాడు, ఎదిగినకొద్దీ ఒదిగినవాడూ, సినీ కళామతల్లికి ముద్దుబిడ్డగా, సినీ పరిశ్రమకే పెద్ద దిక్కుగా మారినవాడూ… ఎవరు అంటే ఇంకెవరు మన అక్కినేని నాగేశ్వరావు అనే చెప్పాలి. జీవితమంతా అప్రతిహతంగా అఖండమైన విజయాలను సాధిస్తూనే కించిత్ గర్వం లేకుండా నిరాడంబరంగా, స్నేహశీలిగా, అందరితో కలసి మెలసి ఉండే ఆయన వ్యక్తిత్వం అనన్య సామాన్యం. ఆ మహానటుని జయంతి సందర్భంగా కొన్ని సుమధుర మధుర స్మృతులను గుర్తు చేసుకుందాం.
సినీ పరిశ్రమ కౌమార దశలో ఉన్నప్పుడే చిత్రసీమలో అడుగుపెట్టారు ఆయన. పరిశ్రమతో పాటుగా ఆయన కూడా అభివృద్ధి సాధిస్తూ నటుడిగా తనను తాను మలచుకున్నారు. తొలితరం జానపద హీరోగా ప్రేక్షకులను తన నటనతో ఉర్రుతలూగించారు. బయట ప్రపంచంలో భిన్న వ్యక్తులు, వ్యక్తిత్వాల మధ్య జీవిస్తూ, నటిస్తూ అపార జ్ఞానాన్ని సొంతం చేసుకుని, బడిలో నేర్చుకున్నది మాత్రమే చదువు కాదని నిరూపించారు. చదువుకున్నవారు కూడా తిరిగి చదువవలసిన పరిశోధనా గ్రంధంగా ఆయన తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు.
నటనలో ఆయన నవరసాలు పండించారు. కలల రాకుమారుడిగా వెలుగొందుతున్న తరుణంలోనే అపర భక్తునిగా నటించి అందరిని అబ్బురపరిచారు. భక్తుని పాత్రలో నటించి, భక్తి భావాన్ని రక్తి కట్టించి అందరిని మెప్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన భక్తుడిగా నటిస్తే ప్రేక్షకుల మనసులు భక్తిభావంతో నిండిపోయేవి. కోట్లాది అభిమానుల హృదయాల్లో భగవంతుని చూడగల నిజమైన ఆస్తికుడు ఆయన.
తెలుగు చిత్రసీమకు తొలి రాజకుమారుడు ఆయనే అయినా సంసారం చిత్రం తరువాత సాంఘిక చిత్రాలలో సైతం ఆయన విజయ పరంపర నిరాటంకంగా కొనసాగింది. దేవదాసు వంటి బలహీనమైన పాత్ర జీవితాన్ని అంతం చేస్తుంది కనుక, అలాంటి బలహీనతలకు లొంగకూడదనే గుణపాఠాన్ని నేర్చుకోవాలనే సందేశం ఆ పాత్ర కలుగజేస్తుందని, కనుకనే ఆ పాత్ర తనకెంతో స్ఫూర్తిదాయకం అని తరచూ అనేవారు ఆయన.
రొమాంటిక్ హీరో అనే పదానికి పర్యాయపదంగా మారారు అక్కినేని. అమెరికాలో గుండె ఆపరేషన్ తరువాత ఆయన రెట్టించిన ఉత్సహంతో వెండితెర చందమామలా వెలుగొందారు. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో అనితరసాధ్యమైన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సుదీర్ఘ తన నటనా ప్రస్థానంలో మరచిపోలేని ఎన్నో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసారు అక్కినేని.
దిగ్గజాల వంటి బహుముఖ ప్రజ్ఞశాలులైన కళాకారులతో, దర్శకులతో, రచయితలతో పని చేసిన అనుభవంతో అయన తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నారు. మంచి పాత్రను ఒక ఆశీర్వాదంగా భావించి భక్తిగా, శ్రద్దగా, వృత్తిపట్ల నిబద్దతతో జీవించి పలువురికి మార్గదర్శకులుగా నిలిచారు ఆయన. అభిరుచిగల నిర్మాతగా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలసి “చక్రవర్తి చిత్ర” పతాకంపై “సుడిగుండాలు”, “మరో ప్రపంచం” వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించారు.
సన్మానాలు, సత్కారాలకన్నా కూడా తాను ధరించిన పాత్రల గురించి విశ్లేషించడమే నిజమైన సత్కారం అని తరచూ అంటుండేవారు ఆయన. హీరోయిన్ తో కలసి హుషారుగా స్టెప్పులేసి అభిమానుల గుండెలను కొల్లగొట్టారు. సొగసైన నాట్యంతోపాటు కొంటె చూపులతో, చక్కని హావభావాలతో పాటలను మరింత రక్తి కట్టించారు. మాటలలో వర్ణించలేని సున్నితమైన మనోభావాలను తన హావభావాలతో వ్యక్తపరిచేవారు అక్కినేని. –
తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు, విరాళాలు, ఎన్నో గుప్తదానాలు అందించారు. నిజ జీవితంలో నటించడాన్ని ఏవగించుకునే అక్కినేని నట జీవితంలో తాను దైవంగా భావించే వృత్తిలో చివరి అంకం వరకూ అంకితమవ్వాలనే కోరుకున్నారు. తన సుదీర్ఘ నటనా ప్రస్థానంలో అనితరసాధ్యమైన ఎన్నో పాత్రల్లో నటించి, మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను మెప్పించారు.
నిజ జీవితంలో నటించడం ఆయనకు అలవాటులేదు. నట జీవితంలో జీవించడం తప్ప నటించడం ఆయనకు చేతకాదు. నటుడిగా ఆయన అందుకోని అవార్డు లేదు, పొందని సత్కారం లేదు. ఆయన నటనను మాములు మాటలతో వివరించడం ఒక విధంగా సాహసమే అవుతుంది. చివరిదాకా నటనలోనే జీవించాలని, తుదిశ్వాస విడిచేదాకా తెరపైన నటిస్తూనే ఉండాలన్నది అక్కినేని ప్రగాఢ వాంఛ. ‘మనం’ చిత్రంలో నటిస్తూనే తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారు ఆయన. దటీస్ అక్కినేని.

సాకర్ స్టార్ కోసం క్రౌడ్ ఫండింగ్-బార్సిలోనాకు మెస్సీ దూరమైనట్లేనా? CH.V.KRISHNA RAO, SPORTS EDITOR

ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్, స్పానిష్ సాకర్ క్లబ్ బార్సిలోనాకు గత 12 సంవత్సరాలుగా ఆడుతున్న లయనల్ మెస్సీ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తన క్లబ్ నిర్వహించిన కరోనా టెస్ట్ తో పాటు…సీజన్ తొలి శిక్షణశిబిరానికి డుమ్మా కొట్టడం ద్వారా కలకలం రేపాడు.
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకొంటున్న మెస్సీ..బార్సిలోనా క్లబ్ తో తన చిరకాల కాంట్రాక్టును రద్దు చేసుకొని వేరే క్లబ్ లో చేరాలని భావిస్తున్నట్లు సాకర్ వర్గాలు అంటున్నాయి.మరోవైపు…మెస్సీ లాంటి మహా ఆటగాడిని భరించడం లేదా కొనుగోలు చేయాలంటే వందల కోట్ల యూరోలు అవసరమని, ఆ శక్తితమకు లేదని యూరోప్ లోని పలు ప్రముఖ సాకర్ క్లబ్ లో వాపోతున్నాయి.
అయితే…జర్మనీకి చెందిన వీఎఫ్ బి స్టుట్ గార్ట్ క్లబ్ అభిమానులు మాత్రం…ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్, స్పానిష్ సాకర్ క్లబ్ బార్సిలోనాకు గత 12 సంవత్సరాలుగా ఆడుతున్న లయనల్ మెస్సీ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తన క్లబ్ నిర్వహించిన కరోనా టెస్ట్ తో పాటు…సీజన్ తొలి శిక్షణశిబిరానికి డుమ్మా కొట్టడం ద్వారా కలకలం రేపాడు..
బార్సిలోనా పై మెస్సీ గరంగరం…
బార్సిలోనా క్లబ్ కు గత పుష్కరకాలంగా అసమానసేవలు అందించిన తనకు…బదిలీ రుసుము చెల్లించకుండా వేరే క్లబ్ లో చేరే హక్కు తనకు ఉందని, ట్రాన్స్ ఫర్మ నీ లేకుండా తనను విడిచిపెట్టాలని మెస్సీ తన లాయర్ ద్వారా సమాచారం అందించాడు. అయితే బార్సిలోనా క్లబ్ వర్గాలు మాత్రం..మెస్సీని వేరే క్లబ్ కు బదిలీ చేయాలంటే తమకు 700 మిలియన్ యూరోలు ( 833 మిలియన్ డాలర్లు ) చెల్లించాల్సిందేనని పట్టుబడుతోంది.స్టుట్ గార్ట్ క్లబ్ సాకర్ అభిమానులు ఇప్పటికే …గో ఫండ్ కామ్…ద్వారా భారీగా నిధుల సేకరణను ఓ ఉద్యమంలా చేపట్టారు. మెస్సీ కోసం గడువు లోపల నిధులు సేకరించలేని పక్షంలో…వసూలైన మొత్తాన్ని వియా కాన్ అగువా అనే స్వచ్చంధ సంస్థకు అందచేస్తామని ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛమైన తాగునీరును అందించడానికి పాటుపడుతున్న స్వచ్చంధ సంస్థగా వియా కాన్ అగువాకు పేరుంది.
ఒకే ఒక్కడు లయనల్ మెస్సీ…
యూరో సాకర్ లీగ్ లో లయనల్ మెస్సీ సాధించిన ఘనత అంతాఇంతాకాదు. అర్జెంటీనాకు ప్రపంచ సాకర్ టైటిల్ అందించడంలో విఫలమైన మెస్సీ…యూరోక్లబ్ సాకర్ లోమాత్రం బార్సిలోనా క్లబ్ ను కేవలం తన సాకర్ మ్యాజిక్ తో అత్యంత విజయవంతమైన క్లబ్ గా నిలిపాడు. కేవలం మెస్సీ పేరుతోనే డజన్ల కొద్దీ అరుదైన, అసాధారణ రికార్డులు ఉన్నాయి.గత 12 సంవత్సరాలుగా బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్ కు మూలస్తంభంలా ఉన్న 33 సంవత్సరాల మెస్సీ..గత 16 సీజన్లలో మొత్తం 34 టైటిల్స్ అందించాడు. ఇందులో
4 చాంపియన్స్ లీగ్, 10 లా లీగా టైటిల్స్ సైతం ఉన్నాయి.వ్యక్తిగతంగా అరడజను బాలన్ డీ ఓర్ ట్రోఫీలు, ఆరు యూరోపియన్ గోల్డెన్ షూస్ అవార్డులు అందుకొన్నాడు.

             గోల్స్ కింగ్ లయనల్.....

రియల్ మాడ్రిడ్ ప్రత్యర్థిగా జరిగిన ఎల్ క్లాసికో మ్యాచ్ ల్లో ఏకంగా 26 గోల్స్ సాధించిన ఒకే ఒక్కడు లయనల్ మెస్సీ మాత్రమే కావడం విశేషం. 2012 సాకర్ సీజన్లోతన క్లబ్, దేశం తరపున 91 గోల్స్ సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పిన తొలి, ఏకైక ఆటగాడు లయనల్ మెస్సీ మాత్రమే. గోల్స్ కింగ్ లయనల్…లా లీగా చరిత్రలో అత్యధికంగా 444 గోల్స్ సాధించిన తొలి, ఏకైక ఆటగాడి ఘనత సైతం మెస్సీకే దక్కుతుంది. బార్సిలోనా క్లబ్ ఆటగాడిగా ఆడిన మొత్తం మ్యాచ్ ల్లో మెస్సీ ఒక్కడే 634 గోల్స్ సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
లా లీగాలో అత్యధికంగా 36 హ్యాట్రిక్ లు సాధించిన ఘనుడు కూడా లయనల్ మెస్సీ మాత్రమే. వరుసగా పది సీజన్లపాటు ఏడాదికి 40 గోల్స్ చొప్పున నమోదు చేసిన మొనగాడుగా మెస్సీ నిలిచాడు.ఇంతటి ఘనత ఉన్న మెస్సీ లాంటి సాకర్ మాంత్రికుడుని బార్సిలోనా క్లబ్ అంత తేలికగా విడిచిపెడుతుందా?..అనుమానమే. జూన్ 10తో బార్సిలోనా క్లబ్ తో మెస్సీ కాంట్రాక్టు గడువు ముగియనుంది.
ఆగస్టు 23న జరిగిన చాంపియన్స్ లీగ్ ఫైనల్లో చివరిసారిగా బార్సిలోనా క్లబ్ తరపున ఆడిన మెస్సీకి 60 మిలియన్ యూరోలు వేతనంగా ఉంది.మెస్సీ కోసం క్యూకట్టిన విఖ్యాత సాకర్ క్లబ్ ల్లో ఇంగ్లండ్ కు చెందిన మాంచెస్టర్ సిటీ, ఫ్రాన్స్ కు చెందిన పారిస్ సెయింట్ జెర్మోన్, ఇటాలియన్ క్లబ్ యువెంటస్, ఇంటర్ మిలాన్ ఉన్నాయి.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్

భాషాజ్ఞాని గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ, ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు అంటూ మోదీ తెలుగులోనే ట్వీట్ చేశారు.

తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్రవేసిన గిడుగు వెంకట రామ్మూర్తి గారికి ఇవాళ నివాళులు అర్పిస్తున్నాను అంటూ మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, నేడు విద్యార్థులతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టోనీ అనే తెలుగు విద్యార్థితో మాట్లాడుతూ తనకు తెలుగు బాగా వచ్చని చమత్కరించారు. టోనీ తెలుగులో మాట్లాడిన కొన్ని మాటలు విని, చూడు… నాకెంత బాగా అర్థమైందో! అంటూ నవ్వేశారు.

విదేశాలనుంచి వచ్చే వారికి తెలంగాణ కొత్త క్వారంటైన్‌ నిబంధనలు

వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తున్న ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. ఇకపై హైదరాబాద్‌కు వస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పేర్కొన్న నిబంధనలకు లోబడి ఇప్పుడు సరాసరి తమ ఇళ్లకు వెళ్లిపోవచ్చు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల శాఖ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, విదేశాల నుంచి వస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులకు పలు సడలింపులు ఇచ్చారు.

విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఇచ్చిన సడలింపులు

4 రోజుల్లోపు రిటర్న్ టిక్కెట్లతో వ్యాపానిమిత్తం తెలంగాణకు వచ్చే ప్రయాణీకులు, వారు బయలుదేరడానికి ముందు 96 గంటలలోపు నిర్వహించిన నెగటివ్ RT-PCR పరీక్ష నివేదికను చూపిస్తే వారికి ఎలాంటి క్వారంటైన్ ఉండదు.
బయలుదేరడానికి 96 గంటల ముందు నిర్వహించిన నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టుతో ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వారు కేవలం 14 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి.
నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తూ, వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులలోని కొన్ని విభాగాలకు సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వీరు కేవలం 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలి. వీరిలో గర్భిణులు, 10 లేదా అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణిస్తున్న వాళ్లు లేదా వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్న వాళ్లు ఉన్నారు.
అయితే నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) మిగతా ప్రయాణికులు మాత్రం తప్పనిసరిగా 7 రోజుల సంస్థాగత క్వారంటైన్, దాని తర్వాత హోం క్వారంటైన్ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ‘ఎయిర్ బబుల్ ఒప్పందాల’ ద్వారా యూకే, యూఏఈ దేశాలతో కనెక్ట్ అయి ఉంది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ హైదరాబాద్, లండన్‌ల మధ్య వారానికి నాలుగు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్- యూఏఈల మధ్య నడిచే ఇతర ఎయిర్‌లైన్స్– ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్‌లు కూడా త్వరలో తమ సేవలను ప్రారంభించనున్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి ‘వందే భారత్ మిషన్’ కింద ఛార్టర్ విమానాలు (వీటిలో ఎయిర్ ఇండియా విమానాలు కూడా ఉన్నాయి), ఇతర విదేశీ విమాన సర్వీసులు కూడా (నిబంధనలకు లోబడి) వస్తున్నాయి. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన 55,000 మందికి పైగా భారతీయులు నగరానికి రాగా, 10,000 మందికి పైగా వివిధ దేశాలకు చెందిన వారు హైదరాబాద్ నుంచి తమ దేశాలకు తరలి వెళ్లారు.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్‌ను పూర్తిగా శానిటైజ్ చేసి, అక్కడ థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలను కఠినంగా పాటిస్తున్నారు. విమానం దిగే ప్రయాణికులు, వైమానిక సిబ్బందిని విమానం నుంచి 20-25 మందిని ఒక బృందంగా తీసుకువస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలు పూర్తి చేయడానికి ముందు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం, ప్రతి ప్రయాణికుడు/వైమానిక సిబ్బందిని ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎయిరోబ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన థర్మల్ కెమెరాలతో స్ర్కీనింగ్ చేస్తున్నారు. ప్రతి ఇమిగ్రేషన్ కౌంటరు వద్ద ప్రయాణికులు, ఇమిగ్రేషన్ అధికారులు ఒకరినొకరు తాకకుండా ఉండేందుకు గాజు అద్దాలను బిగిందారు. ప్రతి బ్యాగేజీని బ్యాగేజ్ బెల్టుతో అనుసంధానం చేసిన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా శానిటైజ్ చేస్తున్నారు. పూర్తిగా శానిటైజ్ చేసిన ట్రాలీలను ప్రయాణికుల కోసం సిద్ధంగా ఉంచారు.

అమరావతి కేసులో పిటిషన్ దాఖలు చేయనున్న జనసేన

ఏపీ రాజధాని అమరావతి తరలింపు అంశంలో హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని జనసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ముఖ్యనేతలతో అధ్యక్షుడు పవన్‌ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఏకాభిప్రాయానికి వచ్చామని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదని ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో తుదివరకు బాధ్యతగా నిలబడతామన్నారు. అమరావతి విషయంలో జనసేన మొదట్నుంచీ స్పష్టంగా ఉంది. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదనేది తమ అభిప్రాయని చెప్పారు. ఇప్పటికే అమరావతిలో కొన్ని నిర్మాణాలు చేపట్టారు. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. రాజధాని కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయలను వెచ్చించారు. పర్యావరణ సహిత రాజధాని నిర్మాణం జరగాలని చెబుతూ వస్తున్నామని పవన్‌ కళ్యాణ్ అన్నారు.